Jaan Say లైఫ్‌లో రిస్క్ తీసుకోకపోతే కష్టం.. కథ నన్ను నడిపించింది.. డైరెక్టర్ కిరణ్ కుమార్
క్రితి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎస్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జాన్ సే. అంకిత్, తన్వి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందింది. లవ్ స్టోరీ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాకు సచిన్ కమల్ మ్యూజిక్ అందించారు. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా గురించి యాంకర్ మంజూష అడిగిన ప్రశ్నలకు చిత్ర యూనిట్ ఇచ్చిన సమాధానాలు ఏమిటంటే?
జాన్ సే చిత్రం లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌తో సాగే క్రైమ్ థ్రిల్లర్. టైటిల్ వెనుక రెండు అంశాలు ఉన్నాయి. జాన్ సే (ప్రాణంతో) అనే లవ్ యాంగిల్, అలాగే జాన్ Say అనే విధంగా మరో కోణం ఉంటుంది. నా మదిలో మెదిలే సంఘటనలు, ఆలోచనలను తెరపైన చెప్పాలనే ఆసక్తి నన్ను దర్శకుడిని చేసింది. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం నా మదిలో పుట్టిన ఆలోచనకు కథా రూపమే జాన్ సే. అన్ని రకాల జనార్స్‌లో విభిన్నమైన కథలతో సినిమాలు చేసి ఆల్‌రౌండర్ అనిపించుకోవాలనుకొన్నదే నా కోరిక అని దర్శకుడు ఎస్ కిరణ్ కుమార్ తెలిపారు.

నాకు సినిమా పరిశ్రమతో అనుబంధం ఏదు. నేను ఎవరి వద్ద కూడా వర్క్ చేయలేదు. కథ నన్ను దర్శకుడిగా మార్చింది. ఏదో నమ్మకంతో సినిమాను ప్రారంభించాను. కానీ ప్రొడక్షన్‌లోకి దిగిన తర్వాత మహా సముద్రం అనిపించింది. లైఫ్‌లో రిస్క్ తీసుకోకపోతే ముందుకు వెళ్లలేమనేది విషయాన్ని నేను నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఈ సముద్రాన్ని ఈదుతున్నాను అని ఎస్ కిరణ్ కుమార్ అన్నారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి తెలివి తేటలు, ఝాన్సీ లక్ష్మీభాయ్‌లో ఉండే తెగువ కలిసి ఉండే అమ్మాయి ప్రస్తుతం సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఫేస్ చేస్తుంది అనే ప్రధానమైన పాయింట్‌తో కథను తెరకెక్కించారు. ఆరంభంలో నాపై చాలా అనుమానాలు ఉండేవి. సినిమా తీయగలడా అనే సందేహాలు వ్యక్తం చేశారు. కానీ నాపై నమ్మకం ఉంచి సినిమా తీయాలనే వారితో నేను జతకలిశాను అని ఎస్ కిరణ్ కుమార్ చెప్పారు.

జాన్ సే టైటిల్ చివర త్రీ డాట్స్ వెనుక ఓ లాజిక్ ఉంది. ఆ మూడు డాట్స్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను సూచిస్తాయి. ఆ ముగ్గురిలో రెండు పాత్రలను త్వరలోనే పరిచయం చేస్తాను. మూడో పాత్ర మాత్రం సినిమాలోనే చూడాలి. అప్పటి వరకు అదే సస్పెన్స్ అని ఎస్ కిరణ్ కుమార్ చెప్పారు. ఈ సినిమాలో నటించిన వారంతా బాగా చేశారు. వాళ్ళందరి సపోర్ట్‌తో కేవలం 22 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాను అని ఎస్ కిరణ్ కుమార్ తెలిపారు.


Click it and Unblock the Notifications











