'భరత్‌ అనే నేను' ఎప్పుడో రాసుకొన్న కథ.. మొత్తం నాలుగు గంటల సినిమా.. కొరటాల

By Rajababu

Recommended Video

Koratala Shiva Talks About Barath Ane nenu

'శ్రీమంతుడు' వంటి ఇండ్రస్టీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించిన సూపర్‌స్టార్‌ మహేశ్‌ సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రానికి భారీ క్రేజ్‌ ఏర్పడింది. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ప్రేక్షకులు, అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. ఏప్రిల్‌ 20న 'భరత్‌ అనే నేను' చిత్రం ప్రపంచవ్యాప్తంగా హైయ్యస్ట్‌ థియేటర్లలో రిలీజ్‌ అవుతోంది.

డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. ఈ చిత్రాన్ని అత్యధిక బడ్జెట్‌తో నిర్మించారు. రిలీజ్‌ సందర్భంగా ఏప్రిల్‌ 19న హైదరాబాద్‌ జూబ్లీ రిడ్జ్‌ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ, స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.వి.వి దానయ్య, ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.

 చాలా కష్టపడి పనిచేశాం..

చాలా కష్టపడి పనిచేశాం..

సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ మాట్లాడుతూ - ''సినిమా ప్రమోషన్‌ బిగినింగ్‌ నుంచి ఇప్పటివరకు చాలా హైప్‌ వచ్చింది. ఇంత హైప్‌ రావడానికి, పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ నా థాంక్స్‌. లాస్ట్‌ వన్‌ వీక్‌ నుండి మా టీమ్‌ అంతా డే అండ్‌ నైట్‌ కష్టపడి వర్క్‌ చేశాం. పెద్ద కాన్వాస్‌ వున్న ఫిల్మ్‌కి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌. ఈ సినిమా త్వరగా ఫినిష్‌ అవడానికి మా టీమ్‌ అంతా చాలా సపోర్ట్‌ చేశారు. అందరికీ పేరు పేరునా నా థాంక్స్‌ అని అన్నారు.

మహేష్‌బాబు సపోర్ట్‌కు థ్యాంక్స్

మహేష్‌బాబు సపోర్ట్‌కు థ్యాంక్స్

భరత్ అనే నేను కథ ఎప్పుడో రాసుకున్నాను. మహేశ్‌ స్క్రిప్ట్‌ ఒకసారి విని, ఓకే చేసిన తర్వాత ఎంతో ఇన్‌వాల్వ్‌ అయి ది బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇస్తారు. సినిమాలో ఇన్‌వాల్వ్‌ అయి, పర్సనల్‌గా చాలా కేర్‌ తీసుకొని ఈ సినిమా చేశారు. కథ వినగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంది. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఇంత స్పాన్‌ వున్న కథ రాయడం చాలా కష్టం సార్‌ అన్నారు. ఆయన ఇచ్చిన సపోర్ట్‌కి స్పెషల్‌ థాంక్స్‌. సినిమా అంతా పూర్తయింది. ఫస్ట్‌ కాపీ రెడీ అయ్యింది. ఓవర్సీస్‌ ప్రింట్స్‌ కూడా వెళ్లాయి అని కొరటాల తెలిపారు

పొలిటికల్‌ టచ్‌తో భరత్ అనే నేను

పొలిటికల్‌ టచ్‌తో భరత్ అనే నేను

భరత్ అనే నేను రెగ్యులర్‌ సినిమా కాదు. కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటూ పొలిటికల్‌ టచ్‌తో వుంటుంది. ఇలాంటి సినిమాకి పాటలు కథకి అనుగుణంగా ఉండాలి. ఆడియన్స్‌ని ఆ మూడ్‌లో కూర్చోబెట్టాలి అని చాలా కేర్‌ తీసుకున్నాం. దేవి శ్రీ ప్రసాద్ కథ విని దానికి తగ్గట్లుగా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. అందుకు దేవికి హ్యాట్సాఫ్‌. రామజోగయ్యశాస్త్రి సిట్చ్యుయేషన్‌ని అర్థం చేసుకొని లిరిక్స్‌ రాశారు. వారిద్దరికీ స్పెషల్‌ థాంక్స్‌.

అందంగా ప్రజెంట్ చేశారు..

అందంగా ప్రజెంట్ చేశారు..

భరత్ అనే నేను సినిమాకి రవి కె. చంద్రన్‌, తిరు ఇద్దరు టాప్‌ కెమెరామెన్స్‌తో వర్క్‌ చేసే అవకాశం దక్కింది. వారితో పని చేసినప్పుడల్లా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చు. మేకింగ్‌ వైజ్‌గా వారి దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇద్దరూ సినిమా అందంగా ప్రజెంట్‌ చేశారు. వారికి నా సిన్సియర్‌ థాంక్స్‌ అని కొరటాల అన్నారు.

డీవీవీ దానయ్య కాంప్రమైజ్ కాకుండా

డీవీవీ దానయ్య కాంప్రమైజ్ కాకుండా

నిర్మాత దానయ్య కాంప్రమైజ్‌ అవకుండా గారు సినిమాని గ్రాండ్‌గా నిర్మించారు. వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ప్రొడ్యూసర్‌. నెక్స్‌ట్‌ ఆయన చరిత్రని మార్చబోయే సినిమాలను తీస్తున్నారు. పెద్ద కంటెంట్‌ వున్న సినిమా. రెండు పార్ట్‌లుగా తియ్యాల్సిన సినిమా. నాలుగు గంటలు వచ్చింది. ప్రతి సీన్‌, ప్రతి షాట్‌ అద్భుతంగా చేశాం. అంత పెద్ద స్పాన్‌ వున్న సినిమాని మూడు గంటల్లో కుదించి శ్రీకర్‌ ప్రసాద్‌ అద్భుతంగా ఎడిట్‌ చేశారు. మేం కావాలనుకున్న సీన్స్‌ అన్నీ వుంచి సినిమాని గ్రిప్పింగ్‌గా చేశారు. అందుకే ఆయన బెస్ట్‌ ఎడిటర్‌ అయ్యారు'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X