సుకుమార్ అర్ధరాత్రి సినిమా చూస్తుండగా.. కారులో ఆయన ఇంటి చుట్టూ.. డైరెక్టర్ లక్ష్మణ్ కార్య
తెలుగు సినిమా అందించిన విలక్షణ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం మారుతి నగర్ సుబ్రమణ్యం. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్నది. ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ..
మా స్వస్థలం తిరుపతి. నా ఫ్రెండ్‌కు యాక్టింగ్ ఇష్టం ఉండటంతో వీడియోలు నాతో చేయించుకోనే వాడు. వాడి వీడియోలన్నీ నేను షూట్ చేశాను. అతడికి ఓంకార్ జీనియస్ టెలివిజన్ షోకు ఆడిషన్ పిలుపు వచ్చింది. ఆ సమయంలో నేను అతడితో వెళ్లాను. తన వీడియోలు చూసి ఓంకార్ ఈ వీడియోలు ఎవరు తీశారని అడిగారు. దాంతో నన్ను పరిచయం చేయడం, ఆ షోకు ఇద్దరు సెలెక్ట్ అయ్యాం. నాకు ఇష్టమైన డైరెక్టర్ దేవ కట్టాతో కలిసి ఆటో నగర్ సూర్యకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేశాను అని లక్ష్మణ్ కార్య తెలిపారు.

నేను డైరెక్టర్‌గా ప్రయత్నాలు చేస్తూ ఓ కథ నిహారికకు చెప్పాను. అదే హ్యాపి వెడ్డింగ్. ఆ కథ బాగుందని తెలిసిన దేవా కట్టా తనకు కథ చెప్పమని చెప్పాడు. కథ విన్న తర్వాత తను, సింగర్ స్మిత కలిసి ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తప్పులు తెలుసుకోవడానికి 6 నెలలు పట్టింది అని అన్నారు.
మారుతి నగర్ సినిమా కథకు మూలం మా ఇంట్లో జరిగిన ఓ సంఘటన. నా భార్య ఫోన్‌కు భారీగా డబ్బు జమ అయినట్టు ఓ మెసేజ్ వచ్చింది. ఆ సమయంలో ఆ డబ్బును ఏం చేయాలి అనే సందిగ్దంలో పడిన హైరానా నాకు బాగా నచ్చింది. అలాంటి పాత్రను చేయడానికి ఓ నటుడు కావాలి. ఆ సమయంలో నేను కేజీఎఫ్ 2 లో రావు రమేష్ క్యారెక్టర్ చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అప్పుడే నేను రావు రమేష్ అయితే నా సినిమాకు కరెక్ట్ అయ్యాను అని చెప్పారు.
రావు రమేష్ వద్దకు వెళ్లి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు అతడు క్యాజువల్‌గానే ఉన్నారు. నేను కథ చెప్పడానికి సిద్దమై .. సాధారణంగా మనిషి జీవితంలో కష్టాలు ఉంటే.. కథ అవుతుంది. అష్టకష్టాలు ఉంటే కామెడీ అవుతుంది అని చెప్పాను. ఆ డైలాగ్ వినగానే చాలా ఎక్సైట్ అయి కథను వినడానికి సిద్దమయ్యారు. 30 నిమిషాలపాటు కథ చెప్పిన తర్వాత వెంటనే ఆయన ఒప్పుకొన్నాడు అని లక్ష్మణ్ కార్య వెల్లడించారు.
నా భార్యకు సుకుమార్ సతీమణి పరిచయం. ఓ సందర్భంలో మా సినిమా గురించి చెబితే ఆసక్తి చూపారు. ఆ తర్వాత సుకుమార్‌కు చెబితే.. పూర్తిగా చేయగలిగితే మీరు ఇన్వాల్వ్ కావాలని ఆయన సూచించారు. దాంతో సుకుమార్ భార్య తబిత ఈ సినిమాలో భాగమయ్యారు. ఆ తర్వాత ఆమె సినిమా చూపిస్తూ.. మాది చిన్న సినిమా. ఎక్కువగా అంచనాలు పెట్టుకొకుండా సినిమా చూడండి అడిగాను. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చారు. ఇంత అద్బుతమైన సినిమా చేసి చిన్న సినిమా అని చెప్పి మోసం చేశావు అని నన్ను ప్రశంసించారు.
అయితే సుకుమార్‌కు మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా చూపించడానికి ప్రయత్నించాను. పుష్ప 2 సినిమా బిజీలో ఉండి వీలు కాలేదు. ఓ రోజు జ్వరంతో బాధపడుతుండటం వల్ల పుష్ప 2 షూటింగ్ వాయిదా పడింది. అర్ధరాత్రి సమయంలో నా సినిమా చూస్తున్నారనే మెసేజ్ వచ్చింది. ఆ సమయంలో ఆయన సినిమా చూస్తున్నంత సేపు అతడి ఇంటికి పరిసరాల్లో కారులో తిరిగాను. సినిమా చూసి కాల్ చేస్తాడని అక్కడే తచ్చాడుతున్నాను. సినిమా చూసిన తర్వాత నాకు కాల్ చేసి భలే సినిమా చేశావు. ప్రతీ పాత్రను బాగా వాడావు. ట్విస్టులు అదిరిపోయాయి అంటూ నన్న అభినందించడం మరిచిపోలేనిది అని లక్ష్యణ్ కార్య అన్నారు.


Click it and Unblock the Notifications











