Lokesh Kanagaraj: విజయ్ తో లోకేశ్ కనగరాజ్ గొడవలు - నవ్వుతూనే స్ట్రాంగ్ రిప్లె ఇచ్చిన దర్శకుడు

Lokesh Kanagaraj: స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, హీరో విజయ్ దళపతి కాంబోలో వస్తున్న క్రేజీ సినిమా లియో గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం విషయంలో నటుడు విజయ్ కు, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కు మధ్య వివాదాలు తలెత్తాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. నెట్టింట మొత్తం ఇదే చర్చ సాగింది. అనేక ఛానెళ్లు, వెబ్ సైట్లలో కూడా ఈ విషయంపై వార్తలు వచ్చాయి. ఇన్నాళ్లూ వీటిపై అటు డైరెక్టర్ కాని ఇటు హీరో దళపతి కానీ స్పందించలేదు. కానీ తాజాగా జరిగిన లియో సినిమా ప్రమోషన్లలో ఈ విషయంపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ స్పందించారు.

విజయ్ తో తనకు మనస్పర్థలు ఉన్నాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని కొట్టి పడేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా చెబుతూనే నవ్వారు. నెట్టింట, పలు వార్తా ఛానెళ్లలో వస్తున్న ఈ వార్తలను చూసి తాను, విజయ్ కలిసి చాలా నవ్వుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు తాను ఎంతో మంది నటులతో కలిసి పని చేశానని వివరించారు. ఎంత మందితో పని చేసినా ఒక్క విజయ్ ను మాత్రమే తాను అన్నా అని పిలుస్తానని.. తమ మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. అది తెలియని పలువురు పిచ్చి వార్తలు రాశారని అన్నారు. ఇలాంటి వార్తలు తమ మధ్య బంధాన్ని ఏమాత్రం పాడు చేయలేవని.. ఇవన్నీ తమకు చాలా కామెడీగా అనిపిస్తాయని లోకేశ్ కనకరాజ్ వెల్లడించారు.

Director Lokesh Kanagaraj

ఇదిలా ఉండగా.. లియో ట్రైలర్ ను హీరో విజయ్ కు చూపించానని డైరెక్టర్ వెల్లడించారు. అయితే దాన్ని మూడు సార్లు రిపీట్ మోడ్ లో చూశారని గుర్తు చేశారు. దళపతి విలన్లతో చేసే ఫైట్ సీక్వెన్స్ ను దాదాపు 20 రోజులు షూట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను ఇలాంటి ఫైట్ సీన్ ను తెరకెక్కించలేదని వివరించారు. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జగదీష్ పళని స్వామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లియో సినిమాలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

Director Lokesh Kanagaraj

అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ ఐదో తేదీన విడుదల అయిన లియో ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచి అనేక రికార్డులను సృష్టించింది. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో తెలుసుకోవాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X