Tillu Square అనుపమ పరమేశ్వరన్‌ను అందుకే బోల్డ్‌గా చూపించాం.. 100 శాతం న్యాయం..మల్లిక్ రామ్
డీజే టిల్లూ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకొన్నది. టిల్లూ పాత్రను పోషించిన సిద్దు జొన్నలగడ్డ ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు. అలాంటి కల్ట్ సినిమాకు సీక్వెల్‌గా టిల్లూ స్వ్కేర్ మార్చి 29న రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా గురించి దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ..
సిద్దూ జొన్నలగడ్డతో నేను మరో సినిమా కోసం పనిచేస్తున్నాను. అయితే సిద్దూ, విమల్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకొన్నది. అయితే విమల్ మరో సినిమా చేయడానికి రెడీ అవ్వడంతో.. నేను సిద్దూ చేయాలనుకొన్న ప్రాజెక్టును పక్కన పెట్టి టిల్లు స్క్వేర్ చేయాల్సి వచ్చింది. అలా నేను డీజే టిల్లూ సీక్వెల్‌లో భాగం అయ్యాను అని దర్శకుడు మల్లిక్ రామ్ తెలిపారు.

డీజే టిల్లు సినిమా సక్సెస్ విషయంలో డైరెక్టర్ విమల్ కంటే సిద్దూకే ఎక్కువ పేరు వచ్చింది. అయితే సిద్దూ రచయితగా కొత్తగా ఆలోచిస్తాడు. సినిమా కథలో భాగమవుతాడు. నేను మాత్రం సినిమా డైరెక్ట్ చేయగలను. ఒకరు రాసిన కథలను నేను బాగా అర్దం చేసుకొని తీయగలను. ప్రశాంత్ వర్మ రాసిన కథతో అద్బుతం అనే సినిమా తీశాను. ఇప్పుడు సిద్దూ రాసిన కథతో టిల్లు స్వ్కేర్ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అయితే అది సిద్దూకే క్రెడిట్ దక్కాలని కోరుకొంటాను అని మల్లిక్ రామ్ అన్నాడు.

డీజే టిల్లు సినిమా రాధిక క్యారెక్టర్ యాంగిల్‌లో కథ నడుస్తుంది. సిద్దూకు జరిగిన చేదు అనుభవం నుంచి భయపడిన తర్వాత లిల్లీ అతడి జీవితంలోకి వస్తుంది. అయితే ఈ సినిమాలో రాధికకు సంబంధించిన కొన్ని సీన్లు ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని కథ మొదలవుతుంది. లిల్లీ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ గొప్పగా నటించింది అని దర్శకుడు చెప్పారు.
లిల్లీ పాత్రకు ఎవరైనా న్యాయం చేస్తారంటే.. అది అనుపమ మాత్రమే అనేంతగా పెర్ఫార్మెన్స్ చేసింది. సహజంగా అనుపమ గొప్ప నటి. ఒక ఛాలెంజింగ్ రోల్‌ను అనుపమ చేసింది. ఆ రోల్ కోసం చాలా మంది హీరోయిన్లను వెతికాం. కానీ అనుపమనే చివరకు కరెక్ట్ అనే ఫీలింగ్‌తో ఉండి.. ఆమె డేట్స్ లేకపోయినా మేము ఆమె కోసం ఆగాం అని దర్శకుడు చెప్పారు.

రౌడీభాయ్ సినిమా నేను చూడలేదు. కానీ ఆ సినిమాలో లిప్‌లాక్ చేసిందనే విషయం తెలుసు. కానీ ఆ సినిమా బేస్ చేసుకొని మాత్రం అనుపమను తీసుకోలేదు. ఈ సినిమాలో అడల్డ్ సీన్లు లేవు. యూత్‌ఫుల్ సీన్లు మాత్రమే ఉంటాయి. నేటితరం అమ్మాయిలకు ప్రవర్తన, తీరుకు అద్దం పట్టే పాత్ర. మేము బోల్డ్‌గా చూపించాలని అనుకోలేదు. ఆ పాత్ర నేచర్ అలాంటిది. ఆమె 100 శాతం ఆ పాత్రకు న్యాయం చేసింది అని మల్లిక్ రామ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











