For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అను ఇమ్మాన్యుయేల్‌కు ఇగో ఎక్కువ.. మారుతి కామెంట్

    By Rajababu
    |

    భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు భారీ సక్సెస్‌ల తర్వాత మారుతి రూపొందించిన చిత్రం శైలజారెడ్డి. అత్త, ప్రేయసి ఇగోలను ఎదురించే యువకుడిగా నాగచైతన్య నటించాడు. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో కనిపించారు. శైలజారెడ్డి చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడిగా ఈ చిత్రం గురించి మారుతి పలు విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలోని అను ఇమ్మాన్యుయేల్ పాత్ర గురించి మాట్లాడుతూ.. ఆమె తాను ఒకటి అనుకొంటే దాని పట్టు విడవదు అని చెప్పారు.

    శైలజారెడ్డిలో చిత్రంలో అను అనే పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నది. ముక్కు మీద కోపం, తల బిరుసు ఉన్న పాత్ర ఆమెది. నిజానికి ఆమె బయటకు కూడా అలానే ఉంటుంది. అను ఇమ్మాన్యుయేల్‌కు తగిన పాత్ర దక్కింది. సినిమాలో ఆమె ప్రవర్తనకు కొంచెం డోస్ పెంచి సినిమాటిక్‌గా చూపించాం.

    Director Maruthi about Anu Emmanuel

    తెరపైన కనిపించే అను పాత్రకు బయట మాకు కనిపించే అను ఇమ్మాన్యుయేల్ పాత్రకు ఎలాంటి తేడాలు ఉండవు. కానీ తన పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది అని చెప్పారు. అను పాత్ర చాలా సహజంగా కనిపిస్తుంది అని అన్నారు.

    గతంలో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, బొబ్బిలిరాజా, అల్లరి అల్లుడు చిత్రాలకు శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి ఎలాంటి పోలీక ఉండదు. ఇది అత్త, అల్లుళ్ల మధ్య ఫైట్ నేపథ్యంలో సాగే సినిమా కాదు అని మారుతి ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు.

    English summary
    Shailaja Reddy Alludu starring Naga Chaitanya, Ramya Krishnan & Anu Emmanuel, Directed by Maruthi has completed its entire Shoot (except one song) and gearing up for August 31st Release. The film is produced by Naga Vamsi S & PDV Prasad under Sithara Entertainments, Presented by S. Radha Krishna(Chinababu).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X