Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అను ఇమ్మాన్యుయేల్‌కు ఇగో ఎక్కువ.. మారుతి కామెంట్
భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు భారీ సక్సెస్‌ల తర్వాత మారుతి రూపొందించిన చిత్రం శైలజారెడ్డి. అత్త, ప్రేయసి ఇగోలను ఎదురించే యువకుడిగా నాగచైతన్య నటించాడు. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో కనిపించారు. శైలజారెడ్డి చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడిగా ఈ చిత్రం గురించి మారుతి పలు విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలోని అను ఇమ్మాన్యుయేల్ పాత్ర గురించి మాట్లాడుతూ.. ఆమె తాను ఒకటి అనుకొంటే దాని పట్టు విడవదు అని చెప్పారు.
శైలజారెడ్డిలో చిత్రంలో అను అనే పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నది. ముక్కు మీద కోపం, తల బిరుసు ఉన్న పాత్ర ఆమెది. నిజానికి ఆమె బయటకు కూడా అలానే ఉంటుంది. అను ఇమ్మాన్యుయేల్‌కు తగిన పాత్ర దక్కింది. సినిమాలో ఆమె ప్రవర్తనకు కొంచెం డోస్ పెంచి సినిమాటిక్‌గా చూపించాం.
తెరపైన కనిపించే అను పాత్రకు బయట మాకు కనిపించే అను ఇమ్మాన్యుయేల్ పాత్రకు ఎలాంటి తేడాలు ఉండవు. కానీ తన పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది అని చెప్పారు. అను పాత్ర చాలా సహజంగా కనిపిస్తుంది అని అన్నారు.
గతంలో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, బొబ్బిలిరాజా, అల్లరి అల్లుడు చిత్రాలకు శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి ఎలాంటి పోలీక ఉండదు. ఇది అత్త, అల్లుళ్ల మధ్య ఫైట్ నేపథ్యంలో సాగే సినిమా కాదు అని మారుతి ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు.