SVP పడక గదిలో కీర్తీ సురేష్‌పై మహేష్ బాబు కాలు.. అశ్లీలతపై దర్శకుడు పరుశురాం క్లారిటి

సర్కారు వారి పాట చిత్రం డివైడ్ టాక్‌తో భారీ వసూళ్లతో రెండోవారంలోకి ప్రవేశించింది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఇటీవల కర్నూలులో సినిమా సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించారు. ఈ సినిమా విజయంతో దూసుకెళ్తున్నదనే వార్తల మధ్య మీడియాతో పరుశురాం మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ..

Recommended Video

Director Parusuram About Super Star At SVP | Filmibeat Telugu
సీరియస్ కథకు వినోదం

సీరియస్ కథకు వినోదం


సర్కారు వారి పాట సినిమా కంటెంట్‌ సీరియస్‌గా ఉన్నప్పటికీ వినోదాన్ని జోడించి చెప్పాలనుకొన్నాం. కథ చెప్పడంలో ఒక్కో దర్శకుడిది ఒక స్టైల్. ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ కాకుండా స్టోరి చెప్పాలనేది నా ప్రయత్నం. ఈ సినిమాకు రిపీట్ ఆడియెన్స్ రావడానికి కూడా అదే కారణం. అలాగే మహేష్ బాబును కొత్తగా చూపించారని ఫ్యాన్స్ చెప్పడం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఒక కిక్కుగా మారింది అని దర్శకుడు పరుశురాం చెప్పారు.

 టాలీవుడ్ నుంచి మంచి రెస్పాన్స్

టాలీవుడ్ నుంచి మంచి రెస్పాన్స్


సర్కారు వారి పాట మూవీకి సినిమా పరిశ్రమ నుంచి మంచి సపోర్ట్ లభించింది. సినిమా చూసిన తర్వాత దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, పూరీ జగన్నాథ్ ఫోన్ చేసి అభినందించారు. ఒక సీరియస్‌గా సాగే కథను ఎంటరైనింగ్‌గా చెప్పడం నా వల్ల కాదు అని సుకుమార్ అన్నారు. అలా మహేష్ బాబును డీల్ చేయడం నీకే సాధ్యం అని ఇండస్ట్రీ వర్గాలు అన్నారు.

 మహేష్ స్వయంగా ఫోన్ చేసి..

మహేష్ స్వయంగా ఫోన్ చేసి..


మహేష్ బాబు నుంచి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. సినిమా రిలీజ్ తర్వాత నాకు ఫోన్ చేశారు. అన్ని ప్రాంతాల నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ వస్తున్నది. కంగ్రాట్స్ అని నాకు ఆయనే ప్రశంసించారు. సర్కారు వారి పాట కోసం నేను ఎంత కష్టపడ్డానో మహేష్ బాబుకు ప్రత్యక్షంగా తెలుసు. మేము పడిన కష్టానికి ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా మారడంతో మా కష్టానికి ప్రతిఫలం దక్కిందనే ఫీలింగ్ కలిగింది అని పరుశురాం తెలిపారు.

 స్టేజ్‌పై డ్యాన్స్ చేయడంతో

స్టేజ్‌పై డ్యాన్స్ చేయడంతో


మహేష్ బాబు సాధారణంగా భావోద్వేగాలకు లోనవ్వరు. కానీ సర్కారు వారీ పాట సినిమా అందించిన విజయంతో ఆయనలో మంచి జోష్ కనిపించింది. కర్నూలు విజయోత్సవ సభలో సడెన్‌గా మహేష్ బాబు స్టేజ్‌పైకి వెళ్లి డ్యాన్స్ చేయడం షాక్ తిన్నంత పనైంది. ఆయనను అలాంటి జోష్‌లో చూడటం చాలా ఆశ్చర్యం వేసింది. సక్సెస్‌ను మహేష్‌ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారనే విషయం స్టేజ్‌పై డ్యాన్స్ తెలియజేసింది అని పరుశురాం అన్నారు.

 కళావతి పాత్రను అలా డిజైన్

కళావతి పాత్రను అలా డిజైన్


సర్కారు వారి పాటకు ముందు కీర్తి సురేష్ ఇమేజ్ వేరు. ఈ సినిమాలో ఆమెలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నించాం. కథలో కీర్తి సురేష్ పాత్ర కీలకం. సినిమాను ఒక జోన్ నుంచి మరో జోన్‌కు తీసుకెళ్లే రోల్. ఆ పాత్ర యాటిట్యూడ్ డిఫరెంట్‌గా కనిపించేలా కళావతి పాత్రను డిజైన్ చేశాను అని పరుశురాం అన్నారు.

ఆ సీన్లలో అశ్లీలత లేదు..

ఆ సీన్లలో అశ్లీలత లేదు..


సర్కారు వారి పాటలో హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్ చాలా కొత్తగా ఉంటుంది. సగటు, ఫ్యామిలీ ఆడియెన్స్‌ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పడక గదిలో కీర్తీ సురేష్‌పై మహేష్ కాలు వేసే సీన్‌లో ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేదు. అలా అనిపిస్తే ముందే మహేష్ బాబు వద్దని అనేవారు. ఈ సీన్ చూస్తే.. తల్లి వద్ద నిద్రపోయే ఒక బిడ్డలా అనిపిస్తుంది. తప్పితే అందులో అశ్లీలత ఏమీ కనిపించలేదు అని పరుశురాం తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X