అందుకే వైఎస్ జగన్ డైలాగ్ పెట్టాను.. మహేష్ ఏమన్నారంటే? నేను విన్నాను.. నేను ఉన్నాను డైలాగ్‌పై పరుశురాం క్లారిట
సర్కారు వారీ పాట అవుట్ అండ్ అవుట్ కమర్షియల్‌గా ఉంటుంది. కథ, కథనాలు, క్యారెక్టర్ డిజైన్ చూసి మహేష్ బాబు ఇంప్రెస్ అయ్యారు. ఫ్యాన్స్‌ను మెప్పించే కథ ఉండటంతో ఆయన పాజిటివ్‌గా స్పందించారు. అప్పు అనే పాయింట్ ఎమోషనల్‌గా ఉండటమనేది ఈ సినిమాకు బలంగా ఉంటుంది. మంచి పర్పస్‌తో రాసుకొన్న కథ ఇది. ఎవరిని టార్గెట్ చేసి రాసిన కథ కాదు. గీత గోవిందం తర్వాత రెండేళ్ల క్రితం రాసిన కథ అని పరశురాం అన్నారు. ఇంకా ఈ సినిమా గురించిన విషయాలను వెల్లడిస్తూ..

మహేష్ బాబుతో నాటు డైలాగ్స్
కథ ఎంత నచ్చిందో.. క్యారెక్టర్ నచ్చడంతో సినిమాను మహేష్ బాబు ఒప్పుకొన్నారు. నాటు డైలాగ్స్ కారణం.. ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంది. కీర్తీ సురేష్‌తో లవ్ ట్రాక్ అద్బుతంగా ఉంటుంది. సర్కారు వారీ పాట సినిమా కథ కీర్తీ సురేష్ పాత్ర ఆధారంగా ఉంటుంది. ఆమె పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. కీర్తి సురేష్ క్యారెక్టరేజన్ చాలా బాగుంటుంది. గతంలో చిత్రాలకు భిన్నంగా కీర్తి సురేష్ పాత్ర ఉంటుంది అని పరశురాం అన్నారు.

పర్పస్‌ఫుల్ కథ ఇది..
సర్కారు వారీ పాటలో సమాజానికి సందేశం ఇవ్వడం లాంటిది ఉండదు. కానీ ఈ సినిమా కథకు ఒక పర్పస్ ఉంటుంది. ప్రతీ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే పాయింట్‌తో కథ ఉంటుంది. సమాజంలో ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. కథ రాసుకునేటప్పుడే మహేష్ బాబు ఫ్లాష్ అయ్యారు. కథ చెప్పడానికి ముందు మహేష్‌ను ఎప్పుడూ కలువలేదు. కథ చెప్పిన తొలిసారి ఆయనను కలిశాను. కత చెప్పిన గంటన్నర తర్వాత మనం ఈ సినిమా చేద్దామని మహేష్ బాబు అని చెప్పారు.

150 కోట్ల సినిమా అంటూ
గీత గోవిందం సినిమా నా ఆలోచన పరిధిని పెంచింది. 150 కోట్ల సినిమా తీయగలడు అనే నమ్మకాన్ని సినీ వర్గాల్లో పెంచింది. నాలో కూడా గీతా గోవిందం సినిమా కాన్ఫిడెన్స్ పెంచింది. సినిమా తర్వాత చాలా మంది అప్రోచ్ అయ్యారు. సూపర్ స్టార్ కెరీర్‌లో నా సినిమా ఉండాలనే కోరిక అలా తీరింది అని పరుశురాం అన్నారు.

వైఎస్ఆర్ అభిమానిని
నేను రాజశేఖర్ రెడ్డి అభిమానిని. ఆయన ప్రజలకు సేవ చేసిన తీరు నన్ను ఆకట్టుకొన్నది. ఆయన బాటలో వైఎస్ జగన్ నడుస్తున్నారు. అందుకే ఆయన నోట పలికిన నేను ఉన్నాను.. నేను విన్నాను అనే డైలాగ్‌ను పెట్టాను. ఈ డైలాగ్ పెట్టే ముందు మహేష్‌తో పెద్దగా డిస్కషన్ చేయలేదు. ఆ సీన్ చాలా బాగుంటుంది. ఆయనకు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. సినిమాలో అంతే మొత్తంలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అని పరుశురాం అన్నారు.

త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ ప్రభావం
నా డైలాగ్స్‌పై తివిక్రమ్, పూరి జగన్నాథ్ ప్రభావం ఉంటుంది. మహేష్‌తో సినిమా చేస్తున్నానని పూరికి చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలయ్యాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఫోన్ చేసి నన్ను అభినందించాడు. రిపోర్టింగ్ ఫ్రమ్ చాపలపూడ బీచ్ అనే డైలాగ్ పూరీ నుంచి స్పూర్తి పొంది రాసిన డైలాగ్. ఆ డైలాగ్ విన్న తర్వాత బాగా రాశావు. సినిమా కూడా పూరీ మూవీలో ఉండే స్పీడ్ ఉంటుంది అని పూరీ చెప్పారు.


Click it and Unblock the Notifications











