Radhe Shyam ప్రభాస్ పాత్రకు ఆ ప్రముఖుడు స్పూర్తి.. ముహుర్తాలు, జాతకాలు చూసుకోకుండా అంటూ డైరెక్టర్ రాధాకృష్ణ

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ చిత్రం ఎట్టకేలకూ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా మార్చి 15వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. నేను చంద్రశేఖర్ ఏలేటి వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ తర్వాత జిల్ సినిమాకు దర్శకత్వం వహించాను. వెంటనే యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమా చేయాల్సింది. ఈ కథపై నేను, చంద్రశేఖర్ ఏలేటి కొంతకాలం పనిచేశాం. కానీ కథ సరైన ముగింపు తట్టలేదు. దాంతో కథను కొంతకాలం వదిలేశాం. ఈ పాయింట్‌ను 18 ఏళ్ల క్రితం రాశాం. నాకు సినిమాలపై బాగా ఇంట్రెస్ట్ పెంచిన పాయింట్.

ఆ తర్వాత కథపై కసరత్తు మళ్లీ మొదలుపెట్టాం. లక్కీగా కథ ఓకే అయింది. ప్రభాస్‌కు కూడా నచ్చింది. దాంతో సినిమా ఆరేళ్ల క్రితం ప్రారంభమైంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు మంచి ఇమేజ్ వచ్చింది. కానీ బాహుబలి కంటే ముందే ఈ సినిమాను గ్రాండ్‌గా, రిచ్‌గా ప్లాన్ చేశాం. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని గ్రాండ్‌గా ప్లాన్ చేయలేదు అని రాధాకృష్ణ కుమార్ చెప్పారు.

 ప్రభాస్ నాకు మంచి ఫ్రెండ్

ప్రభాస్ నాకు మంచి ఫ్రెండ్

ప్రభాస్ నాకు మంచి ఫ్రెండ్. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం. ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆయనతో పరిచయం కలగడం, ఆయనతో ప్రయాణం సాగించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రాధే శ్యామ్ సినిమా కథను రెండున్నర గంటలు చెప్పగానే ప్రభాస్ ఎక్సైట్ అయ్యారు. ఆయన కథకు తగినట్టుగా మేకోవర్‌కు సిద్ధమయ్యాడు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యాడో.. ఇప్పటికి అదే ఎక్సైట్‌మెంట్ ఆయనలో కనిపిస్తుంది అని రాధాకృష్ణ కుమార్ తెలిపారు.

ఇటలీలో కరోనా అలాంటి విలయతాండవం

ఇటలీలో కరోనా అలాంటి విలయతాండవం

రాధే శ్యామ్ సినిమా కథ అనుకొన్నప్పుడు ఇండియాలోనే హిల్స్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌గా చేద్దామని అనుకొన్నాను. కానీ యూరప్ వింటేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఎవరూ చేయలేదు కదా అని ప్రభాస్ చెప్పారు. దాంతో ఇటలీతోపాటు ఇతర దేశాల్లో షూట్ చేయాలని అనుకొన్నాం. కానీ కరోనావైరస్ కారణంగా వీలు పడలేదు. పాటలను ఆస్ట్రియా, జార్జియాలో చేశాం. ఇటలీలో ఉండగా.. కరోనా ఫస్ట్ వేవ్ మొదలైంది.

ఆ సమయంలో షూట్ చేస్తుండగానే.. ఫ్లయిట్స్ క్యాన్సిల్ అయ్యాయి. దాంతో టర్కీకి వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు వచ్చాం. ఇక సెకండ్ వేవ్‌కు ముందు ఇటలీకి వెళ్లాం. అక్కడ కొద్ది రోజులు షూట్ చేస్తుండగా.. నాకు, కెమెరామెన్‌కు కోవిడ్ ఎటాక్ అయింది. దాంతో యూనిట్ అంతా క్వారంటైన్ అయింది. రాధే శ్యామ్ సినిమాను చాలా కష్టపడి తెరకెక్కించాం. ఇటలీలో సాధ్యపడకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేసి షూట్ చేశాం అని రాధాకృష్ణ చెప్పారు.

ప్రభాస్ క్యారెక్టర్‌కు ఆ ప్రముఖ జాతకుడు స్పూర్తి

ప్రభాస్ క్యారెక్టర్‌కు ఆ ప్రముఖ జాతకుడు స్పూర్తి

రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్‌కు యూరప్‌లోని కీరో అనే ఓ పామిస్ట్ర్ జీవితం ఇన్సిపిరేషన్. కీరో ఇండియాకు వచ్చి హస్త సాముద్రిక శాస్త్రంలోని మెలుకువలు నేర్చుకొని మంచి పాపులారిటీ సంపాదించాడు. ఆయన కేవలం ప్రధానులు, రాష్ట్రపతులకే జాతకం చెప్పేవారు. అతడి జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకొని క్యారెక్టర్ రాసుకొన్నాం. కొన్ని వాస్తవ సంఘటనలు కథలో పెట్టాం. నేను జాతకాలను నమ్ముతానో లేదో అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. జాతకాలు నమ్మే వ్యక్తి, నమ్మని వ్యక్తి మధ్య ఏదైనా సంఘటన జరిగితే, సమస్య చోటుచేసుకొంటే ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా ఉంటుంది. జాతకాలు నమ్ముతారా లేదా అనేది వారి వారి నమ్మకాలు బట్టి ఉంటుంది అని రాధాకృష్ణ తెలిపారు.

కృష్ణంరాజుతో పనిచేయడం

కృష్ణంరాజుతో పనిచేయడం

రాధే శ్యామ్ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజును తీసుకోవాలనేది నా ఛాయిస్ కాదు. ఎందుకంటే కోవిడ్ సమయంలో ఆయనను నటింప చేయడం రిస్క్ అని భావించాను. కానీ ఆయనకు సరిపోయే పాత్ర. కథ వినగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకొన్నారు. దాంతో కోవిడ్ తగ్గిన తర్వాత పరిస్థితులను చూసుకొని కృష్ణంరాజుతో షూటింగ్ చేశాం. రెబల్ స్టార్ ఫ్యామిలీలో రెండు జనరేషన్స్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని రాధాకృష్ణ చెప్పారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి..

సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి..

రాధే శ్యామ్ సినిమా షూటింగ్ వాయిదాలు పడటం, రిలీజ్ ఆలస్యం కావడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ భారీగా వచ్చాయి. ఒక పనిచేయడం ఇలాంటి ఎదురుపడుతుంటాయి. అవన్నీ జీవితంలో భాగం. ప్రస్తుత సమయంలో సోషల్ మీడియా ఒక ఆయుధం. దానిని సరిగా వాడితే సరైన ఫలితాలు వస్తుంటాయి. రాధే శ్యామ్ సినిమానే కాకుండా ఇతర సినిమాల విషయంలో కూడా సోషల్ మీడియా చాలా ప్రభావం చూపబోతుంది. ఈ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లడానికి స్కోప్ ఉన్న చిత్రం అని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.

తమన్ మ్యూజిక్ మరో రేంజ్‌లో

తమన్ మ్యూజిక్ మరో రేంజ్‌లో

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రావడం వల్ల రాధే శ్యామ్ సినిమా మరో రేంజ్‌కు వెళ్లింది. కథ అనుకొని సినిమా రూపొందిస్తున్నప్పుడు మనలో ఉండే ఎమోషన్స్‌ను తెర మీద కనిపించాలంటే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనే సాధ్యం. రాధే శ్యాహ్ సినిమాలో తమన్ మ్యూజిక్ హైలెట్‌గా ఉంటుంది. సినిమా చేసే ప్రాసెస్‌లో ఎలాంటి ఫిల్టర్లు లేని వ్యక్తి తమన్. ఈ సినిమాకు ప్లస్ అనుకొంటున్న వాటిలో తమన్ మ్యూజిక్ ఒకటి.

రాధే శ్యామ్ ఓ దృశ్యకావ్యం కావడానికి తమన్ ప్రతిభ కూడా తోడైంది అని రాధాకృష్ణ అన్నారు., ప్రభాస్‌కు తల్లి క్యారెక్టర్ కోసం సీనియర్ నటి కోసం వెతుకుతుండగా భాగ్యశ్రీ ఫోటోను చూశాం. ఆమెను సంప్రదించగా కథ విని వెంటనే ఒప్పుకొన్నారు. ప్రభాస్ పక్కన నటిస్తే తనకు కూడా మంచి రీ ఎంట్రీగా ఉంటుందని భావించారు. అందుకే ఆమె కూడా సానుకూలంగా స్పందించారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X