కేఏ పాల్ అలా చేయమని అడిగారు.. అందుకే కాళ్లు పట్టుకొన్నాను.. రాంగోపాల్ వర్మ

Recommended Video

RGV Funny Comments On K.A.Paul | Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, మత ప్రబోధకుడు కేఏ పాల్ మధ్య ఇటీవల వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది. వారిద్దరూ ముంబైలో సమావేశం కావడం మీడియాలో చర్చకు దారి తీసింది. వారి కలయిక నేపథ్యంలో వర్మపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో చర్చకు దారి తీశాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కేఏ పాల్ గురించి వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే..

కేఏ పాల్‌ను ముంబైలో కలిశా

కేఏ పాల్‌ను ముంబైలో కలిశా

కేఏ పాల్ ముంబైలో నాతో సమావేశమైంది నిజమే. ఆ సందర్భంగా తన బయోపిక్ తీయాలని కోరాడు. అది భరించలేకే నేను ఆయన కాళ్లు పట్టుకొన్నాను. కాళ్లు పట్టుకొని లాగితే తలకు దెబ్బ తగిలి మైండ్ సెట్ అవుతుందని అనుకొన్నాను. కానీ అలా చేయడానికి ధైర్యం చాలా లేదు అని వర్మ అన్నారు.

జీసస్‌కు చెప్పి శాపనార్థాలు

జీసస్‌కు చెప్పి శాపనార్థాలు

ఒకవేళ కాళ్లు పట్టి లాగితే జీసస్‌కు చెప్పి నాకు శాపనార్థాలు పెడుతాడని భయపడ్డాను. అందుకే ఆ పని చేయలేదు. కేఏ పాల్‌కు, నాకు ఎలాంటి వైరుధ్యాలు లేవు. విభేదాలు లేవు. ఆయనలా అబద్దం ఆడే మనిషిని ఇంత వరకు చూడలేదు.

అబద్ధాల చెప్పే వ్యక్తి ఎవరూ లేరు

అబద్ధాల చెప్పే వ్యక్తి ఎవరూ లేరు

భూమి మీద 60 వేల ఏళ్ల క్రితం హోమో సెపెన్స్ అనే మనిషి జాతి పుట్టింది. 60 వేల ఏళ్ల నుంచి కేఏపాల్ కంటే అబద్ధాలు చెప్పే వ్యక్తి పుట్టలేదని భావించాను. ఆయన అబద్ధాలు వినలేక ఉద్వేగానికి గురై.. దానిని ఆపుకోలేకపోయాను. అందుకే కాళ్లు పట్టుకొన్నాను అని ట్విట్టర్‌లో రాశాను.

కేఏ పాల్ ఫాలోవర్స్ ఉంటారా

కేఏ పాల్ ఫాలోవర్స్ ఉంటారా

కేఏ పాల్‌తో ఎవరైనా అర్ధగంట మాట్లాడితే ఎవరైనా కాంట్రడిక్టరీ స్టేట్‌మెంట్స్ ఇస్తారు. ఆయన కాసేపు మాట్లాడితే మైండ్ మసాలా అవుతుంది. ఆయనకు ఫాలోవర్స్ కూడా ఉంటారా అని భయమేసింది. అలా కూడా ఫాలోవర్స్ ఉంటారా అని ఆశ్చర్యం వేస్తున్నది అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X