ఆ హీరోయిన్ పై రామ్ గోపాల్ వర్మ మోజు.. అడ్డొచ్చిన జగపతిబాబుకు వార్నింగ్
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జునతో శివ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి సంచలనంగా మారారు. ఆ తర్వాత బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలా రాంగోపాల్ వర్మ నుంచి వచ్చిన చిత్రాల గురించి సినీ ప్రియులకు అన్ని విషయాలు తెలిసిందే. టాలీవుడ్ బాలీవుడ్ లో సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ఆయన తరహాలో సినిమాలు చేస్తూనే ఉన్నారు.
టాలీవుడ్ లో 90ల్లో టాప్ హీరోలతో రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేశారు. వారిలో జగపతిబాబుతో గాయం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం 1993లో ప్రేక్షకులకు వచ్చింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ ఊర్మిళ, ప్రముఖ హీరో నటుడు జగపతిబాబు జంటగా నటించారు. అయితే ఈ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఘటనలను తాజాగా జగపతిబాబు బయటపెట్టారు. సెట్ లో హీరోయిన్ ముందు రాంగోపాల్ వర్మ జగపతిబాబు ను ఎలా అవమానించారో చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు, ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో జగపతిబాబు ప్రస్తుతం విభిన్న పాత్రలు పోషిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు బుల్లితెరపై జయము నిశ్చయమ్మురా అనే టాక్ షో తో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. కాగా ఈ టాక్ షోకు తాజాగా సందీప్ రెడ్డి వంగా, రాంగోపాల్ వర్మ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగపతిబాబు వారిద్దరికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. అయితే జగపతిబాబు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా చేసినప్పుడు షాకింగ్ కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చారు.
ఒక రోజు షూటింగ్ జరుగుతుండగా ఒక సన్నివేశంలో హీరోయిన్ ఊర్మిళ తో తన షార్ట్ ఉందని చెప్పారు. దాంతో బాబు ఫ్రేమ్ లో ముందుకు వచ్చారంట. దాంతో రామ్ గోపాల్ వర్మ చిరాకు పడ్డారంట. అంతే కాదు హీరోవైతే నీ మొహాన్ని ఎవరు చూస్తారయ్యా అని అవమానించాడని జగపతి బాబే చెప్పారు. ఇక హీరోయిన్ ఊర్మిళను ముందు పెట్టి సీన్లు షూట్ చేశారని రామ్ గోపాల్ వర్మ ముందే బయట పెట్టారు.
అలాగే రామ్ గోపాల్ వర్మ గురించి అతిలోక సుందరి చెప్పిన ఎమోషనల్ వర్డ్స్ ను వినిపించారు. మనం మాట్లాడుకొని 40 ఏళ్లు దాటింది, అయినా మీ ఇంపాక్ట్ నా మీద ఉందని శ్రీదేవి రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పిన ఆడియోను వినిపించారు. అందుకు రామ్ గోపాల్ వర్మ కూడా ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవిని ఆరాధిస్తున్న రోజులలో ఆ మాటలు చెప్పిందని ఆర్జీవీ వివరణ ఇచ్చారు. ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ తనకు ఫిల్మ్ డైరెక్షన్ లో టీచర్ లో అని చెప్పుకొచ్చారు. ఆయన సినిమాల నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాని చెప్పారు. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 5న జీ5లో, ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











