Laggam: అరిటాకులో విందు భోజనంలా లగ్గం..ప్రేక్షకులే పెళ్లి పెద్దలుగా.. దర్శకుడు రమేష్ చెప్పాల (ఇంటర్వ్యూ)
తెలుగు సినిమా పరిశ్రమలో గ్రామీణ వాతావరణం, నేటివిటీ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న సినిమాలకు భారీ ఆదరణ దక్కుతున్నది. బలగం నుంచి మొన్నీ మధ్య వచ్చిన కమిటీ కుర్రోళ్లు, ఆయ్ లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకొన్నాయి. స్థానికంగా ఉండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంతో వస్తున్న చిత్రం లగ్గం. గ్రామీణ కుటుంబాల్లో ఉండే ప్రేమానురాగాలు, భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందిందనే విషయం ట్రైలర్ స్పష్టం చేసింది. ఈ మూవీ అక్టోబర్ 25వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు రమేష్ చెప్పాల తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలు, ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..
భీమదేవరపల్లి బ్రాంచి సినిమా ద్వారా మంచి అభురుచి ఉన్న రచయితగా, దర్శకుడిగా రమేష్ చెప్పాల గుర్తింపు పొందారు. సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. పాటలను యువ సంగీత దర్వకుడు చరణ్ అర్జున్ అందించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి ఆదరణ దక్కుతున్నది. ఈ ట్రైలర్‌లోని ఎమోషనల్ అంశాలు సినిమాపై ఆసక్తిని, అంచనాలు పెంచింది.

భీమదేవరపల్లి బ్రాంచి మూవీకి వచ్చిన స్పందన తర్వాత అంతకుమించి కథను చేయాలనే పట్టుదలతో లగ్గం సినిమా కథ రాశాను. ఈ చిత్రం కోసం రాజేంధ్రప్రసాద్, రోహిణి లాంటి సీనియర్ యాక్టర్లు, సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర లాంటి యువ హీరో, హీరోయిన్లు, అలాగే రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి,కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను టాలెంటెడ్ యాక్టర్లు, కమెడియన్లతో కూడిన పాత్రలు కొత్త అనుభూతిని కలించేలా ఉంటాయి అని రమేష్ చెప్పాల తెలిపారు.
లగ్గం కథ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఈ ప్రాంతంలోని ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. తెలంగాణలో జరిగే పెళ్లి (లగ్గం)కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ సంస్కృతిని ఎమోషనల్ అంశాలతో చెప్పాలనే ప్రయత్నం చేశాను. లగ్గం టైటిల్‌కు చాలా మంది కనెక్ట్ అవ్వడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. మా సినిమా టైటిల్‌కు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వస్తున్న స్పందనతో చాలా హ్యాపీగా ఉంది అని దర్శకుడు వెల్లడించారు.

రైతు కుటుంబం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ప్రవాస భారతీయుల అంశాలు కథను మలుపు తిప్పేలా ఉంటాయి. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు అందమైన దృశ్యకావ్యం చూశామనే అనుభూతిని కలిగిస్తాయి. లగ్గం సినిమా క్లైమాక్స్‌ను అత్యంత నిజాయితీగా చెప్పాలనే ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని అనుకొంటున్నాను అని రమేష్ చెప్పాల అన్నారు.
లగ్గం సినిమా అరిటాకులో సంప్రదాయంగా వడ్డించే విందు భోజనంలా ఉంటుంది. పెళ్లైన ప్రతీ జంటకు వాళ్ల లగ్గాన్ని మరోసారి గుర్తు చేసేలా, మధురమైన జాపకాలను గుర్తుకు తెచ్చేలా ఉంటుంది. లగ్గం అనే ప్రపంచాన్ని సృష్టించి మిమ్మల్ని బంధువులుగా, మీరే పెళ్లి పెద్దలుగా మార్చబోతున్నాను. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. లగ్గానికి మీ దీవెనలు అందించాలి. మీరంతా ఆహ్వానితులే. ఈ సినిమాని మీ ఇంటి లగ్గంగా మార్చబోతున్నాను అని రమేష్ చెప్పాల అన్నారు.

నటీనటులు: సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్‌బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టీ సుగుణ, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, వివా రెడ్డి, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి, రవి వర్మ, తదితరులు
బ్యానర్: సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమేశ్ చెప్పాల
నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మణిశర్మ
సినిమాటోగ్రఫి: బాల్ రెడ్డి
మ్యూజిక్:చరణ్ అర్జున్
ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి
కొరియోగ్రఫీ: అజయ్ శివశంకర్
రిలీజ్ డేట్: 2024-10-25


Click it and Unblock the Notifications











