twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడు డైరెక్టరా? వీడితో సినిమానా?.. ఆ ఇద్దరే నమ్మారు.. రాక్షసుడు డైరెక్టర్ రమేష్ వర్మ

    |

    వరుస అపజయాలతో సాగుతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకొన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు సత్యనారాయణ తొలిసారి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తిరుగులేని విజయాన్ని సాధించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తమిళంలో ఘన విజయం సాధించిన రాక్షసన్ సినిమా ఆధారంగా తెరకెక్కిన రాక్షసుడు చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ..

    థ్రిల్లింగ్ విజయంతో

    థ్రిల్లింగ్ విజయంతో

    రాక్షసుడు ఎంత థ్రిల్లింగ్‌గా ఉందో.. అంతకంటె సక్సెస్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తున్నది. బెల్లంకొండ శ్రీనివాస్‌కు బ్లాక్‌బస్టర్ ఇచ్చానని అందరూ అంటుంటే చాలా గర్వంగా ఉంది. కాపీ పేస్ట్ చేశారంటే నేను ఒప్పుకొను. రీమేక్ విషయంలో ఉన్నదున్నట్టు తీసి హిట్ కొట్టిన సూపర్ గుడ్ ఫిలింస్ నాకు స్ఫూర్తి. కథ, కథనాన్ని చెడగొట్టవద్దనే ఉద్దేశంతోనే రాక్షసుడు సినిమాలో మార్పులు ఏమీ చేయలేదు అని దర్శకుడు రమేష్ వర్మ అన్నారు.

     రాక్షసుడు సినిమా ఓ డెస్టినీగా

    రాక్షసుడు సినిమా ఓ డెస్టినీగా

    నాకు రీమేక్ చేయాలని ముందు నుంచి అనుకోలేదు. ఓ పెయింటింగ్ మళ్లీ వేయాలంటే సామాన్యమైన విషయం కాదు. తమిళ వెర్షన్ రెండేళ్లకు పైగా తీశారు. అదే సినిమాను మూడు నెలల్లో పూర్తి చేశాను. రాక్షసుడు సినిమా కంటే భారీ బడ్జెట్ సినిమాను నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇచ్చారు. అయినప్పటికీ రాక్షసుడు సినిమానే చేయాల్సి వచ్చింది. అది డెస్టినీగా భావిస్తాను అని రమేష్ వర్మ పేర్కొన్నారు.

    హక్కుల కోసం 11 మంది నిర్మాతలు

    హక్కుల కోసం 11 మంది నిర్మాతలు

    రాక్షసుడు సినిమా హక్కులను పొందడానికి భారీ పోటీని ఎదుర్కొన్నాం. 11 మంది నిర్మాతలు హక్కుల కోసం పోటీ పడ్డాం. అయితే ఫ్యాన్సీ రేటుకు మేము సొంతం చేశాం. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనుకు చూపిస్తే.. ఇప్పటికే పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. మళ్లీ చేయలేనని అన్నారు. అయినా బెల్లంకొండ సురేష్ గారికి సినిమా చూపిస్తే బాగుందన్నారు. ఆ తర్వాత మళ్లీ ఫ్యామిలీ అందరికి సినిమా చూపిస్తే.. చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు ఫోర్స్ చేశానో.. అంతకంటే ఎక్కువగా వాళ్లు ఎక్కువగా ఫోర్స్ చేశారు అని రమేష్ వర్మ తెలిపారు.

    వీడు డైరెక్టరా? వీడితో సినిమా ఏందని

    వీడు డైరెక్టరా? వీడితో సినిమా ఏందని

    రాక్షసుడు రీమేక్ విషయంలో నన్ను బాగా నమ్మింది నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు. ఆయన అన్ని రంగాల్లో విజయం సాధించారు. ఈ సినిమా విషయంలో కూడా నన్ను నమ్మారు. రమేష్ వర్మతో సినిమా ఏంటి? వీడు డైరెక్టరా? ఏదో డిజైనర్.. అడ్డిమార్ గుడ్డి దెబ్బలో ఓ సక్సెస్ వచ్చింది అని చాలా మంది ఆయనకు ఫిర్యాదు చేశారు. అయినా నాకే అవకాశం ఇచ్చారు. సినిమా చేస్తున్నప్పుడు కూడా ఎవరికీ నమ్మకం లేదు. కేవలం సత్యనారాయణ కోనేరు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు, నేను బాగా నమ్మి చేశాం అని రమేష్ అన్నారు.

     మూడు ఫ్లాపుల తర్వాత శ్రీనుకు

    మూడు ఫ్లాపుల తర్వాత శ్రీనుకు

    తమిళ రాక్షసన్ సినిమాలో హీరో విష్ణు విశాల్ మంచి క్రేజ్ ఉన్న హీరో. ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్‌కు మూడు ఫ్లాప్‌లు. అయినా మేము నమ్మి ఈ సినిమాతో ముందుకెళ్లాం. బెల్లంకొండ సురేష్ నమ్మకపోతే శ్రీను సినిమా చేసేవాడు కాదు. అలాగే నిర్మాత సత్యనారాయణ కోనేరు నమ్మకపోతే సినిమా ఉండేది కాదు. మేము ముగ్గురం బలంగా నమ్మాం కాబట్టే రాక్షసుడు సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది అని రమేష్ వర్మ అన్నారు.

    English summary
    Bellamkonda Sai Srinivas's latest movie Rakshasudu is doing good at box office. In this occassion, Director Ramesh Varma speak to media. He shares his film making experice with media reporters
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X