Bheemla Nayak హిందీ వెర్షన్ రిలీజ్ ఎప్పుడంటే? విడుదల ఆలస్యంపై దర్శకుడు సాగర్ క్లారిటీ
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'భీమ్లానాయక్'. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తున్నది. సినిమా సాధించిన సక్సెస్ గురించి దర్శకుడు సాగర్ చంద్ర మీడియా రిపోర్టర్లతో మాట్లాడారు. భీమ్లా నాయక్ గురించి సాగర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
త్రివిక్రమ్‌గారు రైటింగ్‌లో అయినా, డైరెక్షన్‌లో అయినా సీనియర్ పర్సనాలిటీ. ఆయన సజెషన్స్ ఏ టెక్నీషియన్‌కైనా అవసరమే! ఇద్దరు స్టార్స్‌తో కలిసి పనిచేయడం అనేది యుద్ధంలాగే ఉంటుంది. దానిని మనం ఎంతగా ఓన్ చేసుకున్నాం. అవుట్‌పుట్ బాగా రావడానికి ఏం చేశాం అన్నది ముఖ్యం. ఆయన సహకారం లేకపోతే చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. నాయక్, డ్యాని రెండూ బలమైన పాత్రలు కాబట్టే తెరపై నువ్వా.. నేన్నా అన్నట్లు ఆ పాత్రలు కనిపించాయి. 'భీమ్లానాయక్' చేయడం వల్ల వచ్చిన పేరు, గుర్తింపుతో నేను చాలా ఆనందంగా ఉన్నాను అని సాగర్ చెప్పారు.

భీమ్లా నాయక్ సినిమా ప్రారంభం కావడానికి ముందే పవన్ కల్యాణ్‌ను కలిసినప్పుడు.. 'బాగా తీయ్.. బాధ్యతగా పని చేయ్' అని చెప్పారు. అంతే ఎనర్జీతో మేం పని చేశాం. దాని ఫలితమే ఈ సక్సెస్ అని సాగర్ చెప్పారు.
కరోనా వల్ల షూటింగ్ లేట్ అయ్యి ఇబ్బంది పడ్డాం. కానీ మిగత ఏ విషయంలోనూ మేం ఇబ్బంది పడలేదు. ఇబ్బందులు ఏమీ మా దగ్గరకు రాకుండా చినబాబుగారు చూసుకున్నారు. తెలుగుతోపాటు హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని అనుకొన్నాం. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సాధ్యపడలేదు. అయితే హిందీ వెర్షన్‌లో భీమ్లా నాయక్‌ను త్వరలోనే రిలీజ్ చేయడానికి నిర్మాతలు చినబాబు, నాగవంశీ ప్రయత్నిస్తున్నారు.
'భీమ్లానాయక్' సినిమా కంటే ముందు వరుణ్‌తేజ్‌తో 14రీల్స్ ప్లస్ బ్యానర్‌లో ఓ సినిమా ప్రకటించారు. అనుకున్న బడ్జెట్ దాటడంతో అది పక్కకు వెళ్లింది. తర్వాత ఆ కథతో చేస్తానా.. ఇంకోటి చేస్తానా అన్నది చూడాలి. అయితే ఇక ముందు స్ట్రెయిట్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











