కీర్తీ సురేష్ అలా షాకిచ్చింది.. నాని కోసం దసరా కథ రాయలేదు.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (ఇంటర్వ్యూ)

నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు పనిచేసిన శ్రీకాంత్ ఓదెల.. నాని నటించిన దసరా సినిమాకు తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కీర్తి సురేష్, సముద్రఖని, చాకో, దీక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా మార్చి 30న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీడియాతో మాట్లాడుతూ...

 పెద్దపల్లికి సమీపంలోని

పెద్దపల్లికి సమీపంలోని


నా సొంత ఊరు పెద్దపల్లికి దగ్గరలోని సింగరేణి క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. సింగరేణిలో మా నాన్న ఉద్యోగి. నా బాల్యమంతా అక్కడే జరిగింది. వీర్లపల్లి గ్రామం మా అమ్మమ్మ ఊరు. నా జీవితంపై ఆ ఊరు ప్రభావం ఉంది. అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా కథ రాసుకొన్నాను. నిర్మాత సుధాకర్‌ని కలిసి కథ వినిపించాను. వెంటనే నన్ను నాని వద్దకు పంపించాడు. నానీ కథ విని ఓకే చేశారు అని శ్రీకాంత్ ఓదెల చెప్పారు.

ఏ హీరోను దృష్టిలో పెట్టుకొని..

ఏ హీరోను దృష్టిలో పెట్టుకొని..


దసరా సినిమా కథను 2019 చెప్పాను. ఏ హీరోను దృష్టిలో పెట్టుకొని రాసుకోలేదు. కథ రాసుకొన్న తర్వాత నాని వచ్చారు. రంగస్థలం లాంటి సినిమాలను దృష్టిలో పెట్టుకొని కథ రాయలేదు. నా చిన్నతనంలో మా ఊర్లో జరిగిన సంఘటన ఆధారంగా కథ రాసుకొన్నాను. సుకుమార్ దర్శకత్వంలో వహించిన జగడం సినిమా చూసి సినిమా తీయాలనుకొన్నాను. సుకుమార్ వద్ద చేరేందుకు తిరిగాను. సుకుమార్‌ను కలిసిన తర్వాత ఓ షార్ట్ ఫిలిం తీయమన్నాడు. నేను తీసిన షార్ట్ ఫిలిం చూసి నాకు డైరెక్షన్ టీమ్‌లో నాకు అవకాశం ఇచ్చారు అని శ్రీకాంత్ ఓదెల అన్నారు.

తెలుగు అమ్మాయిని తీసుకొందామని..

తెలుగు అమ్మాయిని తీసుకొందామని..


నేను దసరా కథ చెప్పిన తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాలు నాని చేస్తున్నారు. దాంతో ఈ సినిమా కోసం తెలుగు అమ్మాయిని తీసుకొందామని అనుకొన్నాం. తెలుగు అమ్మాయి కోసం 8 నెలలు తిరిగాను. నేను అనుకొన్న అమ్మాయి దొరకలేదు. దాంతో కీర్తీ సురేష్‌ను తీసుకొందామని డిసైడ్ అయ్యాం. కీర్తీ సురేష్‌తో పనిచేస్తుంటే షాక్ తిన్నాను. ఎలాంటి విషయాన్నైనా 5 నిమిషాల్లో నేర్చుకొంటుంది అని శ్రీకాంత్ ఓదెల తెలిపారు.

సుకుమార్ కాన్ఫిడెన్స్ నచ్చి..

సుకుమార్ కాన్ఫిడెన్స్ నచ్చి..


దర్శకుడు సుకుమార్ టీమ్‌లో నాన్నకు ప్రేమతో.. రంగస్థలం సినిమాలకు నేను పనిచేశాను. నేను జూనియర్ కావడంతో పెద్దగా నేను నేర్చుకోలేదు. కానీ సినిమా అంటే ఎలా కష్టపడి చేయాలో అనే విషయాన్ని ఆయన్నీ చూసి నేర్చుకొన్నాను. సుకుమార్‌కు ఉన్న స్టేజ్ చూస్తే.. సినిమాకు భయపడి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ప్రతీ సినిమాకు భయపడుతూనే చేస్తుంటాడు. ఆయనలో కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చుతుంది అని శ్రీకాంత్ చెప్పారు.

పరువు హత్యల గురించా?

పరువు హత్యల గురించా?


పుష్ప లాంటి సినిమాల ప్రభావం దసరాపై లేదు. నాని గెటప్ అలానే ఉండాలని ముందే ఫిక్స్ అయ్యాం. దసరా సినిమా పరువు హత్యల నేపథ్యంగా కథ ఉండదు. సిల్క్ స్మిత గురించిన కథ ఉండదు. సిల్క్ స్మిత తీసుకొన్న రెబల్ నిర్ణయాలు, ఆమె వ్యవహరించిన తీరుతోనే నేను ఆమెకు అభిమాని అయ్యాను అని శ్రీకాంత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X