Director Srikanth Odela దసరా బడ్జెట్ అలా పెరిగింది.. నాని, నిర్మాత ముందే ఫిక్స్
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో తొలిసారి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్రం దసరా. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రూపుదిద్దుకొన్న తీరు, బడ్జెట్ వివరాలను శ్రీకాంత్ ఓదెల వివరిస్తూ..

దసరా సినిమాను వాస్తవంగా గోదావరిఖని ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో చిత్రీకరించాలని అనుకొన్నాం. ఒక ఊరు కూడా సెలెక్ట్ చేసుకొన్నాం. కానీ మైనింగ్ అధికారులు ఆ ఊరును ఖాళీ చేయించడంతో చివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ వేశాం. దాంతో బడ్జెట్ భారీగా పెరిగింది అని శ్రీకాంత్ చెప్పారు.
దసరా కథ అనుకొన్నప్పుడే బడ్జెట్ ఎక్కువ అవుతుందని నిర్మాత సుధాకర్, నానికి ముందే తెలుసు. బడ్జెట్ ఎక్కువైతుందని అనుకొంటే.. నేను అక్కడితో తగ్గించేస్తానని చెప్పాను. కథలో పాన్ ఇండియా విస్తృతిలో ఉంది. అందుకే కథ డిమాండ్ చేసినంత వరకు బడ్జెట్ పెంచుకొంటూ వెళ్లాం అని శ్రీకాంత్ చెప్పారు.
దసరా సినిమాపై సోషల్ మీడియాలో లీకుల విషయం మా దృష్టికి వచ్చింది. కానీ ట్విట్టర్, సోషల్ మీడియాలో వచ్చిన సెన్సార్ రిపోర్టు, ఇతర లీకులను పెద్దగా పట్టించుకోలేదు. మార్నింగ్ షో సినిమా తర్వాత ఎలాగు సినిమా విషయాలు బయటకు వస్తాయి. సోషల్ మీడియాలో పది రోజుల ముందు వచ్చాయి. వాటి గురించి భయపడలేదు అని శ్రీకాంత్ అన్నారు.
దసరా సినిమాకు మ్యూజిక్ ఇంపార్టెంట్. అందుకే తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ తీసుకొన్నాం. నాకు ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. నేను పరుగులు పెట్టి మ్యూజిక్ చేయించుకోవడం కష్టమనిపించింది. నాతో ట్రావెల్ అయ్యే వారైతే బాగుంటుందని అనుకొన్నాను. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ బాగా చేశారు. నేను ఏదైతే అనుకొన్నానో అదే అవుట్‌పుట్ ఇచ్చారు అని శ్రీకాంత్ ఓదెల చెప్పారు.


Click it and Unblock the Notifications











