బ్రహ్మోత్సవం డిజాస్టరే, ఒప్పుకున్న అడ్డాల.. కానీ ఫెయిల్ అవ్వలేదట!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో భారీ డిజాస్టర్ఏదైనా ఉందా అంటే అది బ్రహ్మోత్సవం అని చెప్పక తప్పదు. అలాంటి సినిమా తీశారు కాబట్టే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఐదేళ్ల పాటు తెలుగు సినిమాకి దూరం కావాల్సి వచ్చింది..ఆయన తాజాగా బ్రహ్మోత్సవం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

కొత్త బంగారులోకం లోకంతో
కొత్త బంగారు లోకం చిత్రంతో అరంగేట్రం చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. తన రెండవ చిత్రాన్ని వెంకటేష్, మహేష్ బాబులతో కలిసి బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ గా రూపొందించాడు. 'సీతమ్మ వకిత్లో సిరిమల్లె చెట్టు'తో అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రూపొందించారు.

సీతమ్మవాకిట్లోసిరిమల్లెచెట్టు దెబ్బతో
ఈ రెండో సినిమా హిట్ కావడం శ్రీకాంత్, మహేష్ బాబు కాంబినేషన్ లో రెండవ ప్రాజెక్ట్ కు దారి తీసింది. 'బ్రహ్మోత్సవం' పేరుతో ఈ చిత్రం 2016లో భారీ అంచనాలతో విడుదలై మహేష్ కెరీర్లోనే మరిచిపోలేని డిజాస్టర్ గా నిలిచింది. "బ్రహ్మోత్సవం" ఫ్లాప్ తరువాత ఈ దర్శకుడికి ఆఫర్లు తగ్గిపోయాయి. ఈ సినిమా ఫలితం దర్శకుడి కెరీర్‌పై భారీ ప్రభావాన్ని చూపిందనే చెప్పాలి.

ఇప్పుడు అనవసరం
తాజాగా ఆయన దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా "నారప్ప"తెరకెక్కింది. ఈ చిత్రం ప్రమోషన్లలో "బ్రహ్మోత్సవం" ఫ్లాప్ గురించి మాట్లాడారు శ్రీకాంత్. ఈ సమయంలో ఈ చిత్రంపై పోస్టుమార్టం అనవసరమని శ్రీకాంత్ అడ్డాల అభిప్రాయపడ్డారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్అని ఆయన అంగీకరించారు. "స్క్రిప్ట్ కరెక్ట్ గా లేకపోవడం ఎల్లప్పుడూ ఫ్లాప్ కు దారి తీస్తుంది. మేము ఒక ఉద్దేశ్యంతో సినిమాను ప్రారంభిస్తాము. కానీ కొన్నిసార్లు మేము దానిని అమలు చేయకపోవచ్చు. బ్రహ్మోత్సవం విషయంలో కూడా అదే జరిగింది అనిచెప్పుకొచ్చారు. ఈ సినిమా షాక్ ఏమీ కాదు... డిస్సపాయింట్మెంట్అంతే..సినిమా ఫెయిల్ అయ్యింది అంతే నేను ఫెయిల్ అవ్వలేదు కదా అని ఆయన చెప్పుకొచ్చారు.

ముందుకు సాగాలి
ఈ చిత్రం విడుదలై 5 సంవత్సరాలు అయ్యింది. దాని గురించి మాట్లాడటంలో అర్థం లేదు. కాబట్టి ముందుకు సాగాలి"అని ఆయన వెల్లడించారు. అంతేకాదు నేను మహేష్ బాబుతో ఒక సువర్ణావకాశాన్ని వృధా చేశానని శ్రీకాంత్ బాధ పడడం కొస మెరుపు. ఇక ఒకరకంగా "నారప్ప" కోసం శ్రీకాంత్ అడ్డాలను ఎంపిక చేసుకోవడం ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. మరి ఈ సినిమాని అడ్డాల ఎలా డీల్ చేశారో రేపు రిలీజ్ అయ్యాక తెలిపోనుడిం

అన్నాయ్అంటూ
"నారప్ప" తమిళ హిట్ చిత్రం "అసురన్" అధికారిక రీమేక్. ఈ చిత్రం శ్రీకాంత్ మునుపటి చిత్రాలలాగా కాకుండా పూర్తి యాక్షన్ తో నిండి ఉంది. ప్రియమణి, అభిరామి, కార్తీక్ రత్నం వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు ఈ దర్శకుడి తదుపరి చిత్రం గీతా ఆర్ట్స్‌లో ఉంది. అన్నాయ్ పేరుతో మూడు భాగాల సినిమా చేయనున్నామని కూడా ఆయన వెల్లడించారు. ఇక 'శ్రీకాంత్ క్రియేషన్స్'తో నిర్మాతగా మారాలని శ్రీకాంత్ యోచిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











