For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కంచి జయేంద్ర సరస్వతి అరెస్ట్ వెనుక ఆ ముగ్గురి హస్తం.. భారీ కుట్రలో అప్పటి ఏపీ సీఎం.. దర్శకుడు శ్రీనివాసరాజు

  |

  దండుపాళ్యం సినిమాతో దక్షిణాదిలో సంచలన విజయం అందుకొన్న దర్శకుడు శ్రీనివాసరాజు అందిస్తున్న తాజా చిత్రం తగ్గేదేలే. ఈ చిత్రంలో నవీన్, అనన్య రాజ్, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కంచి పీఠాధిపతి అరెస్ట్ గురించి తెలుగు ఫిల్మీబీట్‌తో శ్రీనివాస రాజు మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే..

  అప్పటి కుట్రలలో ఏపీ సీఎం

  అప్పటి కుట్రలలో ఏపీ సీఎం

  కంచీపురం వరదరాజ పెరుమాల్ ఆలయంలో మేనేజర్ శంకరరామన్ హత్య కేసులో పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి అరెస్ట్ వెనుక భారీ కుట్ర ఉందని దండుపాళ్యం ఫేమ్, దర్శకుడు శ్రీనివాస రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జయేంద్ర సరస్వతిపై భారీ కుట్ర జరిగింది.. ఆయన అరెస్ట్ తర్వాత చిత్రహింసలకు గురిచేశారు. ఈ కుట్రలో ఇద్దరు సీఎం, సోనియా గాంధీకి హస్తం ఉందని ఆరోపణలు చేశారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి ఓ సినిమా చేయడానికి సిద్దం అవుతున్నట్టు ఆయన తెలిపారు.

  అత్యంత పైశాచికత్వంతో

  అత్యంత పైశాచికత్వంతో


  2004లో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని అరెస్ట్ చేసి మూడు నెలలు జైల్లో పెట్టారు. ఆ సంఘటనలన్నింటిని స్క్రిప్టుగా రాశారు. నాకు తెలిసిన అత్యంత పైశాచికత్వంతో కూడిన ఘటన అది. మనకు తెలిసిన అమ్మాయిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి... చంపితే ఎవరు రియాక్ట్ కాకపోతే ఎలా ఉంటుందో.. నాకు అలా అనిపించింది. జయేంద్ర సరస్వతి అరెస్ట్ వెనుక జరిగిన కుట్రలో నేరుగా తమిళనాడు సీఎం జయలలితకు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే సోనియాగాంధీకి ప్రత్యక్ష సంబంధం ఉంది అని శ్రీనివాసరాజు తెలిపారు.

  హిందువులపై జరిగిన దారుణమైన దాడి

  హిందువులపై జరిగిన దారుణమైన దాడి


  జయేంద్ర సరస్వతి అరెస్ట్ సంఘటనను సినిమాగా తీయాలని ప్లాన్ చేశాను. కానీ నాపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. చంఘీజ్ ఖాన్, కుత్బుద్దీన్ ఐబక్ కాలంలో జరిగిన దారుణాల కంటే.. గత 200 సంవత్సరాల్లో హిందువులపై జరిగిన దారుణమైన ఎటాక్ అది. నేను స్క్రిప్టు రాసే సమయంలో ఏడ్చేశాను. స్క్రిప్టు చదివిన ప్రతీ ఒక్కరి హృదయం కదిలిపోయింది. నాలుగేళ్లుగా స్క్రిప్టు రాస్తూనే ఉన్నాను. త్వరలోనే సినిమాను తెరకెక్కిస్తాను అని శ్రీనివాసరాజు అన్నారు.

  ఆచార్య అరెస్ట్ అనే టైటిల్‌తో

  ఆచార్య అరెస్ట్ అనే టైటిల్‌తో


  జయేంద్ర సరస్వతి అరెస్ట్ కుట్రపై తీసే సినిమాకు ఆచార్య అరెస్ట్ అనే టైటిల్ అనుకొన్నాను. కానీ చిరంజీవి సినిమాకు ఆచార్య పెట్టడంతో నేను దానిని వద్దని అనుకొన్నాను. వేరే టైటిల్ పెట్టాలని అనుకొంటున్నాను. ఈ సినిమాను తీయగలిగితే.. నా జీవితానికి ఒక పరమార్థం దొరికినట్టు భావిస్తాను. అలాగని నేను హిందువు సంస్థలకు అనుకూలం కాదు.. నేను హిందూ ఇజాన్ని పాజిటివ్‌గా ఉండాలని కాదు అని దర్శకుడు శ్రీనివాసరాజు తెలిపారు.

  మతాలకు, కులాలకు అతీతంగా

  మతాలకు, కులాలకు అతీతంగా


  హిందూ, ఇతర మతాల గురించి నాకు పట్టింపు లేదు. ఎవరైనా కొడితే.. వచ్చే రక్తం హిందువుదా? ఇతర మతస్తుడిదా అని చెప్పగలరా? సమాజంలో జరిగిన సంప్రదాయంపై జరిగిన జరిగిన దాడిని అందరికి చెప్పాలని అనుకొన్నాను. సరిగ్గా అక్టోబర్ 17 రోజునే జరిగింది. సాధారణంగా మీరు అడిగారు కాబట్టి.. నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదు.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అవుతుంది అని దర్శకుడు శ్రీనివాస రాజు పేర్కొన్నారు.

  జయలలిత కారణంగా సినిమా తీయలేదు..


  జయేంద్ర సరస్వతి అరెస్ట్ తర్వాత చోటు చేసుకొన్న సంఘటనలు, జయేంద్ర సరస్వతిని జైల్లో పెట్టి చిత్ర హింసలు పెట్టిన తీరును నాకున్న నెట్‌వర్క్‌తో స్క్రిప్టు రాశాను. 2004లో సినిమా తీయడానికి నాకు జయలలిత అడ్డుగా ఉండేది. తమిళనాడు ప్రభుత్వం నుంచి నాకు ఒక రకమైన బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు జయలలిత లేదు కాబట్టి.. నేను ఆ సినిమాను తెరకెక్కిస్తాను. ఈ సినిమాను వెబ్ సిరీస్‌గా చేయను. సినిమాగానే తెరకెక్కిస్తాను అని శ్రీనివాస రాజు తెలిపారు.

  English summary
  Director Srinivasa Raju alleges Sonia Gandhi, Jaya Lalita and Andra Pradesh CM are behind Jayendra Saraswathi arrest
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X