Ravi Teja టాప్ 3 సినిమాలో రావణాసుర ఒకటిగా నిలుస్తుంది.. అలాంటి రిస్క్ అందుకే చేశాం.. సుధీర్ వర్మ (ఇంటర్వ్యూ)
యువ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన రావణాసుర రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హీరో సుశాంత్‌తోపాటు మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్, ఫరియా అబ్దుల్లా తదితరులు కీలక పాత్ర పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ...

నేను రాసిన కథ వర్కవుట్ కాలేదు..
రవితేజతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకొంటున్నాను. నేను రాసిన కథ వర్కవుట్ కాలేదు. అందుకే శ్రీకాంత్ విస్సా అందించిన కథతో రావణాసుర సినిమా చేశాం. రవితేజతో ఫలానా సినిమా చేయాలనే మైండ్‌సెట్‌తో లేను. రవితేజకు శ్రీకాంత్ విస్సా కథ చెప్పిన తర్వాత ఆ స్టోరికి నేను న్యాయం చేస్తానని నా వద్దకు పంపారు. రావణాసుర ఎవరూ ఊహించని కొత్త జోనర్ అని సుధీర్ వర్మ చెప్పారు.

శ్రీకాంత్ రాసిన కథ ఓ ఛాలెంజ్
సాధారణంగా నా సినిమాకు నేను కథ రాసుకొంటాను. కానీ రావణాసుర సినిమాకు శ్రీకాంత్ కథ అందించాడు. అయితే ఒకరు కథ రాస్తే.. దర్శకుడికి ఒక ఛాలెంజ్‌గానే ఉంటుంది. నేను కథ రాస్తే నా మైండ్‌లో అంతా ఉంటుంది. నా కంటూ విజువల్ సెన్స్ ఉంటుంది. వేరేవాళ్లు కథ రాస్తే.. ఏదైనా డౌట్ వస్తే.. రచయితతో క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రచయిత విజువల్ సెన్స్‌ను బట్టి.. అనుసరించడమే లేదా కొన్ని మార్పులు చేసుకొని వెళ్లడం చేస్తుంటాం. సుశాంత్‌కు కథ చెప్పినప్పుడు ఆయన కొన్ని మార్పులు చేశారు. అలా కథకు అవసరమైతే మార్పులు చేయడం సహజమే అని సుధీర్ వర్మ పేర్కొన్నారు.

థ్రిల్స్, ట్విస్టులు, షాకింగ్ ఎలిమెంట్స్‌తో
రావణాసుర చిత్రం థ్రిల్లింగ్, షాకింగ్ ఎలిమింట్స్‌తో సాగే డిఫరెంట్ సినిమా. ప్రేక్షకులకు అలాంటి థ్రిల్స్, షాకింగ్ ట్విస్టులు తెలియకూడదనే మేము చాలా సీక్రసీని మెయింటెన్ చేస్తున్నాం. సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వాలని మేము కోరుకొంటున్నాం. అందుకే ప్రమోషన్స్‌లో కంటెంట్‌ను రిలీజ్ చేయడం లేదు. సినిమా చూసిన తర్వాత మీతో తప్పకుండా డిస్కషన్ చేస్తాం. సినిమా సూపర్ ఎక్సైటింగ్‌గా ఉంటుంది అని దర్శకుడు సుధీర్ వర్మ తెలిపారు.

హీరోలను నెగిటివ్‌గా చూపించడం
హీరోలను గ్రే (నెగిటివ్) షేడ్‌లో చూపించడం కొత్త కాదు. రాంగోపాల్ వర్మ తీసిన అంతం సినిమాలో హీరో క్యారెక్టర్ నెగిటివ్‌గానే ఉంటుంది. అలాగే సత్య సినిమాలో జేడీ చక్రవర్తి క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. అయితే మనం ఎలా చూపిస్తే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడనేది ఇంపార్టెంట్. రావణాసుర అనగానే నెగిటివ్ సెన్స్ వస్తుంది. ఈ సినిమాలో రవితేజ రావణాసురుడా? లేదా రాముడా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది అని సుధీర్ వర్మ అన్నారు.

ఐదుగురు హీరోయిన్లు ఎందుకంటే?
రావణాసుర సినిమా కథకు ఐదుగురు హీరోయిన్లు కీలకం. వారిని నేను హీరోయిన్లు అనను. క్యారెక్టర్లు అనను. కానీ సినిమా మొత్తం ఆ పాత్రలు ఉంటూనే ఉంటాయి. ఇలాంటి జోనర్, కథను ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూసి ఉండరు. ఇలా నేను చెబితే ఓవర్ కాన్షిడెన్ష్ అనుకొంటారు. కానీ సినిమా చూసిన తర్వాత మీరే కరెక్ట్ అంటారు అని సుధీర్ వర్మ చెప్పారు.

రవితేజ కెరీర్‌లో టాప్ 3లో ఒకటిగా..
రవితేజ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. నేను ఆయనను దృష్టిలో పెట్టుకొని రాసుకొన్న స్క్రిప్టు కంటే రవితేజ ఎక్కువే చేశారు. రవితేజ కెరీర్ టాప్ 3 సినిమాల్లో రావణాసుర ఒకటి అని నేను భావిస్తున్నాను. ఈ సినిమాపై నమ్మకంతోనే ఆయన మూవీలో నిర్మాతగా ఒకరిగా మారారు. తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాను చూసి థ్రిల్, షాకింగ్ అవుతారు అని సుధీర్ వర్మ అన్నారు.


Click it and Unblock the Notifications











