Sujeeth: OG మూవీకి ప్రీక్వెల్.. పవన్ కల్యాణ్‌కు చెప్పిన అసలు స్టోరీ ఏమిటంటే?
వపర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ మూవీ THEY CALL HIM OG. ఈ చిత్రానికి యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ స్పందన దక్కుతోంది. సెప్టెంబర్ 25న ఓజీ చిత్రంతో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైంది.
థియేటర్లలో పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, గ్రాండ్ ఎలివేషన్స్, ఒళ్లు వణుకుపుట్టే రేంజ్ లో యాక్షన్ సీన్లు, పవన్ స్టార్ గ్యాంగ్ స్టర్ అటిట్యూడ్, ఎస్ఎస్ థమన్ బీజీఎం, సంగీతానికి ప్రేక్షకుల నుంచి మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం అవుతోంది. మొత్తానికి పవన కళ్యాణ్ ను వెండితెరపై ఎలా చూడాలని అనుకున్నారో అభిమానులు అలాగే చూశామని చెబుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంది.

ఇదెలా ఉంటే.. OG సినిమా కథ ముగింపులో పార్ట్ 2 కూడా ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే OG 2కు సంబంధించిన కథ ఎలా ఉంటుందనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో OG చిత్రానికి సంబంధించిన కథ గురించి దర్శకుడు సుజీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ కు సుజీత్ చెప్పిన కథ గురించి చెప్పుకొచ్చారు.
సుజీత్ మాట్లాడుతూ.. జపాన్ తరుపున మన ఇండియన్స్ వెళ్లి వాళ్లతోపాటు యుద్ధం చేశారు. అలా వెళ్లిన ఇండిన్ ఆర్మీ అక్కడే ఉండిపోతే, ఆయనకు ఫ్యామిలీ, గ్యాంగ్ స్టర్ బ్యాక్ గ్రౌండ్ ఎలా వచ్చిందనేది ఓజీ కథలో చూపించాం. అయితే ఈ కథకు బ్యాక్ స్టోరీ ఏంటీ? ఒజాస్ గంభీరా వాళ్ల నాన్న ఎవరు? అప్పట్లో సుభాష్ చంద్రబోస్ ఇండియన్స్ ఫ్యామిలీస్ ను జపాన్ వార్ లోకి తీసుకెళ్లారు. అలా అక్కడ ఏం జరిగి ఉంటుందనేది OG సినిమాకు ప్రీక్వెల్ ఉంది.
ఓజీ ప్రీక్వెల్ కథను కూడా పవన్ కల్యాణ్ గారికి ఎప్పుడో చెప్పాను. ప్రీక్వెల్ లోనే సుభాష్ చంద్రబోస్ గారి అంత్యక్రియలు కూడా జపాన్ లోనే ఉంటాయి. ఇలా కథకు చాలా పెద్ద హిస్టరీ ఉంది. అయితే ప్రస్తుతం OGలో మాత్రం నేను ఎంచుకున్న కథ వరకే చిత్రీకరించాను. అన్ని విషయాలను కలగలిపితే బాగోదనిపించింది. అందుకు OGలో ఒక గురువుకు శిష్యుడికి మధ్య ఉన్న బంధం, ఆ గురువు చనిపోయిన తర్వాత ఓజాస్ గంభీరా ఏం చేశాడనేది, ఎలా మాఫియాకు టర్న్ అయ్యి అతని జర్నీ సాగిందనేది చూపించాం. ఇక దీనికంటే ముందే చాలా పెద్ద కథ ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి చెప్పామంటూ సుజీత్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











