రంగస్థలం2 తీస్తా.. కానీ ఆ భయం వెంటాడుతున్నది.. విజయేంద్ర ప్రసాద్‌కు థ్యాంక్స్.. సుకుమార్

By Rajababu

సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన రంగస్థలం టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తున్నది. సినిమా రిలీజైన మొదటి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ అందుకొన్నది. రంగస్థలం చిత్రానికి స్థానికంగానూ, ఓవర్సీస్ మార్కెట్‌లో కలెక్షన్లు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రంగస్థలం సినిమా గురించి దర్శకుడు సుకుమార్ పలు విషయాలు వెల్లడించారు.

Recommended Video

Rangasthalam Movie Is About To Reach 100Cr Collection
రంగస్థలం సినిమా సక్సెస్

రంగస్థలం సినిమా సక్సెస్

రంగస్ఠలం సినిమా సక్సెస్‌తో చాలా రిలాక్స్ అయ్యాను. సక్సెస్ ఎప్పుడూ కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తున్నది. ఈ సినిమా సక్సెస్‌తో ఇండస్ట్రీలోని కొందరికి సమాధానం చెప్పానని ఎవరైనా అనుకొంటే తప్పు. మన ఫ్లాపులకు మనమే కారణం. ఓ డైరెక్టర్ సరిగా కథ చెప్పలేకపోవడంతోనే పరాజయాలు ఎదురవుతుంటాయి. రంగస్థలం సినిమా విషయంలో అన్నీ చక్కగా కుదిరాయి. అందుకే ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు.

చిరంజీవి జడ్జిమెంట్ కరెక్ట్

చిరంజీవి జడ్జిమెంట్ కరెక్ట్

సినిమా నిడివి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రేక్షకుల నుంచి లెంగ్తు విషయంలో ఫిర్యాదులు లేవు. చిరంజీవి జడ్జిమెంట్ సరిగ్గా ఉంది. కథలో ఇంటెన్సిటీ ఉండటంతో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ సారి క్షమించేశారు.

చాలా రీసెర్చ్ చేశాం..

చాలా రీసెర్చ్ చేశాం..

రంగస్థలం సినిమాలో అన్ని పాత్రలను ఆదరిస్తున్నారు. అందుకు కారణం మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్. దర్శకత్వ విభాగంలోని ప్రతీ ఒక్కరు చాలా రిసెర్చ్ చేశారు. మా అన్నయ్యకు 80 నాటి పరిస్థితులను చూసిన అనుభవం ఉంది. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన తర్వాత మా పని చాలా సులభమైంది అని దర్శకుడు సుకుమార్ అన్నారు.

 ముందు క్లైమాక్స్ రాసుకొన్నాను

ముందు క్లైమాక్స్ రాసుకొన్నాను

రంగస్థలం సినిమా కథ అందర్ని ఆకర్షించే విధంగా రావడం వెనుక క్లైమాక్స్ సహయపడింది. ముందుగా క్లైమాక్స్ రాసుకొన్నాను. అది బాగా రావడంతో కథ బలంగా అల్లుకొన్నాను. పాత్రల డిజైన్‌ చక్కగా కుదిరింది. అందుకే ప్రతీ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అద్భుతమైన ఫలితాన్ని సాధించాం

అద్భుతమైన ఫలితాన్ని సాధించాం

లక్ష్యం ఏదైనా కావొచ్చు. గమ్యానికి చేరడంలో కష్టాలు ఉండవచ్చు. కానీ ఫలితం చాలా ముఖ్యమైపోతుంది. ఏడాదికిపైగా యూనిట్ అంతా శ్రమించాం. అద్భుతమైన ఫలితాన్ని సాధించాం. రంగస్థలం విజయాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను.

విజయేంద్ర ప్రసాద్‌కు థ్యాంక్స్

విజయేంద్ర ప్రసాద్‌కు థ్యాంక్స్

సాధారణంగా నేను కథ తయారుచేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటాను. కానీ రంగస్థలం చిత్ర విషయంలో విజయేంద్రప్రసాద్‌గారికి చాలా థాంక్స్ చెప్పాలి. కానీ రంగస్థలం కథను మొత్తం ఆలోచించడానికి ఇరవైనిమిషాలు పట్టింది. విజయేంద్రప్రసాద్ గారు నాకు భజరంగీ బాయ్‌జాన్ కథ చెప్పారు. ఆయన చెప్పిన ఇరవై నిమిషాలు కథ మొత్తం యథాతథంగా తెరపై ఆవిష్కృతమైంది. ఆయన స్ఫూర్తితో కథా రచనకు ఎక్కువ సమయం తీసుకోవద్దని నిర్ణయించుకున్నాను. రంగస్థలం మూల కథకు ఇరవై నిమిషాల్లోనే రూపకల్పన చేశాను. ఆ తర్వాత కొన్ని బెటర్‌మెంట్స్ చేసుకున్నాం.

రంగస్థలం2 తీస్తా

రంగస్థలం2 తీస్తా

రంగస్థలం సినిమాకు కొనసాగింపుగా రంగస్థలం2 చిత్రాన్ని రూపొందించాలని అనుకొంటున్నాను. నిర్మాతలు ఒప్పుకొంటే ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా మదిలో ఓ కథను అనుకొన్నాను. కానీ నాకు ఒకటే భయం. ఎందుకంటే ఆర్య తర్వాత ఆర్య2 తీస్తే చేదు అనుభవం ఎదురైంది. మళ్లీ అలాంటి అనుభవం కాకూడదని అనుకొంటున్నాను.

చిరంజీవి కోసం కథ రాసుకోలేదు

చిరంజీవి కోసం కథ రాసుకోలేదు

నా తదుపరి చిత్రం చిరంజీవితో అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటివరకు చిరంజీవి కోసం కథ తయారు చేసుకోలేదు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే నా కల నెరవేరినట్టే.

రాంచరణ్ చాలా హ్యాపీ

రాంచరణ్ చాలా హ్యాపీ

రంగస్థలం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో రాంచరన్ చాలా హ్యాపీగా ఉన్నారు. చరణ్ చేయడం వల్లనే రంగస్థలం సినిమాకు మంచి రేంజ్ వస్తున్నది. చిరంజీవి ఫ్యాన్స్ కూడా సినిమా విజయానికి ఓ కారణం. సినిమా చూసి చిరంజీవి గట్టిగా కౌగిలించుకొన్నాడు అని సుకుమార్ అన్నారు.

నా పంథాను మార్చుకోను

నా పంథాను మార్చుకోను

రంగస్థలం సినిమా విజయం తర్వాత నా ఆలోచనా విధానం గానీ, సినీ నిర్మాణంలో నా పంథా గానీ మారదు. సక్సెస్‌ కారణంగా నా పంథాను మార్చుకొంటే అది సరికాదు. నా థింకింగ్‌ను మార్చుకొను. ఇక ముందు కూడా నాలాగే ఆలోచిస్తాను అని సుకుమార్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X