RX100 కంటే డబుల్ డోస్.. ఆయన చింపేశాడు.. లిప్‌లాక్స్ కోసం హీరోయిన్స్‌ను ఎలా ఒప్పించామంటే?

RX100 సినిమాతో అందర్ని ఆకట్టుకొన్న హీరో కార్తీకేయ తాజా చిత్రం హిప్పీ. గతంలో సూర్య, భూమికతో 'నువ్వు, నేను, ప్రేమ' సినిమాకు దర్శకత్వం వహించిన టీఎన్ కృష్ణ ఈ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించారు. దిగంగన సూర్యవన్షీ, జేడీ చక్రవర్తి తదితరులు నటించారు. RX 100 ఫేం ఆర్డీ రాజశేఖర్ సంగీత దర్శకుడిగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు టీఎన్ కృష్ణ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. టీఎన్ కృష్ణ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

 యూత్‌కు బాగా నచ్చే చిత్రం

యూత్‌కు బాగా నచ్చే చిత్రం

మనసులో ఏది తోచిదే అది చేసే వ్యక్తులను హిప్పీ అని అర్థం. ఈ సినిమా హ్యాపీగా చూసే ఎలిమింట్స్ ఉంటాయి. యూత్‌కు బాగా నచ్చే చిత్రం. ఇప్పటి జనరేషన్‌కు ఏది నచ్చుతుందో అది హిప్పీలో ఉంటుంది. అడల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున ఎవరికీ ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం నెటిఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఫ్లాట్‌ఫాంలో వస్తున్న వెబ్ సిరీస్‌తో పోల్చుకొంటే హిప్పిలో అంత అడల్డ్ కంటెంట్ ఉండదు. ఈ జనరేషన్‌కు, కాంటెంపరరీ పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుంది.

 ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా

ప్రముఖ ఆంగ్ల కవి జాన్ మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్. ప్యారడైస్ రీగెయిన్ పద్యకావ్యం నుంచి స్ఫూర్తి పొందిన కథ ఇది. ఆడమ్, ఈవ్ అనే క్యారెక్టర్లను తీసుకొని తాజా పరిస్థితులకు అనుగుణంగా, నేటి యువతకు నచ్చే విధంగా కథను మలిచాను. హిప్పీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా నచ్చుతుంది అని దర్శకుడు టీఎన్ కృష్ణ తెలిపారు.

జేడీ చక్రవర్తి నటన అద్భుతంగా

జేడీ చక్రవర్తి నటన అద్భుతంగా

హిప్పి సినిమాలో జేడీ చక్రవర్తిది అద్భుతమైన క్యారెక్టర్. ఈ సినిమాలో జేడీ చింపేశాడు. అతనిది లవ్ గురు లాంటి క్యారెక్టర్ కాదు. ఎవరైనా, ఏదైనా అడిగితే ఎస్ అనే క్యారెక్టర్ జేడీది. అతనిది పాత్ర అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతుంది. తమిళంలో తీయలేదు. తమిళ హీరోలు రీమేక్ హక్కులను అడుగుతున్నారు. రీమేక్‌కు డైరెక్షన్ చేస్తానా అనేది ఇప్పుడే చెప్పలేను అని టీఎన్ కృష్ణ చెప్పారు.

మితిమీరిన శృంగారం..

మితిమీరిన శృంగారం..

హిప్పీ సినిమాలో అందమైన ప్రేమ ఉంటుంది. కానీ లస్ట్ ఉండదు. మితిమీరిన శృంగారం ఉండదు. ఏ సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రనా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఈ జనరేషన్, ఈ కాలం ప్రేక్షకులు అంగీకరించేలానే రొమాన్స్ ఉంటుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కల్చరల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. ఇప్పుడు ఓ రేంజ్ రొమాన్స్ ఉంటుంది అని టీఎన్ కృష్ణ వెల్లడించారు.

నువ్వు నేను ప్రేమ తర్వాత

నువ్వు నేను ప్రేమ తర్వాత

నువ్వు నేను ప్రేమ తర్వాత నాకు చాలా గ్యాప్ వచ్చింది. ఆ సినిమా తర్వాత చేసిన మూవీ ఆడలేదు. ఆ తర్వాత మరో సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సినిమా ఆగిపోయింది. దాంతో నా కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. అవన్నీ దాటుకొంటూ ఇప్పుడు హిప్పీ సినిమాను చేసే అవకాశం లభించింది. అందుకు నిర్మాత కలైపులి ఎస్ థానుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అన్నారు.

హిప్పీ కథ ఎలా పుట్టిందంటే

హిప్పీ కథ ఎలా పుట్టిందంటే

నా జీవితంలోని, నా స్నేహితుల లైఫ్‌లోని కొన్ని సంఘటనలు, అనుభూతుల నుంచి హిప్పీ సినిమా కథ పుట్టింది. అలాగా అని నా బయోపిక్ కాదు. కార్తీకేయ, జెడీ చక్రవర్తి క్యారెక్టర్లలో నన్ను నేను చూసుకొన్నాను. ఈ సినిమాలో ఎమోషనల్ పాయింట్‌ కథను నడిపిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరి రిలేషన్ షిప్‌లో ఎలాంటి అనర్థాలు చోటుచేసుకొంటున్నాయి. ఈ సినిమాలో ఓ ఫిలాసఫికల్ పాయింట్ అందర్నీ ఆకట్టుకొంటున్నది.

దిగంగన సూర్యవంశీని ఎలా ఒప్పించామంటే

దిగంగన సూర్యవంశీని ఎలా ఒప్పించామంటే

హీరోయిన్ దిగంగన సూర్యవన్షీ ఫోటోను సోషల్ మీడియాలో చూశాను. ఆమె గురించి ఆరా తీస్తే చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలిసింది. పలు సినిమాల్లో నటించిందని తెలియడంతో దిగంగనను అప్రోచ్ అయ్యాం. మా సినిమాలో లిప్‌లాక్స్ ఉన్నాయి. కథ చెప్పినప్పుడే ఇలాంటి సీన్లు ఉంటాయని చెప్పాను. అందుకు ఆమె ఒప్పుకొని చేయడానికి ముందుకొచ్చింది. RX 100 సినిమాలో హీరో ఒకరితో లిప్‌లాక్ చేస్తే.. ఈ సినిమాలో ఇద్దరితో లిప్‌లాక్ చేస్తాడు. ఈ సినిమాలో కార్తీకేయ బాక్సర్‌గా నటించాడు అని టీఎన్ కృష్ణ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X