Naa Saami Ranga స్టోరి చెప్పడానికి వెళ్తే.. నాగార్జున అలా షాకిచ్చారు.. డైరెక్టర్ విజయ్ బిన్ని
టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని నటించిన తాజా చిత్రం నా సామిరంగ. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారుతూ రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి తమ సొంత బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై భారీగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి విజయ్ బిన్ని తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
దర్శకుడిగా కావాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. ప్రభుదేవా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వొస్తొనంటే నేనొద్దంటానా అనే సినిమా చూసిన తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకొన్నాను. కొరియోగ్రాఫర్‌గా మారితే అని విభాగాలపై పట్టు ఉంటుందని నేను అటువైపు వెళ్లాను. ఆ తర్వాత అన్ని విభాగాలపై పట్టు సాధించిన తర్వాత దర్శకుడిగా మారాలని ప్రయత్నాలు చేపట్టాను అని విజయ్ బిన్ని చెప్పారు.

నాగార్జున గారి సినిమాలకు నేను పనిచేశాను. ఆయన నటించిన సినిమాల్లోని పాటలకు కొరియోగ్రఫి చేశాను. ఆ పరిచయంతో ఆయనతో సినిమా చేయాలని కథ చెప్పడానికి వెళ్లాను. అయితే ఆయన తన వద్ద ఉన్న కథను ఇచ్చి ఈ సినిమాను చేయమని చెప్పారు. అప్పుడు కథంతా చదివి నా తరహాలో స్టోరిని మ్యూజిక్‌తో చెప్పేలా డిజైన్ చేశాను అని విజయ్ బిన్ని తెలిపారు.
నా సామిరంగ చిత్రం ఫ్రెండ్‌షిప్ ఆధారంగా సాగుతుంది. అల్లరి నరేష్ పోషించే క్యారెక్టర్‌కు నాగార్జున అంటే చాలా ఇష్టం. వారిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్‌ను ఆయన బాగా చేశారు. మరో యంగ్ క్యారెక్టర్ కోసం రాజ్ తరుణ్‌ను తీసుకోవాలని అనుకొన్నాను. అంతకుముందు ఆయనతో పనిచేశాను. ఆ చనువుతో నేను అడిగితే చేస్తానని ఈ ప్రాజెక్టులోకి వచ్చారు అని విజయ్ బిన్ని తెలిపారు.
వాస్తవానికి నా సామిరంగ సినిమాలోని పాటల వేరే కొరియోగ్రాఫర్లతో చేయించాలని అనుకొన్నాను. కానీ వారి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నేను నాలుగు పాటలకు కొరియోగ్రఫి చేశాను. విజయ్ పొలంకి, దినేష్ మాస్టర్ ఒక్కొ పాట చేశారు. విజయ్ నాతో కలిసి పనిచేశారు. నేను డైరెక్టర్‌గా మారే సమయంలో ఆయనకు సపోర్ట్‌గా ఉండాలని అనుకొన్నాను అని విజయ్ బిన్ని చెప్పారు.
డైరెక్టర్ కావడం నా డ్రీమ్. ఆ కల కోసం చాలా కష్టపడ్డాను. సరైన సమయంలో ఈ చిత్రం చేసే అవకాశం వచ్చింది. నాకు వచ్చిన ఆఫర్‌ను ఉపయోగించుకొని బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఫ్రెండ్‌షిప్, లవ్ స్టోరి, ఎమోషన్స్ బాగా వచ్చాయి. నిర్మాతలు, కీరవాణి నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని విజయ్ బిన్ని అన్నారు.


Click it and Unblock the Notifications











