డబ్బు విషయంలో మోసం.. అడిగితే అలా అన్నారు.. శ్రీహరిని తలుచుకుంటూ ఏడ్చిన డిస్కో శాంతి
రియల్ స్టార్ శ్రీహరి మరణించి ఏడేళ్లు అవుతోంది. శ్రీహరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మేఘాంశ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. అయితే రాజ్ ధూత్ అంటూ శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ చేసిన ప్రయత్నం అంతగా మెప్పించలేకపోయింది. ఆ మూవీ ప్రమోషన్స్ డిస్కో శాంతి భుజాన వేసుకుని మరీ చేశారు. మేఘాంశ్ ఎంట్రీకి సినీ సెలెబ్రిటీలు కూడా మద్దతు పలికారు. కానీ ఆ సినిమా అంతగా పేరు తీసుకురాలేకపోయింది. రెండో సినిమా కోతి కొమ్మచ్చి మూవీని ప్రారంభించిన మేఘాంశ్ దీపావళి సందర్భంగా అమ్మ డిస్కో శాంతితో కలిసి మీడియాతో ముచ్చటించారు.
Recommended Video

సారీతో మొదలు..
ఓ సినిమా షూటింగ్‌లో సీన్ చేస్తుంటే నా గోర్ల వల్ల ఆయనకు గీరుకు పోయాయి.. అప్పుడు వెళ్లి సారీ చెప్పాను.. అలా చెప్పడంతో మా పరిచయం ఇంకాస్త పెరిగి ప్రేమ, పెళ్లి వరకు వెళ్లిందని చెప్పారు. 1992లో పెళ్లి చేసుకున్నా కెరీర్ కోసం బయటకు చెప్పలేదని ఆ తరువాత 1996లో అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నామని చెప్పారు.

బర్త్ డే అలా..
ఓసారి నా బర్త్ డే అని శ్రీహరి గారు ఏం కావాలని అడిగారు. ఏమీ వద్దని చెప్పాను. కానీ ఉదయాన్నే షాపుకు తీసుకెళ్లారు. అది ఇంకా ఓపెన్ చేయకపోయినా తెరిపించారు.. నగల షాపులో ఏది కావాలో తీసుకో అన్నారు. నేను అలా అలా చూస్తుంటే ఏదో డిజైన నచ్చి చూస్తున్నాను.. ‘కావాలా నచ్చిందా తీసుకో అది ప్యాక్ చేయండని' శ్రీహరి అన్నారు.. మళ్లీ ఇంకోటి కూడా చూస్తుంటే.. ‘అది కూడా నచ్చిందా.. ప్యాక్ చేసేయండి' అని చెప్పారు. ఆ సమయంలో చేతిలో డబ్బులు కూడా లేవని చెప్పుకొచ్చారు.

అది మేం చెప్పుకోం..
శ్రీ హరి బర్త్ డే సందర్భంగా అనాథాశ్రమాలకు అన్నదానం, పెద్దమ్మ గుడిలో అన్నదానం చేసేశారు. ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. కానీ మేం చేస్తున్నామని చెప్పము.. అవతలి వాళ్లు సంతోషంగా ఉన్నారు అది చాలు అని డిస్కో శాంతి చెప్పుకొచ్చారు.

డబ్బులు ఇవ్వాలి..
మేము ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదు.. మాకే ఇచ్చేది ఉన్నారు.. అడిగితే మాత్రం శ్రీహరి గారే మాకు ఇంకా ఇవ్వాలి అని చెబుతున్నారు. అలా అన్నవారే ఇప్పుడు ఏమీ లేకుండా పోయారు అని డిస్కో శాంతి పేర్కొన్నారు. అయితే బిత్తిరి సత్తి పాడిన పాటలను విన్న డిస్కో శాంతి కన్నీరుమున్నీరయ్యారు.


Click it and Unblock the Notifications











