ఎలాంటి పాత్రలకైనా సిద్ధమే.. ఆ విషయాన్ని పట్టించుకోను.. దివి వద్యా
బిగ్‌బాస్ తెలుగుకు సంబంధించిన దసరా మహా ఎపిసోడ్ సందర్భంగా ఎలిమినేట్ అయిన దివి వద్యా పలు మీడియా ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలో తన భవిష్యత్ కార్యాచరణను మాటల్లో పంచుకొన్నారు. తనకు నటనపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ..

చిన్నప్పటి నుంచే యాక్టర్ కావాలని
నేను చదువుకొంటున్నప్పటి నుంచే యాక్టర్ కావాలని కోరుకొన్నాను. బిటెక్, ఎంటెక్ పూర్తి చేశాను. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి ఎలా రావాలో తెలియలేదు. అందుకు ఫ్లాట్ ఫాంగా మోడలింగ్‌ను ఎంచుకొన్నాను. ఏ సినిమా ఆఫర్ కోసం వెళితే ఏం చేశావని అడుగుతారు. కాబట్టి మోడలింగ్ అని చెప్పి చాలా ఆడిషన్స్‌కు వెళ్లాను. చిన్న కార్యక్రమాల్లో ర్యాంప్‌పై నడిచాను అని దివి చెప్పింది.

ఆడిషన్స్ సమయంలో అలాంటి సంఘటనలు
సినిమాల్లో నటించడం కోసం చాలా ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు కొన్ని అవమానాలు భరించాను. చాలాసార్లు నాకు లభిస్తుందనుకొన్న ఆఫర్లు నా చేజారాయి. అందుకే వెబ్ సిరీస్, చిన్న చిన్న పాత్రలకు కూడా ఒప్పుకొన్నాను. వెబ్ సిరీస్‌లో కొంత మేరకు హాట్ నటించాల్సి వచ్చినా ఆలోచించలేదు. ఎందుకంటే మంచి పాత్రలు కావడంతో ఒప్పుుకోవాల్సి వచ్చింది అని చెప్పారు.

స్క్రిప్టు డిమాండ్ చేస్తే..
సినిమా పరిశ్రమ అంటే గ్లామర్ ఫీల్డ్. స్క్రిప్టు డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలకైనా.. ఎలాంటి క్యాస్టూమ్స్ ధరించడానికైనా సిద్దం. పాత్రను బట్టి క్యాస్టూమ్స్ వేసుకోవడం తప్పేమి కాదు. నేను ఏదైనా చేస్తున్నానంటే.. నా పాత్ర చేసినట్టు... కానీ దివి చేసినట్టు కాదు అని మనసులో పెట్టుకొంటాను అని దివి చెప్పారు.

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత
సినిమా పరిశ్రమలో రాణించడానికి నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం పూర్తిగా ఉంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత నాకు లభిస్తున్న రెస్పాన్స్ చూసి సంతోషంలో మునిగిపోతున్నాను. మా ఊర్లో వారందరూ బిగ్‌బాస్‌కు వెళ్లివచ్చావు అంటూ ప్రశంసించడం గర్వంగా అనిపిస్తున్నది అని దివి చెప్పారు. బిగ్‌బాస్ నుంచి బయటకు రావడంలో నాకు ఎలాంటి బాధలేదు. ఎప్పటికైనా ఇంటి నుంచి ఎవరైనా రావాల్సిందే. నేను ఎవరో తెలియకుండా ఏడు వారాలపాటు ఇంట్లో ఉన్నానంటే నన్ను ఎంతగా ప్రేక్షకులు ఇష్టపడ్డారో అనే విషయం స్పష్టమైంది.


Click it and Unblock the Notifications











