స్పెయిన్‌లో రవితేజ ఫాలోయింగ్ చూసి మైండ్ బ్లాంక్.. అందుకే ఆయనకు భార్యగా.. హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ (Interview)

మజిలీ సినిమా తర్వాత టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టాను.. డ్యాన్సులు, తెలుగు భాషను నేర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో లాక్‌డౌన్‌ వచ్చింది. ఆ సమయంలో నేను వర్కవుట్స్ మొదలుపెట్టి శరీరాకృతిని మార్చుకొన్నాను. ఓ రోజు ఇన్స్‌టాగ్రామ్‌లో చీరకట్టుతో నుదుట బొట్టు పెట్టుకొన్న ఫోటోలు పెట్టాను. వాటిని చూసిన డైరెక్టర్ శరత్ మండవ నాకు కాల్ చేసి కథ నేరేట్ చేశాడు. అలా నాకు రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఆఫర్ వచ్చింది అని దివ్యాంశ కౌశిక్ తెలిపారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం జూలై 29న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

 రవితేజ అంటే నాకు చాలా ఇష్టం

రవితేజ అంటే నాకు చాలా ఇష్టం

నాకు రవితేజ అంటే ఇష్టం. విక్రమార్కుడు సినిమా చూసిన తర్వాత నేను ఆయనకు ఫ్యాన్ అయ్యాను. అలా ఆయనతో నటించాలనే కోరిక పుట్టింది. రవితేజ హీరో అని చెప్పడంతో ముందు వెనుకా ఆలోచించకుండా రామారావు ఆన్ డ్యూటీ ఒప్పేసుకొన్నాను. రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నా పాత్ర పేరు నందిని. మరోసారి నేను అందాల ముద్దుగుమ్మ పాత్రలో కనిపిస్తాను. రవితేజ భార్యగా గృహిణి పాత్రను పోషిస్తున్నాను. గతంలో యంగ్ హీరోయిన్‌గా కనిపించాను. కానీ ఈ సినిమాలో భార్యగా, తల్లిగా భారమైన పాత్రను పోషిస్తున్నాను. మెచ్యురిటీ ఉన్న పాత్ర ఇది. కంపల్సరీగా నీవు చేస్తే బాగుంటుంది దివ్యాంశక కౌశిక్ చెప్పారు.

పక్కా గృహిణి పాత్రలో

పక్కా గృహిణి పాత్రలో


మజిలీ చిత్రంలో చైల్డ్‌హుడ్ రొమాన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించాను. రామారావు ఆన్ డ్యూటీ చాలా పరిణితి చెందిన మహిళ పాత్ర. కొన్ని విషయాలను ముందుకు తీసుకెళ్లే పాత్ర నాది. రామారావును డ్యూటీకి సిద్దం చేసే స్కోప్ ఉన్న పాత్ర. గతంలో నేను స్కర్టులు, జీన్స్, షార్ట్స్ వేసుకొన్నాను. కానీ ఈ చిత్రంలో చీరె కట్టుకొని.. పక్కాగా గృహిణిగా కనిపిస్తాను. ఈ పాత్ర కోసం నెల రోజులపాటు వర్క్‌షాప్ చేశాం. పాత్ర గురించి అవగాహన కలిగించేందుకు దర్శకుడు శరత్ మండవ ప్రయత్నించారు. డైలాగ్స్ చక్కగా నేర్పించారు దివ్యాంశ కౌశిక్ అన్నారు.

నా పాత్రతో అలాంటి ట్విస్టు

నా పాత్రతో అలాంటి ట్విస్టు


నేను ప్రధానంగా డైరెక్టర్ యాక్టర్‌ను. నా డైరెక్టర్ ఆలోచనకు తగినట్టుగా పాత్రను పొషిస్తాను. గతంలో పోషించని, నాకు ఛాలెంజిగ్‌గా నిలిచే పాత్రలను చేయాలని ఎదురుచూస్తున్నాను. నేను ఏమిటనేది ప్రూవ్ చేసుకోవాలనే తపన ఉంది. రవితేజ మాస్ హీరో పక్కన ఆ స్థాయిలో నటించే పాత్ర కావడంతో నేను గృహిణి పాత్రలో నటించడానికి వెనుకాడలేదు. రామారావు తన లక్ష్యాన్ని చేరుకొనేందుకు నా పాత్ర కీలకంగా మారుతుంది. నా పాత్ర చుట్టూ ఓ ట్విస్టు ఉంటుంది. అందుకే నందిత పాత్రను అంగీకరించాను అని దివ్యాంశ కౌశిక్ చెప్పారు.

 రవితేజను తొలిసారి కలిసిన తర్వాత

రవితేజను తొలిసారి కలిసిన తర్వాత


రవితేజను కలువడానికి ముందు నేను చాలా నెర్వస్‌గా ఉన్నాను. సెట్లో ఆయనను కలిసిన తర్వాత సార్ అని విష్ చేస్తే.. రా కూర్చో అంటూ చైర్ లాగీ.. ఢిల్లీ నుంచి వచ్చావా? ముంబై నుంచి వచ్చావా అని అడిగారు (ఆవ్.. చల్.. దిల్లీ సే హై క్యా..ముంబై సే హై క్యా ). దాంతో నాలో ఉండే కంగారు మాయమై నేను చాలా ఫ్రీ అయిపోయాను. హిందీలో మాట్లాడుతూ.. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు. కెరీర్ గురించి సలహాలు ఇవ్వడంతో చాలా క్లోజ్ అయ్యాం. ఆయన నుంచి కోవిడ్ ప్రోటోకాల్స్, డిసిప్లేన్ నేర్చుకొన్నాను అని దివ్యాంశ కౌశిక్ తెలిపింది.

స్పెయిన్‌లో రవితేజ క్రేజ్ ఎలా ఉందంటే?

స్పెయిన్‌లో రవితేజ క్రేజ్ ఎలా ఉందంటే?


రామారావు ఆన్ డ్యూటీకి ముందు రవితేజకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుసు. ఈ సినిమాలో నటించిన తర్వాత ఆయనకు విదేశాల్లో ఉన్న క్రేజ్‌ను ప్రత్యక్షంగా చూశాను. స్పెయిన్‌లో సొట్టబుగ్గలు సాంగ్ షూట్ చేశాం. స్పెయిన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని పాకిస్థాన్, జర్మనీ ఇతర దేశాల అభిమానులు ఆయనను గుర్తించి సెల్ఫీలు దిగారు. దాంతో రవితేజ‌కు ఫాలోయింగ్ ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా ఉంది అనే విషయం నాకు అర్ధమైంది అని దివ్యాంశ కౌశిక్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X