తల్లి చనిపోయినా శవాన్ని వదిలేసి షూటింగ్‌కు.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

లెజెండరీ హీరోయిన్ ముంతాజ్ వ్యక్తిగత, కెరీర్ విషయంలో అత్యంత ప్రొఫెషనల్‌గా ఉంటారని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. సినిమాపై మక్కువ, సినిమానే జీవితంగా భావించిన ఆమె లెజెండరీ యాక్టర్ షమ్మీ కపూర్‌‌తో ప్రేమను త్యాగం చేసింది. ఓ దశలో షమ్మీతో పెళ్లా? లేదా సినిమా కెరీరా? అనే రెండు ప్రశ్నలు తన ముందుకు వచ్చినప్పుడు.. సినిమా కెరీర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అయితే తన జీవితం గురించి, తన లైఫ్‌లో తీసుకొన్న కొన్ని నిర్ణయాలు, కొన్ని సంఘటనల పట్ల తాను వ్యవహరించిన తీరును తాజాగా ఫిల్మీబీట్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఏ సే ఆది (A Se Aadi) వివరించారు. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే...

నా లైఫ్‌లో ఎప్పుడూ డబ్బులకు ఇబ్బంది పడలేదు. నేను రిచ్ లైఫ్ లీడ్ చేశాను. మంచి బంగ్లా, ముస్లిం కావడం వల్ల మంచి ఫుడ్ తినేదాన్ని. నా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ సపోర్ఠ్ ఉండేది. పెళ్లి తర్వాత నా భర్త నాకు సర్వస్వం ఇచ్చారు. నాకు ఇది లేదనే కొరత లేదు. బొంబాయిలో మాకు చాలా ఇళ్లు ఉండేవి. మాకు ఉండే ఇండ్లు చూసి.. నా భర్తతో నీవు నాలుగైదు పెళ్లిళ్లు చేసుకొని.. ఒక్కొక్కరిని ఒక్కో చోట పెట్టుకో అని ఆటపట్టించేదానిని. కానీ నా జీవితంలో నీవు తప్ప మరొకరికి స్థానం లేదు అని చెప్పేవాడు అని ముంతాజ్ అన్నారు.

Mumtaz reveals her reincarnation

పెళ్లి తర్వాత నాకు ఆఫర్లు చాలా తక్కువ వచ్చాయి. కొన్నిసార్లు నాకు నచ్చిన పాత్రలను రిజెక్ట్ చేశాను. ముసలి పాత్రలు నాకు వేయడం నచ్చదు. నా ఏజ్‌తో లవ్ స్టోరీలు నా వద్దకు వస్తే నటిస్తాను. వయసు మీరిన హీరోయిన్‌తో యంగ్ హీరో లవ్‌లో పడటం లాంటి కథలు వస్తే చేయాలని ఉంది. నాకు లవ్, రొమాన్స్ స్టోరీల్లో నటించాలని ఉంది. ఎందుకంటే పెళ్లి తర్వాత నా జీవితంలో మరొకరికి ఛాన్స్ లేకపోయంది. నాకు నా భర్త, నేను ఆయనకు సర్వస్వమని భావిస్తాం. ఈ రోజుల్లో స్వచ్చమైన ప్రేమ లేదు. ఒకరినొకరు మోసం చేసుకోవడం చాలా మందిని చూస్తూనే ఉన్నాను అని ఆమె తెలిపారు.

మరో జన్మలో కూడా ముంతాజ్‌గానే పుట్టాలనుకొంటాను. ఎందుకంటే అప్పటి ముంతాజ్.. ఇప్పటి ముంతాజ్‌ను కూడా ఇష్టపడే వారు ఉన్నారు. అది నా అదృష్టంగా భావిస్తాను. నన్ను అప్పుడు ఎంతగా ప్రేమించారో.. ఇప్పుడు అంతే ప్రేమిస్తారు. అయితే మరో జన్మ ఉంటే.. షమ్మీ కపూర్ ప్రేమను సఫలం చేసుకోవడం పక్కన పెడితే.. నేను నా జీవితంలో ఒకటి మార్చుకోనేందుకు ప్రయత్నిస్తాను అని చెప్పారు.

Mumtaz reveals her reincarnation

మరో జన్మలో ముంతాజ్‌గా జీవించే అవకాశం వస్తే.. నేను ఒక తప్పు చేశాను. నా తల్లి చనిపోతే.. ఆమె శవాన్ని అక్కడే వదిలేసి షూటింగ్‌కు వెళ్లాను. అలా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. తప్పని పరిస్థితుల్లో నేను చేయాల్సి వచ్చింది. ఆ విషయం నన్ను ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది. ఆ విషయం తప్పా.. నేను చేసిన తప్పేమీ లేదు. నా లైఫ్ గొప్పగా సాగింది. నా జీవితంలో ఎలాంటి కోరికలు తీరకుండా ఇంకా మిగిలిపోలేదు. మరు జన్మ అంటూ వస్తే.. ముంతాజ్‌గానే పుట్టి గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొంటాను అని ఆమె వెల్లడించారు.

More from Filmibeat

Read more about: mumtaz Shammi Kapoor bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X