ఆ తప్పు చేసి కాళ్ళు పట్టుకున్నంత పని... రాజేంద్ర ప్రసాద్‌పై సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఓ తప్పు చేసి దాదాపు కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడని గుర్తు చేసుకున్నారు సీనియర్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య అంత పెద్ద గొడవ ఏం జరిగింది? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇప్పటిదాకా ఆయన కెరీర్లో హీరోగా, నటుడిగా వందల సినిమాల్లో నటించారు. ఎంతోమంది సినిమా దర్శకులు, నిర్మాతలతో, దాదాపు మూడు నాలుగు తరాల నటీనటులతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. కానీ ఎప్పుడూ ఎక్కడా ఆయన తనతో దాదాపు 32 సినిమాలు తీసిన సీనియర్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఓ ఇంటర్వ్యూలో రేలంగి నరసింహారావుకు ఇదే ప్రశ్న ఎదురైంది.

Do You Know How Senior Director Relangi Narasimha Rao hurt by Actor Rajendra Prasad gesture

ఈ సందర్భంగా ఆయన తనకు, రాజేంద్రప్రసాద్ కు మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల గురించి, అలాగే తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టారు. రాజేంద్రప్రసాద్ హీరోగా డైరెక్టర్ రేలంగి నరసింహారావు డబ్బు ఎవరికి చేదు, కాబోయే అల్లుడు, మన్మధ లీలా కామరాజు గోల, గుండమ్మగారి కృష్ణులు, భలే మొగుడు, భామకలాపం, తోడల్లుళ్లు, చిన్నోడు పెద్దోడు, చిక్కడు దొరకడు వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు.

వీళ్ళిద్దరి కాంబినేషన్లో దాదాపు 32 సినిమాలు వచ్చాయి. అయితే ఏ ఈవెంట్ లో కూడా రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా డైరెక్టర్ రేలంగి నరసింహారావు గురించి కనీస ప్రస్తావన తీసుకురాకపోవడం గురించి ఆయనే స్వయంగా మాట్లాడారు. స్టార్స్ కెరీర్ లో ఎంతమందితో సినిమాలు తీస్తారని, ఎంతమంది వస్తూ పోతుంటారని, కాబట్టి అందరిని గుర్తు పెట్టుకోవడం సాధ్యం కాదని ఈ సందర్భంగా సీనియర్ డైరెక్టర్ వేలంగి నరసింహారావు చెప్పుకొచ్చారు.

అయితే కొన్ని సందర్భాలలో స్టేజ్ మీద ఉన్నప్పుడు సడన్ గా నోటికి ఏ పేరు వస్తే ఆ పేరును మాత్రమే చెప్తారు కాబట్టి తన పేరు గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం అనేది ఏమంత పెద్ద విషయం కాదని అన్నారు ఈ డైరెక్టర్. అయితే ఒకానొక సందర్భంలో రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన సంఘటనను ఈ సందర్భంగా రేలంగి నరసింహారావు బయట పెట్టారు.

Do You Know How Senior Director Relangi Narasimha Rao hurt by Actor Rajendra Prasad gesture

ఓసారి రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన ఈవెంట్లో వేసిన ఏవీలో కనీసం తన పేరును ప్రస్తావించకపోవడంతో హర్ట్ అయ్యి బయటకు వచ్చేసానని, అయితే బయలుదేరేంత లోనే రాజేంద్రప్రసాద్ పీఏ వచ్చి ఏదో తెలియకుండా ఆ తప్పు జరిగిపోయింది అని చాలా బతిమాలాడని చెప్పుకొచ్చారు ఆయన. ఆ పీఏ దాదాపు కాళ్లు పట్టుకున్నంత పని చేశాడని, రాజేంద్రప్రసాద్ కూడా సారీ చెప్పినట్టు పిఏ చెప్పాడని అన్నారు రేలంగి నరసింహారావు.

కానీ హర్ట్ అవ్వడం వల్ల తాను ఈవెంట్ కి వెళ్ళకుండా ఇంటికి వెళ్లిపోయానని, ఆ తర్వాత ఓ స్పెషల్ సీడీని పంపించి, తాము ముందుగా ప్రిపేర్ చేసిన సీడీలో తన పేరు ఉందని, కానీ ఏదో టెక్నికల్ ఎర్రర్ వల్ల అక్కడ ఏవి లో తన పేరు ప్రస్తావనకు రాలేదు అనే విషయాన్ని రాజేంద్రప్రసాద్ కబురు పంపించారని చెప్పారు రేలంగి.

కానీ అందరి ముందు అవమానించినంత పని చేసి, ఒక్కడినే ఉన్నప్పుడు మీ పేరు కూడా అందులో ఉంది చూసుకోమని పంపిస్తే అర్థం ఏంటని ప్రశ్నించారు ఆయన. ఇక ఆ తర్వాత మళ్లీ తామిద్దరం కలిసి పోయామని చెప్పుకొచ్చారు ఈ సీనియర్ డైరెక్టర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X