Renu Desai: మహేష్ సినిమాకు నో చెప్పిన రేణు దేశాయ్,రీజన్ తెలిస్తే కాంట్రవర్సీయేనట!

Renu Desai: రేణు దేశాయ్.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్యగా అందరికీ సుపరిచితురాలైన ఈమెకు.. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె అందం, అభినయానికి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. మొదట మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె.. 2000 సంవత్సరంలో జేమ్స్ పండు అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగంలో అడుగు పెట్టింది. అదే ఏడాది తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాలో వెన్నెలగా కనిపించి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత మూడేళ్లకు జానీ సినిమాలో గీతగా కనిపించి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది.

ఆ సమయంలోనే హీరో పవన్ కల్యాణ్ తో ప్రేమలో పడడం, ఆపై పెళ్లి చేసుకోవడం.. పిల్లలు పుట్టడం జరిగింది. ఇవన్నీ కారణాలతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆమె తొలిసారిగా టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నటించింది. మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమాలో.. గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం పాత్రను రేణు దేశాయ్ పోషించారు. ఈ సందర్భంగానే ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగానే ఆమె చేసిన కొన్ని కామెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Do you Know Why Actress Renu Desai Said No to Mahesh Babu Sarkaru Vaari Pata Movie

రేణు దేశాయ్ కు.. గతంలో మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ వచ్చిందట. 2022 మే 12వ తేదీన విడుదల ఈ చిత్రంలో బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం తనను అడాగరని చెప్పింది. ఆ పాత్ర తనకు చాలా బాగా నచ్చిందని పేర్కొంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తాను సినిమా చేయలేకపోయానని వెల్లడించింది. అయితే తాను మహేష్ బాబు సినిమాలో ఎందుకు చేయలేదో కారణాలు చెప్పాలని ఉన్నప్పటికీ... కాంట్రవర్సినీ దృష్టిలో ఉంచుకొని చెప్పట్లేదని పేర్కొంది. సైలెంట్ గా ఉంటేనే ఎలాంటి సమస్యలు రావని స్పష్టం చేసింది.

Do you Know Why Actress Renu Desai Said No to Mahesh Babu Sarkaru Vaari Pata Movie

ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. అసలు ఈమె ఎందుకు ఆ సినిమాలో ఛాన్స్ వదులుకుందో తెలుసుకోవాలని నెటిజెన్లు తెగ ట్రై చేస్తున్నారు. నెట్టింటి వేదికగా చర్చలు కూడా సాగిస్తున్నారు. రేణు దేశాయ్ లేదా సర్కారు వారి పాట చిత్ర బృందం చెబితే తప్ప ఆమె ఆ పాత్రకు ఎందుకు నో చెప్పిందో తెలియదు. మరి చూడాలి ముందు ముందు అయినా వారు నోరు మెదిపి అసలు విషయం చెబుతారా లేదా అనేది.

Do you Know Why Actress Renu Desai Said No to Mahesh Babu Sarkaru Vaari Pata Movie

ఇది పక్కన పెడితే.. దాదాపు 20 ఏళ్ల తర్వాత మంచి క్యారెక్టర్ రావడం వల్లే తాను టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నటించినట్లు చెప్పింది రేణు దేశాయ్. హేమలత లవణం పాత్ర చేయడం నిజంగా తన అదృష్టం అని తెలిపింది. ఆ కాలంలోనే హేమలత జోగినీ వ్యవస్థ, అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడం సాగించిందని గుర్తు చేశారు. ఇలాంటి పాత్రలో తాను కనిపించడం, నటించడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుందని వెల్లడించింది. ఈ పాత్ర చేయడం కోసం హేమలత గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని రేణు దేశాయ్ స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X