US Elections 2024: ట్రంప్ గెలుపు వల్ల భారతీయులకు కష్టమే.. వారికి కాళరాత్రే.. నిర్మాత రామ్ కుమార్
ప్రవాసాంధ్రుడు, నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ తన కుమారుడు చేతన్ కృష్ణను తెలుగు సినిమా రంగానికి పరిచయం చేస్తూ నిర్మించిన ధూమ్ ధామ్. పెళ్లి కాన్సెప్ట్‌తో అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటించింది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ రచయిత గోపి మోహన్ స్క్రీన్ల ప్లే అందించారు. నవంబర్ 8వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత రామ్ కుమార్ మాట్లాడుతూ..
అమెరికాలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడం వల్ల కొత్తగా అక్కడికి రావాలనుకొన్న భారతీయులకు కష్టమే.. విదేశీయులు అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేయడం ట్రంప్ ఇష్టపడరు. అక్కడ సెటిల్ అయిన వాళ్లకు ఇక్కడి నుంచి కొత్తగా వచ్చే వాళ్లను చూసి భయపడుతారు. పాతికేళ్ల క్రితం ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ స్థిరపడిన వాళ్లకు మళ్లీ ఇక్కడి నుంచి వచ్చే వాళ్లను చూసి భయపడటం సహజం అని నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ అన్నారు.

నేను పాతికేళ్ల క్రితం వెళ్లి అమెరికాలో స్థిరపడ్డాను. నేను అక్కడ సిటిజన్‌ను. అక్కడి వెళ్లిన వాళ్లు తమ వెనుక వచ్చే వాళ్లను చూసి సహజంగానే భయం ఉంటుంది. వాళ్ల ఉద్యోగం పోతుందనే భయం అక్కడివారిని వెంటాడుతుంటుంది అని నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ చెప్పారు.
అమెరికాలో ఉండే వారికి, అక్కడి పౌరులకు ట్రంప్ గెలవడం వల్ల చాలా మంచింది. కానీ కొత్తగా వెళ్లాలనే వారికి చాలా కష్టం. ప్రతీ ఏటా స్టూడెంట్స్ వెళ్తుంటారు. వారు అక్కడ చదువుకొంటూ డబ్బు సంపాదించుకొంటారు. స్టూడెంట్స్ అలా జాబ్ చేయాలనే వారికి, అక్కడ బాగా సంపాదించుకోవాలనుకొనే వారికి 99 శాతం చాలా కష్టం. విద్యార్థులకు, ఇతర సందర్శకులకు ఇబ్బందిగానే ఉంటుంది అని ఎంఎస్ రామ్ కుమార్ అన్నారు.

ట్రంప్ గెలవడం వల్ల జాబ్స్, కొత్త వీసాలు ఇవ్వడంపై ఆంక్షలు విపరీతంగా ఉండే అవకాశం ఉంది. గతంలో నాలుగేళ్లు ట్రంప్ పనిచేసినప్పుడు నేను చాలా గమనించాను. ఆ సమయంలో వీసాల పొందాలనుకొనే వారికి కాళరాత్రి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉంటుందా? ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. డెఫినెట్‌గా అక్కడ ఉండే భారతీయులకు పాజిటివ్. కొత్తగా వచ్చే వాళ్లకు పాజిటివ్ అని ఎంఎస్ రామ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
నాకు సినిమాలంటే ఇష్టమే కాదు గౌరవం కూడా. మా అబ్బాయి చేతన్ విద్యాభ్యాసం పూర్తయ్యాక సినిమాల్లో యాక్టింగ్ చేయాలన ఉందని చెప్పారు. అలా తనను హీరోగా పెట్టి ధూం ధాం చాలా స్పెషల్ మూవీగా నిర్మించాం. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. చిన్న సినిమాకు బడ్జెట్ ఎంత ఆదా చేస్తే అంత మంచిది. మేము ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ వాళ్లు సినిమా చూసి పంపిణీ చేస్తున్నారు. మంచి థియేటర్స్ దొరికాయి. ఈ నెల 8న ప్రేక్షక దేవుళ్లు ఇచ్చే తీర్పు కోసం వేచి చూస్తున్నాం అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











