రొమాంటిక్ హీరో అంటే నచ్చదు..అలాంటి సినిమాలకు బ్రేక్.. సీతారామం గురించి దుల్కర్ సల్మాన్ (Interview)

దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ మీడియాతో మాట్లాడుతూ.. అశ్వనీ దత్, స్వప్న, వైజయంతి మూవీస్ బ్యానర్ నాకు ఫ్యామిలీ లాంటింది. ఒక మంచి మనిషిగా అశ్వనీ‌దత్ గారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నా ఫేవరేట్ పర్శన్. చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఆయన చూపించే ప్రేమ, వాత్సల్యం చాలా గొప్పగా ఉంటుంది. నా కోసం ది బెస్ట్‌ని ఎంపిక చేస్తారు అని అన్నారు. సీతారామం సినిమా గురించి దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ..

 హను రాఘవపూడి స్క్రిప్టు నచ్చి..

హను రాఘవపూడి స్క్రిప్టు నచ్చి..


సీతారామం సినిమాలో నేను ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. నేను ఒక అనాథను. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించే క్యారెక్టర్. దేశభక్తి ఎక్కువగా ఉండే వ్యక్తి. విధి నిర్వహణలో పక్కాగా ఉంటాడు. సీతారామం కథ విన్న తర్వాత నేను థ్రిల్ అయ్యాను. ఇలా స్క్రిప్టు రాయడం చాలా కొత్తగా ఉంది. డిఫరెంట్ పీరియడ్‌లో కథ గురించి ఆలోచించడం చాలా వినూత్నంగా ఉంది. ఇలా కథను ఎవరూ ఆలోచించరు. దర్శకుడు హను రాఘవపూడి కథను విజువలైజ్ చేసిన విధానం.. ఆయన రాసుకొన్న స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఈ అంశాలు ఈ సినిమాను నేను ఒప్పుకోవడానికి కారణమయ్యాయి. ట్రైలర్‌లో చూపించిన అంశాలు చాలా తక్కువ. అసలు కథ వేరే ఉంటుంది. ఈ సినిమా ఒక క్లాసిక్ అని దుల్కర్ సల్మాన్ చెప్పారు.

సీత పాత్రను ఆమె తప్ప మరెవరూ చేయలేరు

సీత పాత్రను ఆమె తప్ప మరెవరూ చేయలేరు


సీత పాత్ర గురించి హను రాఘవపూడి చెప్పినప్పుడు పౌరాణికంలో పాత్రలు గుర్తుకొచ్చాయి. ఒక క్లాసిక్ నవల చదువుతున్నప్పుడు కొన్ని పాత్రలని ఇలా ఉంటాయేమోనని ఇమాజిన్ చేసుకుంటాం. 'సీతారామం' కథ విన్నప్పుడు సీత పాత్రని కూడా లానే ఊహించుకున్నా.నా ఊహల్లో ఏదో ఒక పాత్ర కనిపించింది. ఎవరు సీతామహాలక్ష్మి పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందనే విషయం నాకు తట్టలేదు. మృణాల్ థాకూర్‌ను సీత కోసం తీసుకొంటామని స్వప్న, హను రాఘవూడి చెప్పినప్పడు కరెక్ట్ చాయిస్ అనుకొన్నాను. ఒకసారి సీత గెటప్‌లో మృణాల్ థాకూర్‌ను చూసిన తర్వాత ఇక ఆమె తప్ప మరొకరు ఆ పాత్రను చేయలేరని అనిపించింది.

కొత్త రష్మిక మందన్నను చూస్తారు..

కొత్త రష్మిక మందన్నను చూస్తారు..


సీతగా మృణాల్ థాకూర్ ఆన్ స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా తను చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఎనర్జిటిక్ పర్శన్. ఆమె సెట్‌లో ఉంటే ఒకరకమైన ఎనర్జీ వస్తుంది.అందరూ జోష్‌తో ఉండేలా చేస్తారు. ఇక ఇందులో కొత్త రష్మిక మందన్నను చూస్తారు. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఒక్కసారి కూడా నవ్వదు. తన కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పాత్రని చేయలేదు. సీతారామంలో రష్మిక తన పాత్ర పరంగా మంచి ఎనర్జీని చూపించింది అని దుల్కర్ చెప్పారు.

రొమాంటిక్ సినిమాలకు కొంతకాలం బ్రేక్

రొమాంటిక్ సినిమాలకు కొంతకాలం బ్రేక్


రొమాంటిక్ సినిమాలు చేయకుండా బ్రేక్ తీసుకోవాలని అనుకొన్నాను. సీతారామం నా చివరి రొమాంటిక్ సినిమా అనుకొంటున్నాను. కొన్ని జోనర్లను టచ్ చేయాలని చూస్తున్నాను. కొంత గ్యాప్ తీసుకొన్న తర్వాత మళ్లీ రొమాంటిక్ సినిమాలు చేస్తాను. రొమాంటిక్ హీరో అనే ట్యాగ్‌కు దూరం కావాలని అనుకొంటున్నాను. సీతారామం లాంటి రొమాంటిక్ సినిమా చేసిన తర్వాత కూడా కొద్దిరోజులపాటు రొమాంటిక్ చిత్రాల్లో నటించకూడదని ఫీలింగ్‌లో ఉన్నాను అని దుల్కర్ సల్మాన్ అన్నారు.

వయసుపైన పడుతున్నది.. అందుకే

వయసుపైన పడుతున్నది.. అందుకే


డిఫరెంట్ కథలు రాకపోవడం వల్లే రొమాంటిక్ కథలకు బ్రేక్ చెప్పాలనుకొంటున్నాను. నాకు కూడా వయసు దాటిపోతున్నది. అందుచేత రొమాంటిక్ సినిమాలకు కొంత బ్రేక్ చెప్పి వేరే రకమైన కథలు చేయాలని అనుకొంటున్నాను. సీతారామం చేయడానికి దర్శకుడి ఐడియా నచ్చింది. స్క్రిప్టు నచ్చే సినిమా చేశాను. ఆ తర్వాత మ్యూజిక్, ఇతర అంశాలు ఈ సినిమాను గ్రాండియర్‌గా చేశాయి. మ్యూజిక్ ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ. 80 దశకంలో సాగే పాటలను విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. కానున్న కల్యాణం పాటను కశ్మీర్‌లో చాలా మంచు కురుస్తుండగా మృణాల్‌ కథక్ డ్యాన్స్ చేస్తుండగా చిత్రీకరించారు. కానున్న కల్యాణం పాట కశ్మీర్‌లో షూట్ చేసినప్పుడే నాకు బాగా నచ్చింది. ఈ పాట అప్పుడే మ్యాజిక్ చేస్తుందని అనుకొన్నాను అని దుల్కర్ సల్మాన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X