రితూ వర్మ తప్పుచేస్తే.. నేను సరిదిద్దాను.. దుల్కర్ సల్మాన్
మహానటి మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం కనులు కనులను దోచాయంటే. పెళ్లిచూపులు మూవీతో అలరించిన రితూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 28న రిలీజ్ కానున్నది. ఈ చిత్రానికి దేసింగ్ పెరియాస్వామి దర్శకుడు. వయకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తెరకెక్కించిన సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా దుల్కర్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలు ఇవే..
ఒక సినిమాకు మరో సినిమాకు గ్యాప్ తీసుకొవడానికి ప్రత్యేకంగా కారణాలు లేవు. తాజాగా నటించిన కనులు కనులను దోచాయంటే మూవీ తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతున్నది. కథాబలం ఉన్న మంచి చిత్రం అవుతుందని నమ్ముతున్నాను. ద్విభాషల్లో రిలీజ్ చేసిన సినిమాలు అన్నీ విజయం సాధించవనేది అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రం చాలా డిఫరెంట్. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దుల్కర్ సల్మాన్ అన్నారు.

పలు భాషల్లో నటించే అవకాశాలు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏ భాషలోనైనా కథ, పాత్ర నచ్చితే తప్పుకుండా చేస్తాను. ఇది ప్లాన్ ప్రకారం చేస్తున్నది కాదు. ఇతర భాషల్లో అవకాశాలు రావడం నిజంగా అదృష్టమే. నన్ను ఆదరిస్తున్న ఆడియెన్స్, నిర్మాత, దర్శకులకు రుణపడి ఉంటాను అని దుల్కర్ పేర్కొన్నారు.
హీరోయిన్ రితూ వర్మ తెలుగు అమ్మాయే. కానీ తమిళంలో బాగా మాట్లాడుతుంది. అక్కడక్కడా కొన్ని కఠిన పదాలు ఆమెకు కష్టమైతే నేను సరిదిద్దాను. రితూతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆమె పక్కా ప్రొఫెషనల్ అని దుల్కర్ తెలిపారు.

ఇక దర్శకుడు గౌతమ్ మీనన్ గురించి మాట్టాడుతూ.. ఆయన గొప్ప దర్శకుడే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన ఎనర్జీ, స్టయిల్ చూస్తే చాలా బాగా అనిపించింది అని దుల్కర్ పేర్కొన్నారు.
నటీనటులు: దుల్కర్ సల్మాన్, రితూ వర్మ, రక్షన్, నిరంజనీ అహతియాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాతలు: వయకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
మ్యూజిక్: మసాలా కాఫీ
సినిమాటోగ్రఫి: కేఎం భాస్కరన్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: ప్రవీణ్ ఆంథోని
స్టంట్స్: ఆర్‌కే ఉమాశంకర్
దర్శకత్వం: దేసింగ్ పెరియాసామీ
పీఆర్‌వో: నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి


Click it and Unblock the Notifications











