భరత్‌ అనే నేనుతో కల నెరవేరింది.. కొరటాలకు రుణపడి ఉంటాను.. డీవీవీ దానయ్య

By Rajababu

Recommended Video

Dvv Danaiah My Dream Fulfilled Making Bharat Ane Nenu (Video)

టాలీవుడ్‌లోని భారీ బడ్జెట్ చిత్రాలను అందించే నిర్మాతల్లో డీవీవీ దానయ్య ఒకరు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి అగ్రహీరోలతో చిత్రాలను రూపొందించిన దానయ్య.. ప్రస్తుతం మహేష్‌బాబుతో భరత్ అనే నేను సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఇప్పటికే విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత డీవీవీ దానయ్య తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. తన 25 ఏళ్ల సినీ జీవితంలో ఎదురైన అనుభవాలను ఆయన పంచుకొన్నారు.

1992లో నిర్మాతగా

1992లో నిర్మాతగా

నిర్మాతగా నా ప్రయాణం ప్రారంభమై 25 ఏళ్లు పూర్తి చేసుకొన్నాం. 1992లో దర్శకులు, దివంగత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో జంబలకిడి పంబ సినిమా తీశాను. ఇన్నేళ్లలో ఎన్నో విజయవంతమైన సినిమాలు, మరికొన్ని యావరేజ్ సినిమాలు తీశాను. ప్రస్తుతం డీవీవీ బ్యానర్‌లో మహేష్‌బాబుతో భరత్ అనే నేను సినిమా తీశాను. ఏప్రిల్ 20 తేదీన రిలీజ్ అవుతుంది.

భరత్ అనే నేను గర్వపడే చిత్రం

భరత్ అనే నేను గర్వపడే చిత్రం

భరత్ అనే నేను సినిమా సెన్సార్ పూర్తి చేసుకొన్నది. సినిమా బాగుందని సెన్సార్ అధికారులు ప్రశంసించారు. భరత్ అనే నేను చిత్రం మా బ్యానర్ గర్వపడే సినిమా అవుతుంది. నేను తీసిన సినిమాలలో గొప్ప సినిమా అవుతుంది.

 కొరటాలకు జీవితాంతం రుణపడి

కొరటాలకు జీవితాంతం రుణపడి

భరత్ అనే నేను చిత్రాన్ని మహేష్‌బాబుతో చేయడం చాలా ఆనందంగా ఉంది. అందుకు కొరటాల శివకు జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా పరిశ్రమకు రావడానికి మా ఊరు స్ఫూర్తి నిచ్చింది. మాది పశ్చిమ గోదావరి జిల్లా. తాళ్లపూడి మా ఊరు. మా ఊర్లో చాలా సినిమాలు షూటింగ్ జరుపుకొనేవి. మా ఊర్లో అందాల రాముడు, సిరిసిరిమువ్వ, శారద, భక్త కన్నప్ప, పాడిపంటలు, హిమ్మత్‌వాలా లాంటి చిత్రాలు షూటింగ్ జరుపుకొన్నాయి.

కృష్ణ షూటింగ్ సందర్భంగా

కృష్ణ షూటింగ్ సందర్భంగా

నేను చిన్నప్పుడు సూపర్‌స్టార్ కృష్ణగారు నటించిన పాడిపంటలు షూటింగ్ చూశాను. అప్పుడు జనం గొడవ పెడితే షూటింగ్ క్యాన్సిల్ చేస్తాం అని కృష్ణ గారు అన్నారు. దాంతో మేమంత గొడవ చేయకుండా సినిమా షూటింగ్ చేశాం. అలాంటి సినిమా షూటింగ్‌లు చూడటం వల్ల నాకు సినిమా రంగంలోకి వెళ్లాలని అనుకొన్నాం. భగవంతుడి దయ వల్ల నేను నిర్మాతగా అయ్యాను.

నా కల నెరవేరింది

నా కల నెరవేరింది

చెన్నైలో జంధ్యాల వద్ద ఈవీవీ సత్యనారాయణ అసిస్టెంటుగా పనిచేసేవాడు. ఆయన నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ సమయంలో ఏదో ఒక సినిమా చేద్దామని అనుకొన్నాం. దాంతో జంబలకిడి పంబకు బీజం పడింది. దాంతో నిర్మాతగా నా ప్రయాణం మొదలైంది. మహేష్‌బాబుతో సినిమా చేయాలనే కల ఉండేది. భరత్ అనే నేను సినిమాతో నా కల నెరవేరింది.

రూ.2 కోట్లతో అసెంబ్లీ

రూ.2 కోట్లతో అసెంబ్లీ

ఎప్పటి నుంచో నేను సినిమా చేద్దాం అని మహేష్‌బాబు వెంట పడుతున్నాను. అలాంటి సమయంలో కొరటాల శివ నాకు కథ చెప్పారు. హీరో మహేష్‌బాబుకు కూడా నచ్చడంతో భరత్ అనే నేను ప్రారంభమైంది. కథ డిమాండ్ మేరకు రూ.2 కోట్లతో అసెంబ్లీ సెట్ వేశాం. రూ.4 కోట్లు ఖర్చుపెట్టి వచ్చాడయో సామీ షూట్ చేశాం. అందుకోసం భారీగా, రిచ్‌గా సెట్ వేశాం.

 మహేష్‌బాబు సీఎం అంటే

మహేష్‌బాబు సీఎం అంటే

భరత్ అనే నేను చిత్రంలో మహేష్‌బాబు ముఖ్యమంత్రి అంటే కొత్త అనుభూతికి లోనయ్యాను. ఒక సిన్సియర్ సీఎం అంటే చాలా ఆసక్తి కలిగించాను. ఆయనను సీఎంగా చూడటం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సీఎంగా మహేష్‌ ప్రేక్షకులను ఆకట్టుకొంటాడు. ప్రేక్షకుల అంచనాలకు మించి భరత్ అనే నేను సినిమా ఉంటుంది.

 కొరటాల కాంట్రవర్సీ సినిమాలు తీయరు

కొరటాల కాంట్రవర్సీ సినిమాలు తీయరు

ప్రస్తుత రాజకీయాలపై ఎలాంటి విమర్శనాస్త్రాలు లేవు. దర్శకులు కొరటాల శివ కాంట్రవర్సి సినిమాలు తీయరు. ఆయన మంచి రచయిత. చాలా జాగ్రత్తగా చేశారు. సినిమా షూటింగ్‌కు వెళ్లేముందు అందర్ని అడిగి తెలుసుకొని సన్నివేశాలను రూపొందించారు. పక్కగా పరిశోధన చేసి స్క్రిప్ట్‌ను పవర్‌ఫుల్‌గా రూపొందించాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X