Faria abdullah రావణాసురలో 5 హీరోయిన్లు.. రవితేజ పక్కన నా పాత్ర ఎలా ఉంటుందంటే?

దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్వర్క్స్ బ్యానర్‌పై మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం రావణాసుర. అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలను పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా రావణాసుర రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

Faria abdullah interview about Ravanasura and Ravi Teja

రావణాసుర‌లో నా పాత్ర పేరు కనకమహాలక్ష్మీ. లాయర్ పాత్రలో కనిపిస్తాను. అయితే జాతిరత్నాలు సినిమాలో లాంటి లాయర్ కాదు. చాలా సీరియస్ లాయర్. రవితేజ గారితో సీనియర్ లాయర్‌గా ఉంటాను. క్యారెక్టర్‌లో వెరైటీ కలర్స్ ఉంటాయి. కథ‌తో పాటు ట్రావెల్ అయ్యే పాత్ర నాది. కోర్టులో తక్కువ సీన్స్ వుంటాయి. లాయర్ నేపథ్యంగా సాగే పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. ఈ చిత్రంలో వివాహితగా నటిస్తున్నాను. కాబట్టి బాడీ లాంగ్వేజ్‌లో పరిణితి ఉండేలా జాగ్రత్త పడ్డాను. లాయర్ పాత్ర నాకు సెంటిమెంట్ కాదు. కథకు లాయర్ పాత్ర అవసరం. నిర్మాత, దర్శకులు నాకు ఈ ఆఫర్ ఇచ్చారు అని ఫరియా అబ్దుల్లా చెప్పారు.

రావణాసుర సినిమాలో మొత్తం ఐదు మంది హీరోయిన్స్ ఉన్నారు. నాకు కేవలం మేఘా ఆకాష్‌తో మాత్రమే కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఐదు హీరోయిన్స్ ఉన్నప్పటికీ అందరికీ భిన్నమైన పాత్రలు. కథలో కీలకమైన పాత్ర చేశాను. నటించడానికి ఆస్కారం ఉండే పాత్ర. కథలో ఒక ఫ్లాష్‌బ్యాక్ పాయింట్‌లో వచ్చే సాంగ్ అది. ఆ సాంగ్ షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశా అని ఫరియా తెలిపారు.

రవితేజ గారితో పని చేయడం నెక్స్ట్ లెవల్ ఎక్స్ పీరియన్స్. నటుడిగానే కాదు వ్యక్తిగా కూడా ఆయన చాలా స్ఫూర్తిదాయకం. బ్రేక్‌లో కాసేపు ఆయనతో మాట్లడితే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.. రవితేజ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సెట్ లో అందరినీ చాలా కంఫర్ట్‌గా ఉంచుతారు. ఆయన నుంచి సహనం నేర్చుకున్నాను. రావణాసుర షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా అని ఫరియా అబ్దుల్లా అన్నారు.

రావణాసుర సినిమా కథ విన్నప్పడు చాలా మంచిగా అనిపించింది. రచయిత శ్రీకాంత్ ఈ కథని చెప్పారు. కథ విన్నప్పుడు చాలా ఎక్సయిటింగా అనిపించింది. దర్శకుడు సుధీర్ వర్మ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్ అని ఫరియా అబ్దుల్లా పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X