పబ్ వ్యవహారం మీద పెదవి విప్పిన గల్లా అశోక్.. నిజంగా హీరోని అయ్యా అనే ఫీలింగ్ వచ్చిందంటూ!
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున జరిపిన దాడిలో రాహుల్ సిప్లిగంజ్ సహా నిహారిక వంటి వారు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. అందులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, సినీ నటుడు గల్లా అశోక్ కూడా ఉన్నట్లు వార్తలు బయటకు రాగా ఆ విషయంపై స్పందించిన గల్లా కుటుంబ సభ్యులు ఆ వ్యవహారంలో గల్లా అశోక్ కు ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే గల్లా అశోక్ తాజాగా మీడియా ముందుకు వచ్చి ఆ విషయం మీద స్పందించారు. ఆ వివరాలు

మంచి గుర్తింపు
మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా తమ సొంత అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ ద్వారా హీరోఅనే సినిమాతో హీరోగా మారాడు. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో అశోక్ గల్లాకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది.

ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు
మంగళవారం నాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. తదుపరి మీ బేనర్ లోనే సినిమా ఉంటుందా? అని అడిగితే బయట బేనర్ లో ఉండబోతోందని, త్వరలో వివరాలు తెలియజేస్తానని అన్నారు. హీరో సినిమా చూశాక మహేష్‌బాబు రెస్పాన్స్ ఎలా వుంది? అని అడిగే సినిమా చూశాక, మహేష్‌బాబు ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు.. అన్నారని, కేవలం ఈ సినిమా గురించే చెప్పారని, అదేవిధంగా కంటిన్యుటీ లో చిన్నపాటి తప్పిదాలు వుంటే చెప్పారని అన్నారు.

నా చుట్టూనే వుందని
ఇక హీరోగా కెరీర్ ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? అని అడిగితే నటుడిగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనుందని, హీరో సినిమాతో నటుడిగా ప్రూవ్ అయ్యాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. తర్వాత కథలు, పాత్రలు అనేవి కొత్తగా వుండేలా చూసుకోవాలని అన్నారు. మీకు నటుడిగా స్పూర్తి ఎవరని అడిగితే మహేష్‌బాబు గారే అని, నేను పెరిగింది ఆయన సినిమాలు చూసే. నటన వాతావరణం అంతా నా చుట్టూనే వుందని చెప్పుకొచ్చారు.

హీరో అనే ఫీలింగ్ కలిగింది
ఇక రెండు రోజుల క్రితం పబ్ ఇష్యూలో మీపేరు బయటకు వచ్చింది. ఏమనిపించిందని ప్రశ్నించగా నేను ఆరోజు ఫిజియో థెరపీ చేయించుకుంటున్నాను. సడన్ గా వార్తల్లో నా పేరు ఎలా వచ్చిందో తెలీదుని అన్నారు. అప్పుడు నిజంగా హీరో అనే ఫీలింగ్ కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. సెలబ్రిటీ లైఫ్ లో ఉంటే ఇలాంటి వార్తలే వస్తుంటాయనిపించిందని అన్నారు.

కన్ఫ్యూజన్లో ఉన్నా
ఇక మహేష్‌బాబు సినిమాల్లో మీరు చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తారు అని అడగగా మురారి సినిమా అని, అలాంటి సినిమా మరలా రాలేదని, ఇక ముందు కూడా రాదని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటిదాకా తన రెండో సినిమా కోసం ఏ కథను ఫైనల్ చేయలేదని, ప్రస్తుతం కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. ఇప్పటికే రెండు కథలు ఉన్నాయని అన్నారు. జూన్ లోపు ఒక కథను ఫైనల్ చేసి మూవీని స్టార్ట్ చేస్తాం' అని గల్లా అశోక్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











