For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిర్మాత జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలతో 10th క్లాస్ డైరీస్.. 40 మంది దర్శకులతో..

  |

  తెలుగు సినిమా పరిశ్రమలో 50 చిత్రాలకు సినిమాటోగ్రఫి అందించిన అంజి కొత్త అవతారం ఎత్తి దర్శకుడిగా మారారు. ఇప్పటి వరకు కెమెరా వెనుక ఉండి ప్రతిభను చాటుకొన్న గరుడవేగ అంజి.. 10th క్లాస్ డైరీస్ చిత్రంతో తెర ముందుకు వచ్చారు. అవికా గోర్, శ్రీరామ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పించిన ఈ సినిమా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందింది. ఈ చిత్రం జూలై 1వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అంజి మీడియాతో మాట్లాడుతూ..

  50 చిత్రాలు.. 40 మంది దర్శకులతో

  50 చిత్రాలు.. 40 మంది దర్శకులతో


  సినిమాటోగ్రాఫర్‌గా 10th క్లాస్ డైరీస్ నాకు 50వ చిత్రం. నా కెరీర్‌లో 40 మంది దర్శకులతో పని చేశా. వాళ్ళ కథనునా విజువల్స్‌తో చూపించిన ఎక్స్‌పీరియ‌న్స్‌ ఉండటంతో ఈ కథకు న్యాయం చేయగలననే నమ్మకం కుదిరింది. గత చిత్రాల్లో అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది. స్వర్గీయ దాసరి నారాయణరావు, రాంగోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ల వద్ద పని చేశారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నది నాకు ఈ సినిమాకు ఉపయోగపడింది. గరుడవేగ చిత్రం నాకు మంచి పేరు తెచ్చింది. అంతేకాకుండా నా ఇంటి పేరును కూడా మార్చేసింది. అందరూ నన్ను గరుడవేగ అంజి అని పిలవడం ప్రారంభించారు.

  నిర్మాత జీవితంలో జరిగిన సంఘటనలతో

  నిర్మాత జీవితంలో జరిగిన సంఘటనలతో


  నాకు డైరెక్షన్ చేయాలనే ఆలోచన లేదు. నిర్మాత అచ్యుత రామారావుతో నాకు మంచి అనుబంధం ఉంది. అయితే నిర్మాత తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను చెప్పినప్పడు ఆసక్తి కలిగింది. నిర్మాత స్నేహితుల్లో ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయిందనే పాయింట్ నన్ను ఆకట్టుకొన్నది. ఆ కథ నాకు కనెక్ట్ కావడంతో డైరెక్షన్ చేయాలని నిర్ణయించుకొన్నాను అని గరుడవేగ అంజి తెలిపారు.

  ఆహ్లదకరంగా ఉంటుంది...

  ఆహ్లదకరంగా ఉంటుంది...


  10th క్లాస్ డైరీస్ చిత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కథలో ఎమోషన్, యాక్షన్, డ్రామా అన్ని ఉంటాయి. నిర్మాత అచ్యుత రామారావు జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలను కథగా మలిచాం. నేను పనిచేసిన దర్శకులతో కలిసి స్క్రిప్టుపై కసరత్తు చేశాం. మంచి స్క్రీన్ ప్లేతో కథను మరింత సినిమాటిక్‌గా మలిచాం. కథపై నాకు పూర్తిగా పట్టు ఉందని అనిపించడంతో నేనే దర్శకత్వం, సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వహించాలని నిర్ణయించుకొన్నాను అని దర్శకుడు అంజి చెప్పారు.

  మంచి కథ దొరికితే దర్శకత్వం వహిస్తా

  మంచి కథ దొరికితే దర్శకత్వం వహిస్తా


  భవిష్కత్‌లో మంచి కథలు వస్తే దర్శకత్వం వహిస్తాను. లేదంటే సినిమాటోగ్రాఫర్‌గా కొనసాగుతాను. ప్రస్తుతం ఓ మలయాళ సినిమా చేయడానికి కమిట్ అయ్యాను. 10th క్లాస్ డైరీస్ రిలీజైన వెంటనే నేను ఆ సినిమా కోసం పనిచేయడానికి సిద్దంగా ఉన్నాను. సినిమాటోగ్రఫి కంటే.. దర్శకత్వం చేయడం చాలా కష్టం. దర్శకుడికి 24 విభాగాలపై మంచి పట్టు ఉండాలి. అప్పుడే దర్శకుడిగా రాణించగలుగుతారు అని దర్శకుడు అంజి తెలిపారు.

  నేను చేసే సినిమాలు ఇవే

  నేను చేసే సినిమాలు ఇవే


  ప్రస్తుతం ప్రముఖ దర్శకులు జీ నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్ ప్లే అందించడంతోపాటు ప్రొడక్షన్ చేశారు. ఆ సినిమా టైటిల్ 'బుజ్జి ఇలా రా'. త్వరలో విడుదలకు సిద్దం చేస్తున్నాం. 10th క్లాస్ డైరీస్ తర్వాత ఆ సినిమా స్టార్ట్ చేశా. కరోనా వల్ల ఈ సినిమా విడుదల కొంత ఆలస్యం అయ్యింది. ఈలోపు'బుజ్జి ఇలా రా' కూడా రెడీ అయ్యింది అని అంజి చెప్పారు.

  English summary
  Avika Gor's 10th Class Dairies is set to release on July 1st. In this occassion, Director Garudavega Anji speaks to media about the movie and his direction stint.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X