భర్త వదిలేసి లేచిపోవడానికి కారణం అదే.. పుష్పకవిమానం హీరోయిన్ గీత్ సైని
పుష్పక విమానం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న మరో యువ తార గీత్ సైని. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి అనే క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. మీనాక్షి అనే క్యారెక్టర్ లో నటించడం, ఆ మూడ్ లో ఉండిపోవడానికి చాలా కష్టపడ్డానని చెబుతోంది గీత్ సైని. "పుష్పక విమానం" సినిమా చూస్తే నాయికగా తన ఎఫర్ట్ తెలుస్తందని అంటోంది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న "పుష్పక విమానం" చిత్రంలో షూటింగ్‌లో తన అనుభవాలను మీడియాలో పంచుకొన్నది.

గీత్ సైని మాట్లాడుతూ...కాలేజ్ డేస్ నుంచి నాకు డాన్సులు చేయడం అంటే చాలా ఇష్టం. డాన్సులతో పాటు తెలుగు కామెడీ చిత్రాలు చూడటం నాకు చాలా ఇష్టం.. మా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. నేను సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారని అనుకోలేదు. పుష్పక విమానం సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి, నా స్నేహితురాలు ఒకరు నా ఫొటోస్ పంపింది. దాంతో యూనిట్ నుంచి పిలుపు రావడంతో ఆడిషన్స్‌లో పాల్గొన్నానని గీత్ సైనీ తెలిపారు.
నటన, హవభావాలపరంగా ఆడిషన్ చేసినప్పుడు మీనాక్షి క్యారెక్టర్‌కు నేను బాగా సరిపోతాని దర్శకుడు దామోదర సెలెక్ట్ చేశారు. మీనాక్షి చిట్టిలంక సుందర్ వైఫ్. తను పెళ్లయ్యాక ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మీనాక్షి క్యారెక్టర్ లో నటించడం అంత సులువు కాదు. ఎప్పుడూ ఒక మూడ్‌లో ఉండాల్సి వచ్చేది. సెట్‌లో ఎవరైనా జోక్ వేసినా, నా మూడ్ లోనే ఉండేందుకు అస్సలు రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు. అలా మీనాక్షి క్యారెక్టర్‌ను ప్లే చేశాను అని గీత్ సైని చెప్పారు.
పుష్పక విమానం చూశాక ఆడియెన్స్ నా క్యారెక్టర్‌ను ఇష్టపడతారు. ఆనంద్ చాలా మంచి వ్యక్తి. షూటింగ్ టైమ్‌లో చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. నా కెరీర్‌లో ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా చేస్తాననుకోలేదు. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా మరో ప్రాజెక్ట్ చేయొద్దని, వచ్చిన కొన్ని ఆఫర్స్ కూడా వదులుకున్నాను. సాయి పల్లవిలా డాన్స్ బేస్డ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది అని గీత్ సైనీ చెప్పారు.


Click it and Unblock the Notifications











