twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ జార్జిరెడ్డి చేద్దామనుకున్నారు.. అంతా అది నిజమనుకుంటున్నారు.. సీక్రెట్ బయట పెట్టిన హీరో

    |

    ఉస్మానియా విద్యార్థి జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆదారంగా జార్జి రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు. సందీప్ మాధవ్ ఈ సినిమాలో 'జార్జిరెడ్డి'గా నటించాడు. 1968 - 70 లో బాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ బయోపిక్ లో జార్జిరెడ్డి లైఫ్ లోని కొన్ని కీలక అంశాలను తెరకెక్కించారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందీప్ మాధవ్ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

    ఆ స్థాయిలో ఏదీ కనెక్ట్ అవ్వలేదు.

    ఆ స్థాయిలో ఏదీ కనెక్ట్ అవ్వలేదు.

    ‘వంగవీటి...' సినిమా తరవాత అవకాశాలు వచ్చాయి కానీ ఆ సినిమా తరవాత చేయదగ్గ సినిమా అనిపించే స్థాయిలో ఏదీ కనెక్ట్ అవ్వలేదు. అప్పుడు జీవన్ గారు ఈ కథ
    చెప్పారు. చాలా ఎగ్జైటెడ్ అయ్యాను.

    కొన్ని ప్రిపరేషన్స్...

    కొన్ని ప్రిపరేషన్స్...

    జార్జిరెడ్డి క్యారెక్టర్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేశాను. ఈ సినిమా చేస్తున్నాం అని ఫిక్సయ్యాక ఆయనకి సంబంధించిన ఆర్టికల్స్, బుక్స్... కొన్ని వీడియోస్ చూశాను. జార్జిరెడ్డి గారితో కలిసి చదువుకున్న వాళ్ళను, ఆయన ఫ్రెండ్స్ ని కొందరిని కలిసి ఆయన గురించి తెలుసుకున్నాను. ఇకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ గురించి కంప్లీట్ గా తెలుసుకునేంత పుటేజ్ ఏమీ దొరకలేదు.
    మహా అయితే కొన్ని ఫోటోస్.. ఒక చోట ఆయన స్పీచ్.. దాన్ని బేస్ చేసుకునే ప్రిపేర్ అయ్యాను...

    ఆయన క్యారెక్టర్ అలాంటిది...

    ఆయన క్యారెక్టర్ అలాంటిది...

    ‘జార్జిరెడ్డి' కంప్లీట్ గా బయోపిక్ అని చెప్పను కానీ, కొన్ని చోట్ల కమర్షియల్ ఎలిమెంట్స్ ఆడ్ చేయడం జరిగింది. అవి కూడా చాలా న్యాచురల్‌గా ఉంటాయి. బేసిగ్గా ఆయన బాక్సర్, స్టూడెంట్ లీడర్ కాబట్టి.. విజువలైజేషన్‌లో హీరోయిజం న్యాచురల్ గానే ఉంటుంది.

    అప్పటికీ ఇప్పటికీ అదే డిఫెరెన్స్...

    అప్పటికీ ఇప్పటికీ అదే డిఫెరెన్స్...

    1968 - 70 లో స్టూడెంట్స్ కి... ఇప్పటి స్టూడెంట్స్ కి చాలా డిఫెరెన్స్ ఉంటుంది. అప్పట్లో వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా ఉండేవాళ్ళు. ఏం చేసినా వాళ్ళలో సీరియస్ నెస్ ఉండేది. జార్జిరెడ్డి తో పాటు ఆయనతో పాటు ఉండే క్యారెక్టర్స్ లో కూడా ఆ సీరియస్ నెస్ ఉంటుంది.

    ప్రయత్నం చేశాం...

    ప్రయత్నం చేశాం...

    1960 - 70 బ్యాక్ డ్రాప్ కాబట్టి ఆల్మోస్ట్ అప్పటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాం. మీరు రేపు సినిమాలో చూడబోయే బైక్స్.. సైకిల్స్ ఆల్మోస్ట్ అన్నీ కొనేశాం... అవన్నీ అప్పట్లో వాడేవే.

    నమ్మకం ఉంది కాబట్టే...

    నమ్మకం ఉంది కాబట్టే...

    ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో రీచ్ అవుతుందనే నమ్మకంతో చాలా కష్టపడ్డాం... ట్రైలర్ లో చూసి అది అందరూ ఉస్మానియా యూనివర్సిటీలో షూట్ చేశాం అనుకుంటున్నారు. నిజానికి అది సెట్ వేశాం. 1960 లో యూనివర్సిటీ ఎలా ఉండేదో దాన్ని బట్టి సెట్ వేశారు...

    నాకా ఫీలింగ్ కలగలేదు...

    నాకా ఫీలింగ్ కలగలేదు...

    ఈ సినిమా వల్ల రెండేళ్ళ గ్యాప్ వచ్చింది. చాలా సినిమాలు వదులుకున్నాను ఈ సినిమా చేసే ప్రాసెస్ లో... ఈ సినిమా ఉండి ఉండకపోతే వాటిలో ఏవో కొన్ని చేసేసేవాడిని.. కానీ ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు.

    Recommended Video

    #CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
    పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకున్నారు...

    పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకున్నారు...

    నిజానికి జార్జిరెడ్డి అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. ఈ సినిమా ఆయన చేయాలనుకున్నారట. అందుకే ఓ సాంగ్ ఆయనికి డెడికేట్ చేశాం.

    English summary
    George Reddy Movie Hero Sundeep Madhav Interaction With Media. He Revealed Some Unknown Facts About Movie. This Movie Is directed By Jeevan Reddy And Going To release On 22nd November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X