For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Acharya హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా.. నాకు అలాంటి సంతోషం.. చిరంజీవి గురించి సత్యదేవ్ ఎమోషనల్

  |

  గాడ్సే చిత్రంలో సమాజాన్ని ప్రశ్నించే విశ్వనాథ్ రామచంద్ర పాత్రలో నటిస్తున్నాను. అయితే గోపి గణేష్ నాకు కథ చెప్పినప్పుడు.. ఒక పెద్ద హీరో చెబితే.. ప్రేక్షకులు తమ మనసులోకి ఎక్కించుకొంటారనేది నా అభిప్రాయం ఏర్పడింది. అయితే నేను ఈ పాత్ర చేస్తే రీచ్ అవుతుందా? అని గోపిని అడిగాను. ఎందుకంటే.. నాకైతే నా యాక్టింగ్‌పై నమ్మకం ఉంది.

  కానీ నీవు అనుకొన్న ఉద్దేశం, ఈ కథ వెనుక ఉన్న ప్రయోజనం సఫలమవుతుందా? అని అడిగాను. అందుకు నీవు ఈ పాత్రను నేను అనుకొన్న రేంజ్‌కు, పరిధికి రీచ్ కాగలవు అనే నమ్మకాన్ని ఇచ్చాడు. దాంతో గాడ్సే ప్రయాణం మొదలైంది అని సత్యదేవ్ చెప్పారు. గాడ్సే మూవీ, ఇతర విషయాలను ఆయన వెల్లడిస్తూ..

  గాడ్సే టైటిల్ ఎందుకు పెట్టామంటే?

  గాడ్సే టైటిల్ ఎందుకు పెట్టామంటే?

  గాడ్సే చిత్రం టైటిల్‌ వివాదాస్పదంగా ఉండవచ్చేమో కానీ.. ఈ కథకు సరైన టైటిల్ ఇది. సినిమా ఫ్లాష్ బ్యాక్‌లో గాంధీ, గాడ్సే అనే నాటకం ఉంటుంది. అయితే ఈ సినిమా టైటిల్ ఒక బజ్ క్రియేట్ చేయడానికి ముందు పెట్టాలని అనుకొన్నాం. బజ్ లేకపోతే సినిమా రీచ్ ఉండదు కదా.. అందుకే కథలోని పాయింట్‌ను తీసుకొని పెట్టాం. ఆ తర్వాత బజ్ క్రియేట్ అయింది. టైటిల్‌కు జస్టిఫికేషన్ ఉంది అన్నారు.

  సోసైటీలోని లోపాలను ప్రశ్నించడం

  సోసైటీలోని లోపాలను ప్రశ్నించడం

  గాడ్సే అనేది దేశంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించే చిత్రం. ఒక రకంగా ఇది ఇండియన్ చిత్రం. పదేళ్ల క్రితం తీసినా.. మరో పదేళ్ల తర్వాత తీసినా ఈ కథకు రీచ్ ఉంటుంది. ఇది సొసైటీలోని అస్తవ్యస్థ అంశాలను ప్రశ్నించడమనేది ఈ సినిమా కథ. సమాజాన్ని ప్రశ్నించే సినిమాల్లో నటించే ముందు నాకు ఉన్న సామాజిక బాధ్యతను గుర్తు చేసుకొంటాను. నా పరిధిలో నేను సమాజానికి నేను ఎంతో కొంత చేస్తుంటాను అని సత్యదేవ్ చెప్పారు.

  గాడ్సే చాలా ఎమోషనల్ కంటెంట్

  గాడ్సే చాలా ఎమోషనల్ కంటెంట్

  గాడ్సే సినిమా తొలి సీన్ నుంచి.. చివరి సీన్ వరకు భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయి. థియేటర్ నుంచి ప్రేక్షకుడు బయటకు వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడు తనతోపాటే కథ, కథనాలను వెంట తీసుకెళ్తాడు. తప్పకుండా ఈ చిత్రం ప్రతీ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది. యాక్షన్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలిసి ఉంటాయి. సొసైటీపై ఉన్న ప్రేమను పెంపొందించే విధంగా ఉంటుంది అని సత్యదేవ్ చెప్పారు.

  ఐశ్వర్య లక్షీ గురించి

  ఐశ్వర్య లక్షీ గురించి

  గాడ్సే చిత్రంలో నాకు, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ మధ్య సన్నివేశాలు ఉండవు. కానీ మేమిద్దరం టెక్నాలజీ ద్వారా కనెక్ట్ అవుతాం. కానీ మా ఇద్దరి పాత్రల మధ్య కనెక్షన్, కెమిస్ట్రీ ఎమోషనల్‌గా ఉంటుంది. ఐశ్వర్య లక్ష్మి మలయాళం, తమిళ భాషలో మంచి సినిమాలు చేశారు. ఈ పాత్రకు ఆమె ఎంపిక కచ్చితంగా సరైనదే.. నూటికి నూరు శాతం న్యాయం చేశారు అని సత్య దేవ్ అన్నారు.

  ఆ మూడు సినిమాలు చిరంజీవి చూసి...

  ఆ మూడు సినిమాలు చిరంజీవి చూసి...

  తాజాగా నేను నటించిన ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవితో నటించాను. లాక్‌డౌన్‌లో నేను నటించిన బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారేవరురా? తిమ్మరుసు లాంటి చిత్రాలను చూశారు. నా యాక్టింగ్‌ చూసి నన్ను పిలిచారు. కరోనా సమయంలో నాకు జరిగిన మంచి అది. ఎందుకంటే వైజాగ్‌లో నేను, నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చిరంజీవిని అభిమానిస్తూ.. ఆయన సినిమాలను చూస్తూ పెరిగాను. అలాంటి ఆయనతో ఆచార్య, గాడ్‌ఫాదర్ చిత్రంలో నటించడం గొప్ప అనుభూతి అని సత్యదేవ్ చెప్పారు.

  చిరంజీవితో గొప్ప అనుభూతులు

  చిరంజీవితో గొప్ప అనుభూతులు

  ఆచార్య చిత్రంలో చిరంజీవితో నటించడంతో నా కల సాకారమైంది. ఆచార్య హిట్టా? కాదా అనేది పక్కన పెడితే.. నాకు మాత్రం ఆచార్య చిత్రం మంచి ఆనందాన్ని ఇచ్చింది. చిరంజీవితో నటించాననే కోరిక, కల తీరింది. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నాకు జీవితంలో మరిచిపోలేని మెమోరీస్‌ను మిగిల్చింది. అంతకంటే జీవితంలో గొప్ప క్షణాలు ఏమి ఉండవు. గాడ్ ఫాదర్ సినిమా పూర్తయింది. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను అని సత్యదేవ్ అన్నారు.

  English summary
  Actor Satya Dev's Godse movie is set to release on June 17th. In this occassion, He shared his experiences with Godse.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X