twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Exclusive: Ram Pothineni తో గౌతమ్ మీనన్ సినిమా.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే?

    |

    లైఫ్ ఆఫ్ ముత్తు సినిమాతో మళ్లీ స్రవంతి రవికిషోర్, స్రవంతి బ్యానర్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. గతంలో రామ్‌తో ఒక సినిమా మొదలుపెట్టాం. ఆ సినిమా కొద్ది రోజులు షూట్ చేసిన తర్వాత ఆపేశాం. ఆ తర్వాత ఆ సినిమాను నానితో చేశాం. అదే ఎటో వెళ్లి పోయింది మనసు. ఆ సినిమా కూడా బాగా ఆడలేదు. కానీ స్రవంతి రవికిషోర్ కారణంగా నాకు, రామ్‌కు మధ్య సంబంధాలు అలానే ఉన్నాయి. ఆ సినిమా ఆపేసే ముందు ఎందుకు వర్కవుట్ కాదో చెప్పడం నాకు సమంజసం అనిపించింది. అప్పటి నుంచి మేము కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాం అని గౌతమ్ మీనన్ చెప్పారు.

    ఇటీవల స్రవంతి రవికిషోర్‌ను కలిసి రామ్‌తో సినిమా చేసేందుకు చర్చలు జరిపాం. నేను ఇంకా రెండు సినిమాలు చేయాల్సి ఉంది. ఆ సినిమాల తర్వాత రామ్ సినిమా వచ్చే ఏడాది జూన్, జూలైలో మొదలుపెడుతాం. ఇదంతా రవి కిషోర్ కారణంగానే జరిగింది.

    Gowtham Menon to direct Ram Pothineni after Life of Muthu movie sequel

    లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా తెలుగులో స్రవంతి రవికిషోర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన మంచి మనసున్న వ్యక్తి. మృదుస్వభావి. ఆయన సినిమాలు ప్రమోట్ చేసే తీరు చాలా బాగుంటుంది. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాను ఆయన చేతుల్లో పెట్టాం. నేను ఈ మాటలు నా సినిమా ప్రమోట్ చేస్తున్నారని చెప్పడం లేదు. నా మనస్పూర్తిగా స్రవంతి రవికిషోర్ గురించి చెబుతున్నాను అని గౌతమ్ మీనన్ చెప్పారు.

    లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా విషయానికి వస్తే.. తమిళనాడులోని ఓ గ్రామానికి చెందిన యువకుడి కథ. సామాన్య యువకుడు మాఫియా ప్రపంచాన్ని ఎలా శాసించాడు అనేది ప్రధానమైన పాయింట్. ఈ సినిమా కథ అందరికి కనెక్ట్ అవుతుంది. అందుకే హిందీలో కూడా డబ్బింగ్ చేస్తున్నాం. హిందీలో మనోజ్ బాజ్‌పేయ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. నిజాయతీగా చెప్పాలంటే... సినిమాకు భాష లేదు. ఈ సినిమాలో కూడా కొన్ని క్యారెక్టర్లు హిందీ మాట్లాడతాయి. ఆ డైలాగులు ప్రేక్షకులకు అర్థం కాకపోయినా అక్కడ భావం తెలుస్తుంది. రీచ్ అవుతుంది. మలయాళంలో కూడా డబ్ చేస్తున్నాం. కన్నడలో గరుడ గమన వృషభవాహన డైరెక్టర్ రాజ్ బీ శెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ సినిమాను ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నాం అని గౌతమ్ మీనన్ చెప్పారు.

    English summary
    Popular actor and director Gowttham Menon is coming with The life of Muthu. As part of the promotion, Gowtham speaks to Telugu filmibeat and told that, He and Ram Pothineni is going to collabrate a movie next year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X