For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Life of Muthu డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా.. శింబు ఫెర్ఫార్మెన్స్‌ అదుర్స్.. గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ

  |

  ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు, సిద్ధి ఇద్నానీ జంటగా డాక్టర్ ఇషారి కే గణేష్ నిర్మించిన చిత్రం ది లైఫ్ ఆఫ్ ముత్తు. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగాప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాను తెలుగులోప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్ రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు గౌతమ్ మీనన్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

  లవ్, యాక్షన్, రొమాన్స్ సమపాళ్లలో

  లవ్, యాక్షన్, రొమాన్స్ సమపాళ్లలో


  ఏం మాయ చేశావే సినిమాతో పోల్చుకొంటే.. లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా డిఫరెంట్ మూవీ. పక్కా గ్యాంగ్‌స్టర్ మూవీ. ముత్తు మాఫియా ప్రపంచంలోకి ఎలా ప్రవేశించాడు. మాఫియా ప్రపంచంలో జీవించడం ముత్తుకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనే అంశాలతో కూడిన సినిమా.. ఈ సినిమాలో యాక్షన్, లవ్, రొమాన్స్ సమపాళ్లలో ఉంటాయి. ఈ సినిమా ఇన్స్‌పిరేషన్ అంటూ ఏమీ లేదు. నేను శింబుతో ఒక ప్రేమ కథతో సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాను. రెహ్మాన్ సార్‌తో పాటలు కంపోజ్ చేయించాను. ఆ సమయంలో ప్రముఖ రచయిత జయమోహన్‌ను కలిసినప్పుడు లైఫ్ ఆఫ్ ముత్తు కథ చెప్పాడు. 10 రోజుల్లో 100 పేజీల స్క్రిప్టు ఇచ్చారు. దాంతో శింబుతో చేయాలనుకొన్న సినిమా ఆపేసి.. ముత్తు సినిమాను ప్రారంభించాను అని గౌతమ్ మీనన్ చెప్పారు.

   శింబు గ్యాంగ్‌స్టార్ ఎందుకయ్యాడనేది?

  శింబు గ్యాంగ్‌స్టార్ ఎందుకయ్యాడనేది?


  గతంలో లవ్, యాక్షన్ సినిమా చేశాను. ముత్తు విషయానికి వస్తే.. లవ్, యాక్షన్‌తో గ్యాంగ్ స్టర్ సినిమా. గ్యాంగ్‌స్టర్ కూడా హృదయం ఉంటుంది. తన ప్రేమికురాలితో రొమాన్స్ చేస్తాడు. మంచి మనసు ఉంటుంది. ఇతరులను బాగా ప్రేమిస్తారు. ముత్తు క్యారెక్టర్ చెడ్డవాడు కాదు. కానీ కొన్ని పరిస్థితుల్లో గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. తమిళనాడులోని ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన సాధారణ యువకుడు పెద్ద గ్యాంగ్‌స్టార్ అవుతాడు. ఈ సినిమా లవ్, ఎమోషన్స్‌తో కూడిన కొత్త జోనర్ అనుకోవచ్చు. ఇలాంటి ఎమోషన్స్‌ను శింబు తన సెన్సిబుల్ యాక్టింగ్‌తో అద్బుతంగా పండించాడు అని గౌతమ్ మీనన్ అన్నారు.

  55 రోజుల్లో సినిమా పూర్తి చేశాం

  55 రోజుల్లో సినిమా పూర్తి చేశాం


  లైఫ్ ఆఫ్ ముత్తు సినిమాను 55 రోజుల పూర్తి చేశాం. శింబు, రాధిక శరత్ కుమార్ మాత్రమే తెలిసిన యాక్టర్లు. మిగితా వారిని థియేటర్, స్ట్రీట్ ప్లే, టీవీ షోల నుంచి ఎంపిక చేసుకొన్నాం. సినిమా పరిశ్రమకు కొత్తవారు. ఒక రకమైనర ప్రపంచంలోని ఉండే పాత్రలను నమ్మాలంటే.. కొత్త వారిని తీసుకొంటే బాగుంటుందని భావించాం. 20 ఏళ్ల కుర్రాడిగా శింబు మారిపోయాడు. ముత్తు తప్ప శింబు ఆ పాత్రలో కనిపించడు. శింబు కాకుండా 10 మందిని కొట్టే సామాన్య యువకుడంటే నమ్ముతారు. అందుకే అంతా కొత్తవారిని తీసుకొని ట్రైన్ చేశాం. చాలా రిహార్సల్ చేశాం. శింబుకు పది నిమిషాల ముందు సన్నివేశం చెబితే.. కెమెరా ముందుకు వచ్చి చెలరేగిపోయేవాడు. సింగిల్ టేక్‌లో షాట్ ఓకే చేసేవాడు. దాంతో తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడానికి అవకాశం లభించింది.

  రెండు భాగాలు ఎందుకు చేశామంటే?

  రెండు భాగాలు ఎందుకు చేశామంటే?


  లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా రెండు భాగాలుగా తీసుకురావాలన్నది గిమ్మిక్ కాదు. రైటర్ జయమోహన్ స్క్రిప్టు‌లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. జయమోహన్‌తో డిస్కస్ చేసినప్పుడు కథను ఒక సినిమాలో చెబితే ఎమోషన్స్ పండవని అన్నారు. అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా సినిమా చేయాలని డిసైడ్ అయ్యాం. అయితే మా సినిమాను బాహుబలితో పోల్చడం లేదు. క్లైమాక్స్‌కు సంబంధించి కొన్ని సన్నివేశాలను గురించి అడిగినప్పుడు పార్ట్ 2 లో ప్లాన్ చేస్తున్నామని చెప్పాం.

  అలాంటి మూమెంట్స్ సినిమా హిట్ అని చెప్పాయంటూ

  అలాంటి మూమెంట్స్ సినిమా హిట్ అని చెప్పాయంటూ


  లైఫ్ ఆఫ్ ముత్తు మూవీలో శింబు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడు. 20 ఏళ్ల కుర్రాడి సన్నివేశాలను ముందుగా షూట్ చేశాం. గెడ్డంతో ఉన్న గెటప్ కోసం మూడు నెలలు ఆగాల్సి వచ్చింది. ఆ గ్యాప్‌లో మేము ఎడిటింగ్, ఇతర పనులు పూర్తి చేశాం. ఆ తర్వాత డిఫరెంట్ గెటప్ షూట్ పూర్తి చేశాం. మొదటి రోజు శింబు, రాధిక‌తో షూట్ చేసినప్పుడు.. అలాగే శింబుతో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు.. ఈ సినిమా గొప్పగా వస్తుందనే ఫీలింగ్ కలిగింది. అంతేకాకుండా రెహ్మాన్ మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత నేను హిట్ సినిమా తీస్తున్నాను అని గౌతమ్ మీనన్ తెలిపారు.

  English summary
  Popular actor and director Gowttham Menon is coming with The life of Muthu. As part of the promotion, Gowtham speaks to Telugu filmibeat
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X