జ్యోతిరాయ్ లవ్ స్టోరీ మీకు తెలుసా? డైరెక్టర్‌తో పెళ్లి వెనుక సీక్రెట్ చెప్పిన జగతి మేడమ్
గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు వారికి చేరువైన టాలెంటెడ్ యాక్టర్ జ్యోతిరాయ్. టాప్ రేటింగ్ సీరియల్‌లో జగతి పాత్రలో ఆమె నటించి అందర్నీ మెప్పించారు. ఆ సీరియల్ తర్వాత ఆమెకు మహిళల్లోనే కాకుండా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దర్శకుడు సుక్కుతో ఏర్పడిన సినిమా బంధంతో ఆయనకు జీవిత భాగస్వామిగా మారింది. జ్యోతిరాయ్ తన పేరును జ్యోతి పూర్వజ్‌గా మార్చుకోవడం వెనుక ఉన్న ప్రేమ కథ, ఆమె ఎమోషనల్ జర్నీ విషయంలోకి వెళితే..
మాస్టర్ పీస్‌లో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వెరీ గుడ్. చాలా వేరియేషన్స్‌లో కనిపించడంతో పాటు చాలా డెప్ట్ ఉన్న పాత్ర. ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటుంది. ఇప్పటి వరకు నాకు తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ బాగా లభించింది. ఒకసారి ఎవరినైనా ఇష్టపడితే.. నమ్మితే వారు ఇచ్చే సపోర్ట్ మరువలేనిది. నేను కన్నడ, తెలుగు నటినే కాదు.. నేను ఎప్పుడూ ఇండియన్ యాక్టర్‌గానే భావిస్తుంటాను అని జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్ అన్నారు.

నాకు భాషాపరమైన ఇబ్బందులు లేవు. నాకు లాంగ్వేజ్ బారియర్స్ లేవు. నేను ఎక్కడ పనిచేసినా అది నా భాషగా భావిస్తుంటాను. ఏ భాషనైనా ఇష్టపడుతాను. కన్నడ నా మాతృభాష అయినప్పటికీ.. తెలుగులో మంచి ఆదరణ, ప్రేమ లభించింది. కన్నడ నాకు పుట్టినిల్లు.. తెలుగు నా మెట్టినిల్లు. భాషకు సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిని ప్రేమిస్తాను అని జ్యోతీ రాయ్ అభిప్రాయపడ్డారు.
ఏ మాస్టర్ పీస్ అనే సినిమాతో దర్శకుడు సుక్కు పూర్వజ్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఆయనతో కలిసి నటించడం చాలా కంఫర్ట్. ఆయనతో నటిగా జర్నీ ప్రారంభమై.. ఆయనను ఇష్టపడి భార్యగా మారాను. మేమిద్దరం ఈ సినిమా ప్రయాణంలో ఒకరిని మరొకరు ఇష్టపడి పెళ్లి చేసుకొన్నాం. ఆయన చాలా కామ్. బాగా అర్ధం చేసుకొంటారు. ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించరు. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం అని జ్యోతిరాయ్ చెప్పారు.
సుక్కు పూర్వజ్‌తో నాకు లవ్ జర్నీ లేదు. మేమిద్దరం ప్రపోజ్ చేసుకోలేదు. లైఫ్ గురించి చర్చించుకొన్నాం. ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకొన్నాం. జీవితంలో ఇద్దరు అభిరుచులు ఒకేలా ఉండటంతో ఒక పాయింట్ వద్ద కనెక్ట్ అయ్యాం. నా జీవితంలో ఎన్నో విషయాలు చోటు చేసుకొన్నాయి. వాటిని ఆయన బాగా అర్ధం చేసుకొన్నాడు. దాంతో మా ఇద్దరి మనసులు బాగా కలిశాయి. ఆ విషయంతోనే ఇద్దరం ఒకటి అయ్యాం అని జ్యోతిరాయ్ తెలిపారు.
నాకు నైతికంగా ఆయన ఇచ్చే సపోర్ట్ చాలా గొప్పది. సెట్‌లో చాలా సున్నితంగా ఉంటారు. ఎవరిని ఎలాంటి జడ్జ్ చేయకుండా ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేస్తారు. ఆయన దృష్టి అంతా వర్క్ మీదే ఉంటుంది. నాకే కాకుండా ప్రతీ ఒక్కరికి ఆయన సపోర్ట్ ఉంటుంది. ఆయన భేషరతుగా సపోర్ట్ చేస్తారు. నీకు చాలా టాలెంట్ ఉంది. నువ్వు ఎంతో సాధించగలవు. నీలో ఆ ప్రతిభ ఉందని ప్రోత్సాహిస్తుంటారు అని జ్యోతి రాయ్ చెప్పారు.
జ్యోతిరాయ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మాస్టర్ పీస్ సినిమాను దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు.న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











