Kingston: కింగ్స్టన్ ఆస్కార్ స్థాయి సినిమా.. బాహుబలి, కాంతారాను మించి.. జీవి ప్రకాశ్ కుమార్ (ఇంటర్వ్యూ)

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ జీవి ప్రకాశ్ కుమార్, బ్యాచ్‌లర్ ఫేమ్ దివ్య భారతీ జంటగా నటించిన చిత్రం కింగ్స్టన్ (Kingston). జీవీ ప్రకాశ్ నిర్మాతగా మారి సొంత బ్యానర్ ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. జీ స్టూడియోస్ బ్యానర్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కమల్ ప్రకాశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమిళ మాతృకలో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ డిస్టిబ్యూటర్, నిర్మాత గంగా ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత మహేశ్వర్ రెడ్డి ఈ సినిమాను తెలుగు భాషలో ప్రేక్షకులకు అందిస్తున్నారు. మార్చి 7వ తేదీన రిలీజవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జీవి ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ..

నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసినా.. హీరోగా చేసినా మూవీ రిలీజ్‌కు ముందు నాకు కొంత నెర్వస్ ఉంటుంది. ఈ సినిమా ఆ రెండు బాధ్యతలతోపాటు నిర్మాతగా మారడంతో సినిమాను ఎలా రిసీవ్ చేసుకొంటారనే టెన్షన్ మరింత ఎక్కువగా ఉంది. ప్రతీ రోజు ఇంకా 4 రోజులు, ఇంకా 3 రోజులు అంటూ రోజులు లెక్కించుకొంటున్నాను అని జీవీ ప్రకాశ్ కుమార్ అన్నారు.

GV Prakash Kumar reveals Kingston is Oscar level movie gives Baahubali Kantara Experience

కింగ్స్టన్ సినిమాకు నిర్మాతగా మారడం యాదృశ్చికం కాదు. కొద్ది రోజులుగా మంచి కథ లభిస్తే ప్రొడక్షన్ చేయాలని అనుకొన్నాను. కేవలం నిర్మాతగా మారేది డబ్బు సంపాదించడం కంటే.. సినిమాపైనాకు ఉన్న ప్రేమ మాత్రమే. అందుకే కొంత రిస్క్ తీసుకొని ఈ సినిమాను రూపొందించాను. ఈ సినిమా రూపొందించే క్రమంలో జీ స్టూడియోస్ కూడా భాగమయ్యారు. ఇండియాలో ఫస్ట్ సీ‌ అడ్వెంచర్స్ థ్రిల్లర్ సినిమా ఇది. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత హీరోలకు జాంబీలు ఎదురవుతారు. అలాగే ఆత్మలు కూడా ఉంటాయి. ప్రేక్షకులకు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని జీవీ చెప్పారు.

సముద్ర తీరం పక్కన ఉండే గ్రామంలో జరిగే కథ. ఆ ఊరిలో ఉండే జాలరి పాత్రలో కనిపిస్తాను. ఆ ఊరి వాళ్లకు ఓ శాపం ఉంటుంది. ఆ శాపం కారణంగా సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు ఎవరూ వెళ్లరు. ఆ శాపం వల్ల ఊరికి ఏం జరిగింది? ఆ శాపాన్ని ఓ జాలరి యువకుడు ఎదిరించాడా? ఎదిరిస్తే ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.

సముద్రంలో జర్నీ నేపథ్యంగా సినిమా సాగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం తడిసి ఉండే వాళ్లం. ఈ సినిమా కోసం చిత్రీకరించిన అండర్ వాటర్ సీక్వెన్స్ హైలెట్‌గా ఉంటాయి. నీటిలో మునిగి ఉండటానికి నేను స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకొన్నాను. దాంతో మూడు నిమిషాలపాటు నీటిలో మునిగి ఉండటం అలవాటు అయింది. అలాంటి సీక్సెన్స్‌లో ఓ షాట్ సరిగా రాకుంటే.. వన్ మోర్ టేక్ అనే వారు. దాంతో చాలా ఇబ్బంది అయ్యేది. యాక్షన్ సీక్వెన్స్‌లో గాయాలు అయి రక్తం కారేది. బ్యాండేజ్ వేసుకొని మళ్లీ షాట్‌కు రెడీ అనే వాడిని అన్నారు.

GV Prakash Kumar reveals Kingston is Oscar level movie gives Baahubali Kantara Experience

కింగ్స్టన్ లాంటి సినిమా ఇండియాలో రాలేదు. ఫస్ట్ సీ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ. ఒక బోటు మీద ఆర్టిస్టులు ఉండేవారు. మరో బోట్ మీద టెక్సిషియన్స్ ఉండే వారు. ఈ సినిమా కోసం కొన్ని రోజులు ప్రముఖ సీనిమాటోగాఫర్ నీరవ్ షా, ఆ తర్వాత గోకుల్ బినోయ్ పని చేశారు. ఈ సినిమా కోసం మీనియేచర్ సెట్స్ కూడా వేశాం. ఈ మూవీ విడుదలైన తర్వాత హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతుంది. తప్పుకుండా ఈ సినిమాను ఎలా చేశారని అడుగుతారనే నమ్మకం నాకు ఉంది అని అన్నారు.

కింగ్స్టన్ సినిమా ఆస్కార్ స్థాయి సినిమా. ఈ సినిమాలోని కొన్ని కేటగిరిలకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందనేది నా గట్టి ఫీలింగ్. ఈ సినిమాను ఆస్కార్ అవార్డుల కోసం పంపేందుకు ఆలోచిస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ అయితే ఈ మూవీ కోసం ఓ యూనివర్స్ క్రియేట్ చేస్తాం. సుమారుగా 4 సీక్వెల్స్ తీయాలనేది నా కల అని జీవీ ప్రకాశ్ కుమార్ అన్నారు.

More from Filmibeat

Read more about: gv prakash kumar divya bharati
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X