దిల్ రాజు సలహాను పక్కన పెట్టాం.. గుంటూరు కారం మూవీకి పోటీగా హనుమాన్ ఎందుకంటే? నిర్మాత నిరంజన్ రెడ్డి
సంక్రాంతి పండుగ నేపథ్యంలో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో స్క్రీన్ల కేటాయింపు వివాదంగా మారింది. గుంటూరు కారం, హనుమాన్ ఒకే రోజున రిలీజ్ కావడంతో అనేక ఊహాగానాలు తావిచ్చింది. నైజాం, ఆంధ్రాలో అత్యధికంగా గుంటూరు కారం సినిమాకే ఎక్కువ కేటాయించారనే విషయం చర్చనీయాంశమైంది. అయితే ఈ నేపథ్యంలో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..
Recommended Video

దిల్ రాజుతో మాట్లాడినప్పుడు మా సమస్య గురించి క్లారిటీ చెప్పాం. మాది పాన్ ఇండియా సినిమా. నార్త్, ఇతర భాషల్లో రిలీజ్‌కు ఏర్పాట్లు జరిగిపోయాయి. మేము డేట్ మార్చుకోలేని పరిస్థితి. 11వ తేదీ గానీ, 14వ తేదీ గానీ రావడానికి వీలు కాదు. తెలుగు రాష్ట్రాలతోపాటు అన్నిభాషల్లో రిలీజ్ చేస్తున్నందున రిలీజ్ డేట్ మార్చుకోలేం. అంతేగానీ.. మీ సినిమా మీద కాంపిటిషన్‌గా వేయడం లేదు అని నిరంజన్ రెడ్డి చెప్పారు.

తెలంగాణలో సింగిల్ 75 స్క్రీన్లు ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లో సినిమా క్రేజ్ బట్టి స్క్రీన్లు కేటాయిస్తారు. కానీ 75 స్క్రీన్లలో మాదే గుత్తాధిపత్యం ఎందుకు? మాకు 15 నుంచి 20 స్క్రీన్లు ఇవ్వమని అడుగున్నాం. కంటెంట్‌ను బట్టి ఎవరి సినిమా ఏంటనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు అని నిరంజన్ రెడ్డి తెలిపారు.

నైజాం విషయానికి వస్తే.. జిల్లాలో మేము కొన్ని స్క్రీన్లను తీసుకొన్నాం. కానీ హైదరాబాద్ సిటీలోనే 78 స్క్రీన్లు ఉన్నాయి. వాటిలో 20 స్క్రీన్లు అడుగుతున్నాం. అయితే వారు ఇస్తారా? ఇవ్వరా? అనేది వేచి చూడాల్సిందే. మా సినిమా బాగుంటుంది. ప్రేక్షకులు ఎక్కడికైనా వెళ్లి చూస్తారనేది మా ఫిలింగ్. 75 స్క్రీన్లు ఉంటే.. అన్నీ మేము తీసుకొంటామంటే.. అది వివక్ష కాదా? అని నిరంజన్ రెడ్డి చెప్పారు.
హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నాం. అందుకని మేము ఏ సినిమాను చిన్నచూపు చూడటం లేదు. అయితే రిలీజ్ వాయిదా పడితే మాకు భారీగా నష్టం వాటిల్లుతుంది. సంక్రాంతికి హిందీ, తెలుగు, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఫిబ్రవరిలో చైనీస్, జపాన్, కొరియన్ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అని నిరంజన్ రెడ్డి చెప్పారు.

హనుమాన్ సినిమాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. మేము ఒంటరి పోరాటం చేస్తున్నాం. ఈ సినిమాకు చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వారు వస్తున్నారు. రవితేజ తన ఈగిల్ సినిమా ఉన్నా.. మా సినిమాలోని ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అందుకు థ్యాంక్యూ చెప్పడం చిన్న మాట అవుతుంది. అంత గొప్ప పనిచేశారు అని నిరంజన్ రెడ్డి తెలిపారు.


Click it and Unblock the Notifications











