HanuMan:పెద్ద సినిమా అని ఎలా డిసైడ్ చేస్తారు? మా మూవీని తొక్కేస్తే హనుమాన్ చూసుకొంటాడు..నిర్మాత నిరంజన్ రెడ్డి

సంక్రాంతి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద పండుగ. భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు పోటీ పడుతాయి. ఈ సారి గుంటూరు కారం, సైంధవ, నా సామి రంగ లాంటి పెద్ద చిత్రాలకు పోటీగా హనుమాన్ సినిమా బలంగా కనిపిస్తున్నది. ఈ సినిమాకు స్క్రీన్లు, థియేటర్ల కేటాయింపు సరైన శాతంలో దక్కడం లేదని నిర్మాత నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం‌బీట్‌‌తో ఆయన మాట్లాడుతూ..

Recommended Video

Guntur Kaaram పై నైతిక విజయం Hanuman దే Niranjan Reddy మహేష్ పోటీ అందుకే | Telugu Filmibeat

థియేటర్ల కేటాయింపు విషయానికి వస్తే.. మాది పెద్ద సినిమా అంటున్నారు. ఏ రకంగా పెద్ద సినిమా? బడ్జెట్ పరంగానా? స్టార్ పరంగానా? మరో రకంగానా? 175 కోట్లు పెట్టి తీసినందుకా? హనుమాన్ విషయానికి వస్తే.. 75 కోట్లతో చిన్న హీరోతో పెట్టి సినిమా తీశాం. ఏ విధంగా పెద్ద సినిమా అని డిసైడ్ చేస్తారు? మా సినిమా ఎన్ని స్క్రీన్లు ఇస్తారో మీరే చెప్పండి అని నిర్మాత ప్రశ్నించారు.

HanuMan Producer K Niranjan Reddy emotional about Screen Allocation controversy in Telugu States

నిర్మాతగా హనుమాన్ సినిమా నాకు తొలి చిత్రం. ఇంత పెద్ద స్కేల్‌లో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అలాగే ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం ఓ గొప్ప అనుభవం. ఈ సినిమాపై ఇంత కాన్ఫిడెన్స్‌తో నాలుగైదు రెట్లు బడ్జెట్ పెరిగినా వెనుకాడలేదు. ప్రశాంత్ వర్మ విజన్ వల్లే ఈ సినిమా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించాను అని నిరంజన్ రెడ్డి చెప్పారు.

పౌరాణిక నేపథ్యంతో రూపొందుతున్న సినిమా కాబట్టి మేము ట్యాక్స్ మినహాయింపు కోసం మేము ప్రభుత్వ పెద్దలను కలువలేదు. మేము డేట్ కన్ఫార్మ్ చేసే నాటికి అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ న్యూస్ లేదు. కానీ హనుమంతుడే ఈ డేట్‌కు రావాలని కోరుకొన్నాడో. ఆయనే మమ్మల్ని తీసుకెళ్తున్నాడని నేను అనుకొంటున్నాం అని నిరంజన్ రెడ్డి తెలిపారు.

HanuMan Producer K Niranjan Reddy emotional about Screen Allocation controversy in Telugu States

అయితే హనుమాన్ సినిమాను మమ్మల్ని తొక్కేస్తున్నారా? అనే ప్రశ్న అందరిలో ఉంది. ఆ విషయం గురించి మేము ఏమీ మాట్లాడం. అలాంటిది జరిగితే.. మా దేవుడు హనుమాన్ చూసుకొంటారు. మేము ఏం చేయలో అది చేస్తాం. మాకు ఎక్కడా థియేటర్ల సమస్య లేదు. కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, ఓవర్సీస్‌లో మంచి స్క్రీన్లు లభించాయి అని నిరంజన్ రెడ్డి అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 1700 స్క్రీన్లు ఉంటే.. మేము ఎక్కువ అడగడం లేదు. వాటిలో 15 నుంచి 20 శాతం థియేటర్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మాది జెన్యూన్ కోరిక. మేము అడగడంలో న్యాయం ఉంది. 75 కోట్ల భారీ బడ్జెట్‌తో కంటెంట్ ఉన్న సినిమా తీశాం. అయితే థియేటర్ల కోసం చేయి చాపాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేలా నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X