HanuMan Vs Guntur Kaaram మీ బడ్జెట్ ఎంత? మీరెంతని ప్రశ్నించారు.. మేమేంటో చూపిస్తాం.. హనుమాన్ నిర్మాత

ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్న నిరంజన్ రెడ్డి తొలిసారి నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో యువ హీరో తేజా సజ్జా, వరలక్ష్మీ శరత్ కుమార్, అమృతా అయ్యర్ తదితరులు నటించారు. సంక్రాంతి బరిలో దూకిన ఈ చిత్రం జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. అయితే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా అదే రోజున రిలీజ్ కావడంతో స్క్రీన్ల విషయంలో వివాదం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో నిర్మాత కే నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..

Recommended Video

Guntur Kaaram పై నైతిక విజయం Hanuman దే Niranjan Reddy మహేష్ పోటీ అందుకే | Telugu Filmibeat

హనుమాన్ సినిమా రిలీజ్ డేట్‌ను ముందుగా ప్రకటించాం. దాని ప్రకారమే విడుదల చేస్తున్నాం. కానీ కొందరు మాత్రం ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం డేట్ ప్రకటించారనే ఫీలింగ్‌తో ఉన్నారు. కావాలంటే వెనక్కి వెళుతారని అనుకొన్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాకు బజ్ విపరీతంగా పెరిగిపోవడంతో అంచనాలు పెరిగాయి. అదే రిలీజ్ డేట్‌ను కంటిన్యూ చేస్తున్నాం. మేము ఎందుకు జనవరిలోనే వస్తున్నామో క్లియర్‌గా చెప్పాం అని నిరంజన్ రెడ్డి చెప్పారు.

HanuMan Producer Niranjan Reddy Sensational comments on Competition with Mahesh Babus Guntur kaaram

స్క్రీన్లు లభించడం లేదనే మాట వాస్తవమే. కానీ హెల్తీ కాంపిటిషన్ ఉండాలి. ఫైట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఫైట్ లేకుండా అంతా మాకే కావాలి అంటే అది సరికాదు. మా సినిమాకు బజ్, క్రేజ్ ఉంది. ఇంతకు ముందు మీ రెవెన్యూ ఎంత? మీరు ఎంత అని ప్రశ్నించారు. అయితే మా కంటెంట్‌తో మేమేంటో చూపిస్తాం అని నిరంజన్ రెడ్డి చెప్పారు.

మా సినిమాకు తగినన్నీ థియేటర్లు ఇవ్వండని కోరుకొంటున్నాం. వాటి కోసం ఫైట్ చేస్తున్నాం. 12వ తేదీన ప్రాపర్‌గా రిలీజ్ చేయాలని అనుకొంటున్నాం. మా సినిమాకు ఉన్న బజ్‌కు తగినట్టుగా స్క్రీన్లు లేవనేది అందరికి తెలుసు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు వచ్చి సినిమా చూస్తారు. కాబట్టి మాకు గౌరవప్రదంగా స్క్రీన్లు కేటాయించాలని అడుగుతున్నాం అని నిరంజన్ రెడ్డి చెప్పారు.

HanuMan Producer Niranjan Reddy Sensational comments on Competition with Mahesh Babus Guntur kaaram

హనుమాన్‌ సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా 1700 స్క్రీన్లు ఉన్నాయి. ఏపీ, నైజాంలో తప్ప మాకు ఎక్కడా ఇబ్బంది లేదు. నార్త్ ఇండియా, కర్ణాటక, కేరళలో మాకు స్క్రీన్ల సమస్య లేదు. 1700 స్క్రీన్లలో 1000 ఇవ్వమని అడగడం లేదు. మాకు 25 శాతం స్క్రీన్లు ఇస్తే చాలూ అని అనుకొంటున్నాం అని హనుమాన్ నిర్మాత అన్నారు.

హనుమాన్ సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బంది ఉంది. మేము ఎవరిని టార్గెట్ చేయడం లేదు. సంక్రాంతి పండగకు ఐదు సినిమాలు వస్తున్నాయి. మా సినిమాకు మంచి రెస్సాన్స్ వస్తున్నది. ఆ సినిమాల స్కేల్ బట్టి స్క్రీన్లు కేటాయించమని కోరుతున్నాం. మేము రిక్వెస్ట్ మాత్రమే చేయగలుగుతాం. ఏం జరుగుతుందో వేచి చూస్తాం. ఆ తర్వాత ప్రజలే క్లియర్ సమాధానం చెబుతారు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X