యవ్వనంతో కనిపించాలనుకొంటున్నారా? బ్రహ్మాజీ చెప్పిన సూపర్ చిట్కా‌తో ముసలితనం దూరం!

టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు, సోషల్ మీడియా సెన్సేషన్ ప్రణవి మానుకొండ జంటగా పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ రూపొందించిన చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్. మిక్ మూవీస్ బ్యానర్‌పై నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపురెడ్డి ఈ సినిమాను నిర్మించారు.జూలై 29వ తేదీన రిలీజవుతున్న ఈ సినిమాలో బ్రహ్మజీ కీలక పాత్రను పోషించారు.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బ్రహ్మాజీ మీడియాతో మాట్లాడుతూ..

సాధారణంగా కామెడీ పాత్రలకు పరిమితవుతున్న నాకు విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం రాదు. కానీ స్లమ్ డాగ్ హస్పెండ్ చిత్రంలో విలక్షణమైన పాత్ర లభించింది. ఈ చిత్రంలో పాతబస్తీలో ఉండే లాయర్‌గా నటించాను. విడాకులు ఇప్పించే స్పెషలిస్టు లాయర్‌గా కనిపించబోతున్నాను అని బ్రహ్మాజీ చెప్పారు.

Health Tip for ever young revealed by Actor Brahmaji at Slum Dog Husband promotion

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా సమయంలో నిర్మాతలు అప్పిరెడ్డి స్టోరి, కాన్సెప్ట్ చెప్పారు. కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నచ్చింది. మీరు వినండి.. వీలైతే ఎలా ఉందో చెప్పండి అన్నారు. శ్రీధర్ కథ చెప్పిన తర్వాత కొత్తగా, బాగుందనిపించింది. ఆ సమయంలో లాయర్ పాత్రలో నటిస్తారా? అని అడిగారు. ఈ తర్వాత నా కుమారుడు సంజయ్‌ హీరోగా ఎపిక కావడంతో మూవీ మొదలైంది.

నా కుమారుడు సంజయ్ వాస్తవంగా జంతు ప్రేమికుడు. డాగ్స్ అంటే చాలా ఇష్టం. దాంతో ఈ కాన్సెప్ట్ సంజయ్‌కి బాగా నచ్చింది. ఈ మధ్య పుష్ప 2 సినిమా షూటింగులో ఉన్నప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చూపించాను. ఆ ట్రైలర్ చూసి బన్నీ బాగా మెచ్చుకొన్నాడు. పుష్ప టీమ్ మొత్తం ఈ ట్రైలర్ చూసి అప్రిషియేట్ చేశారు అని బ్రహ్మాజీ తెలిపారు.

సినిమా పరిశ్రమలో నాకు మంచి స్నేహితుడు సప్తగిరి ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు చాలా హిలేరియస్‌గా ఉంటాయి. ఫిష్ వెంకట్ జడ్జీగా నటించారు. కోర్టు రూమ్ సీన్లు చాలా బాగుంటాయి. కడుపుబ్బ నవ్విస్తాయి అని బ్రహ్మాజీ చెప్పారు.

Health Tip for ever young revealed by Actor Brahmaji at Slum Dog Husband promotion

స్లమ్ డాగ్ హస్పెండ్ కథ వినగానే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫన్నీగా ఫీలయ్యాడు. ఆ తర్వాత ఈ సినిమాకు కుక్క మొగుడు అని టైటిల్ పెట్టమని అడిగాడు. అయితే ఈ కథను బట్టి స్లమ్ డాగ్ హస్బెండ్ అని పెడుదామని నిర్మాతలు చెప్పారు.

స్లమ్ డాగ్ హస్పెండ్ సినిమాకు అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన స్టార్ డైరెక్టర్. ఆయన మెడ మీద కత్తి పెట్టి ప్రమోషన్ చేయించాల్సిన అవసరం లేదు. ఆయన ఈ కథ విన్న తర్వాత ప్రమోషన్ చేస్తానని చెప్పారు. ప్రమోషన్ కోసం స్క్రిప్టు రాసి.. ఆయన చేయమని చెప్పారు. అలా స్వయంగా స్క్రిప్టు రాసి ప్రమోషన్ వీడియో తీయడం గొప్ప విషయం. ఈ సినిమాకు ప్రతీ ఒక్కరు సహాయం చేశారు. ప్రదీప్, ఆలీ, నాగార్జున అక్కినేనికి ధన్యవాదాలు అని బ్రహ్మాజీ తెలిపారు.

స్లమ్ డాగ్ హస్పెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు సుకుమార్ రావాల్సింది. కానీ అమెరికాకు వెళ్లాల్సి రావడంతో హాజరు కావడం లేదు. కానీ ఆయన వీడియో మెసేజ్ పంపిస్తానని చెప్పారు. ఒకవేళ ఇక్కడ ఉంటే ఆయన తప్పకుండా వచ్చేవారు అని బ్రహ్మాజీ చెప్పారు.

Health Tip for ever young revealed by Actor Brahmaji at Slum Dog Husband promotion

ముఖం మీద ముడతలు వస్తే ముసలివాడిగా కనిపిస్తారు. మీరు ఎప్పుడు నవ్వుతూ, చిరునవ్వుతో ఉంటే మీరు యంగ్‌గా కనిపిస్తారు. మీరు ఎప్పుడూ ప్రశాంతంగా, నవ్వుతూ ఉంటే యవ్వనంతో ఉంటారు అని తన గ్లామర్ సీక్రెట్ చెప్పారు.

స్లమ్ డాగ్ హస్పెండ్ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. అద్బుతమైన పాటలు అందించారు. మాస్, మెలోడిని కలిపి అందించిన పాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటికే మ్యూజికల్ హిట్‌గా నిలిచి ఆడియెన్స్‌కు మంచి జోష్ కలిగిస్తున్నాయి అని బ్రహ్మాజీ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X