twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. వల్గారిటీ లేదు కానీ అలాంటి కామెడీ ఉంది: 4 లెట‌ర్స్ హీరో ఈశ్వ‌ర్‌

    |

    ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు, ఆర్‌ ర‌ఘురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో 4 లెట‌ర్స్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సంద‌ర్భంగా యంగ్ హీరో ఈశ్వ‌ర్ మీడియాతో మాట్లాడారు. బాగా చ‌ద‌వ‌డం, మంచి మార్క‌లు తెచ్చుకోవ‌డం, ఉద్యోగం సంపాదించ‌డం, ల‌క్ష‌ల్లో జీతాలు తీసుకోవ‌డం ఇదేనా లైఫంటే..? ఇంత‌కు మించి ఏమీ లేదా? అని ఆలోచిస్తోన్న క్ర‌మంలో నాకు ఎంతో ఇష్ట‌మైన సినిమా రంగం ప‌ట్ల ఆకర్షితుడ‌య్యాను. దీన్నే నా వృత్తిగా తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకోని హీరోగా 4లెట‌ర్స్ సినిమా చేసానంటున్నారు ఈశ్వ‌ర్‌. ఆయన ఇంకా ఏమన్నారంటే.

    సత్యానంద్ వద్ద నట శిక్షణ

    సత్యానంద్ వద్ద నట శిక్షణ

    గ‌తేడాది వైజాగ్‌లో ప్రముఖ రచయిత, నట శిక్షకుడు స‌త్యానంద్ వ‌ద్ద మూడు నెల‌లపాటు యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకున్నాను. వారి ద‌గ్గ‌రే సినిమా గురించి, ఓ నటుడికి కావాల్సిన క్రమశిక్షణ, అంకితభావంపాటు, యాక్ట‌ర్‌గా చేయాల్సిన హార్డ్ వ‌ర్క్ గురించి తెలుసుకున్నాను. అలాగే అమెరికాలో ఉన్న‌ప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఆ అనుభ‌వం ఈ సినిమాకు చాలా ఉపయోగపడింది. అలాగే `ఆ ఇద్ద‌రూ` అనే ఒక షార్ట్ ఫిలింలో న‌టించాను. దానికి మంచి కాంప్లిమెంట్స్ వ‌చ్చాయి.

    అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత

    అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత

    అమెరికాలో నా ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఇండియాకు కెళ్లి సినిమా రంగంలో రాణించాలని అనుకొన్నాను. అలా ట్రయల్స్ చేస్తున్న సమయంలోనే మా తల్లిదండ్రులు సొంత బ్యానర్‌పై సినిమా చేద్దామని అన్నారు. అలా 4 లెటర్స్ అనే సినిమా అవకాశం వచ్చింది. సొంత బ్యానర్‌లో చేయడం చాలా కంఫ‌ర్ట్ గా అనిపించింది. ఇంట్లోనే నాన్న‌, బాబాయి అన్న‌ట్టు ఉండేవాళ్లం. సెట్స్ మీద‌కు వెళితే...ఎవ‌రి చాలా ఫ్రొఫెష‌న‌ల్ గా ఉండేవాళం. మా ఫాద‌రే ప్రొడ్యూస‌ర్ కావ‌డంతో ఫ‌స్ట్ నుంచి ప్రొడ‌క్ష‌న్ గురించి తెలుసుకునే అవ‌కాశం క‌లిగింది. ప్ర‌తిది ప్లానింగ్ ప్రకారం వెళ్లడంతో ఎక్క‌డ మ‌నీ వేస్ట్ కాకుండా అనుకున్న టైమ్ కు సినిమా తీయ‌గ‌లిగాం.

     4 లెటర్స్‌పై డైరెక్టర్‌కు ఫుల్ క్లారిటీ

    4 లెటర్స్‌పై డైరెక్టర్‌కు ఫుల్ క్లారిటీ

    4 లెటర్స్ సినిమా కథపై దర్శకుడు ర‌ఘురాజ్‌కు పూర్తి క్లారిటీ ఉంది. ఫుల్ స్క్రిప్ట్, లొకేష‌న్స్, షెడ్యూల్స్‌తోపాటు ఫోన్‌లో కథ చెప్పారు. మొదటి నేరేషన్‌లోనే కథ నచ్చడంతో సినిమా ఆరంభించాం. షూటింగ్‌కు రెండు నెలల ముందు వర్క్‌షాప్ చేశాం. ఆయన పర్యవేక్షణలో నటనలోని మెలకువలు నేర్చుకొన్నాను. దర్శకత్వ విభాగంలో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ప‌ది సినిమాల‌కు పైగా చేశారు. అంత ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న ద‌ర్శ‌కుడుతో సినిమా చేస్తే బావుంటుంద‌నిపించింది. నా ఫ‌స్ట్ సినిమానే బెస్ట్ డైర‌క్ట‌ర్ తో చేశానన్న సంతృప్తి ఉంది.

    కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్

    కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్

    కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జ‌రిగే క‌థ ఇది. ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంది. ఏంటి? అన్న క‌థాంశానికి ల‌వ్‌, ఎంట‌ర్ టైన్ మెంట్ మిక్స్ చేసి `4లెట‌ర్స్` సినిమాను తెర‌కెక్కించారు మా డైర‌క్ట‌ర్. స్టూడెంట్స్ త‌ల‌చుకుంటే ఏమైనా చేయ‌గ‌ల‌రు అనే సందేశాన్ని ఫైన‌ల్ గా ఇచ్చాము. స్టూడెంట్స్‌తో పాటు అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా సినిమా ఉంటుంది. క్లైమాక్స్ లో వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.

    విజ్‌వల్‌గా వల్గారిటీ ఉండదని

    విజ్‌వల్‌గా వల్గారిటీ ఉండదని

    డైలాగ్స్‌తోనే కామెడీ జ‌న‌రేట్ చేశాం. విజువ‌ల్‌గా అయితే వ‌ల్గారిటీ ఉండ‌దు. ప్ర‌జంట్ యూత్ ఎలా బిహేవ్ చేస్తున్నారో..వారు ఎలా మాట్లాడుకుంటున్నారో అలా నాచ‌రుల్‌గా త‌ప్ప వాంటెడ్‌గా డ‌బుల్ మీనింగ్ డైలాగులు పెట్ట‌లేదు. బెంగాల్ టైగ‌ర్, పేప‌ర్ బాయ్, గ‌రుడవేగ (డియో డియో) చిత్రాల‌కు ప‌ని చేసిన భీమ్స్ మా సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రెండు మాస్, రెండు వెస్ట్ర‌న్ సాంగ్ ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. అలాగే రీరికార్డింగ్ కూడా అద్భుతంగా ఇచ్చారు. అలా సినిమాటోగ్ర‌ఫీ, గ‌ణేష్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌.

    విక్టరీ వెంకటేష్ ప్రశంసతో

    విక్టరీ వెంకటేష్ ప్రశంసతో

    విక్టరీ వెంకటేష్‌కు 4 లెటర్స్ ట్రైలర్ చూపించాం. ఆయన చూసిన తర్వాత మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. యాక్టర్‌గా రాణించడానికి కావాల్సిన సలహాలు ఇచ్చారు. చిత్రాలను ఎలా ఎంపిక చేసుకోవాలి అనే విషయాలు చెప్పారు. F2 బిజీలో కూడా దాదాపు 30 నిమిషాలు కేటాయించి మాతో చాలా ఓపెన్‌గా మాట్లాడాను. వెంకటేష్ ఇచ్చిన ప్రశంసలు మరిచిపోలేనటువంటివి. వెంకటేష్‌తో మాట్లాడటం ఓ యాక్టింగ్ క్లాస్‌లా అనిపించింది.

    రిలీజ్‌కు ముందు చాలా టెన్షన్‌

    రిలీజ్‌కు ముందు చాలా టెన్షన్‌

    తొలి సినిమా కావడం, సొంత బ్యానర్‌లో నిర్మించడంతో రిలీజ్‌కు ముందు కొంచెం టెన్ష‌న్ అయితే ఉంది. కానీ మొద‌టి నుంచి నా మెంటాల్టీ ఏంటంటే ..ఏ ప‌ని చేసిన హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎఫ‌ర్ట్ పెడ‌తాను. కాబ‌ట్టి క‌చ్చితంగా స‌క్సెస్ అవుతామ‌న్న న‌మ్మ‌కం ఉంది. హిట్ట‌యితే నాన్నకు నేనిచ్చే రిట‌న్ గిఫ్ట్ అవుతుంది.

    English summary
    Youthful entertainer 4 letters movie set to release on February 22nd. Dommaraju Uday Kumar is the producer movie. R Raghu Raj is the director. Eshwar is introducing as hero with this movie. In this occassion, Eshwar speaks to Telugu filmibeat Exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X