Prabhas మూవీలో విలన్‌గా అవకాశం వస్తే.. గోపిచంద్ ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే?
మాచో స్టార్ గోపిచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. సీనియర్ హీరో జగపతి బాబుతో కలిసి మూడోసారి నటిస్తున్న ఈ చిత్రానికి లౌక్యం, లక్ష్యం చిత్రాలను రూపొందించిన శ్రీవాసు దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, కుష్బూ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తున్నది. నిర్మాతలు టి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో హీరో గోపిచంద్ తెలుగు ఫిల్మీ బీట్‌తో మాట్లాడుతూ..
బాలకృష్ణ సలహా వల్లే: రామబాణం సినిమాకు లక్ష్యం మూవీకి ఎలాంటి కనెక్షన్ లేదు. ఈ సినిమాకు లక్ష్యం, లౌక్యం మాదిరిగా రెండు అక్షరాల టైటిల్ పెడుదామని అనుకొంటున్న సమయంలో నేను ప్రభాస్ అన్‌స్టాపబుల్ షోకు వెళ్లడం.. ఆ సమయంలో ఏం సినిమా చేస్తున్నారని బాలకృష్ణ అడిగారు. దాంతో అన్నదమ్ముల కథతో సినిమా చేస్తున్నామంటే.. రామబాణం అని టైటిల్ పెట్టండి అని సూచించారు. దాంతో మేము కూడా టైటిల్ బాగుందని దానినే ఫైనలైజ్ చేశాం అని గోపిచంద్ అన్నారు.

రాముడి లాంటి అన్నయ్యకు: రాముడి లాంటి అన్నయ్యకు భక్తుడి లాంటి తమ్ముడు క్యారెక్టర్ నాది. రాముడి మాటను శిరసావహిస్తారు. రాముడి మాటను జవదాట కుండా ఉండారు. నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. నా క్యారెక్టర్‌లో ఎమోషనస్, పలు వేరియేషన్స్ ఉంటాయి. జగపతి బాబు క్యారెక్టర్ ఈ సినిమాకు చాలా కీలకం. ఆ పాత్ర పడితే తప్ప సినిమా ఓ రేంజ్‌లో ఉండదు. అందుకే నేను నా క్యారెక్టర్‌కు అనవసరపు ఎలివేషన్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకొన్నాం అని గోపిచంద్ చెప్పారు.

ప్రభాస్ మూవీలో విలన్‌గా: గతంలో నేను ప్రభాస్‌కు అపోజిట్‌గా విలన్ వేషం వేశాను. ప్రస్తుతం మళ్లీ అవకాశం వస్తే తప్పకుండా ప్రభాస్‌కు విలన్‌గా చేయడానికి సిద్దంగా ఉన్నాను. జయం, నిజం, వర్షం లాంటి సినిమాల్లో స్థాయి విలనిజం ఉండే క్యారెక్టర్‌ను చేయడానికి ఎప్పుడూ సిద్దమే. నా క్యారెక్టర్ బలంగా ఉండి.. కథను ఎలివేట్ చేసేలా ఉండే విలన్ పాత్రలు చేయడానికి రెడీ అని అన్నారు.

స్వర్గీయ టీ కృష్ణ లెగసీని: మా నాన్న స్వర్గీయ టీ కృష్ణ గారి వారసత్వాన్ని, లెగసీని కొనసాగించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. మా నాన్న గారు స్థాపించిన ఈతరం ఫిలింస్ బ్యానర్‌లో సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఆయన స్థాయికి తగిన కథలు దొరకడం ఛాలెంజ్‌గా నిలుస్తుంది. మంచి కథ నాకు నచ్చేలా ఉండాలి. మంచి స్క్రిప్టు కోసం కథలు వింటున్నాను. మంచి కథ దొరికితే నేను సినిమా నిర్మించడానికి రెడీగా ఉన్నాను అని గోపిచంద్ అన్నారు.

రామబాణం ఎలా ఉంటుందంటే?: వెండి తెర మీద మంచి అనుభూతి కోసం ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. అలాంటి ప్రేక్షకులకు మంచి ఎమోషన్స్‌తోపాటు వినోదాన్ని కూడా రామబాణం అందిస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను రామబాణం సినిమా నిరాశపరచదు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూశామనే తృప్తిని అందిస్తుంది అని గోపిచంద్ తెలిపారు.


Click it and Unblock the Notifications











